సాక్షి, హైదరాబాద్: నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని యెల్లో బ్యాచ్ గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేశారాయన.
చంద్రబాబు, లోకేష్‌తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది యెల్లో మీడియా. ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు అల్లుకుంటూ వస్తోంది. అయితే తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారాయన.
డిసెంబర్ చివరి వారంలో ఒకే ఫ్లైట్‌లో నారా లోకేష్‌తో కలిసి విజయవాడకు వెళ్లిన విషయాన్ని యాంకర్ ప్రశ్నించారు. దానికి ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబును కలవడానికే తాను విజయవాడకు వెళ్లానని చెప్పారాయన. అయితే చంద్రబాబుకి తనకు కామన్ స్నేహితుడైన ఓ పెద్ద నేత.. చంద్రబాబు తనను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే విజయవాడకు చంద్రబాబును కలవడానికి మాత్రమే వెళ్లానని చెప్పారాయన.
గతంలో తాను వైఎస్సార్‌సీపీ జగన్‌మోహన్‌రెడ్డికి మద్ధతుగా పని చేశానని, ఈసారి తమ కోసం కోసం పని చేయాలని ఆ మీటింగ్‌లో చంద్రబాబు తనను కోరారని పీకే వివరించారు. అయితే అందుకు తాను కుదరని స్పష్టం చేశానని పీకే వివరించారు. అంతేకాదు ఈసారి ఏపీలో అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రతిపక్షానికి ఏ పార్టీకి తాను పని చేయబోనని క్లారిటీ ఇచ్చారాయన. తాను ఎన్నికల వ్యూహకర్త పనికి దూరంగా ఉంటున్న విషయాన్నే తమ కామన్ స్నేహితుడికి చెప్పానని.. అయితే అదే విషయాన్ని చంద్రబాబుని స్వయంగా కలిసి చెప్పాలని ఆయన సూచించారని.. అందుకే తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని పీకే స్పష్టత ఇచ్చారు. దీంతో ఇంతకాలం గంపెడు ఆశలు పెట్టుకున్న యెల్లో బ్యాచ్ ఢీలా పడిపోతోంది.
చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor
— Actual India (@ActualIndia) January 23, 2024
దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు
ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG
Video Credits:Actual India
ఇదీ చదవండి: కష్టం... నేనిప్పుడు ఏమీ చేయలేను
Comments
Please login to add a commentAdd a comment