March 18th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | Andhra Pradesh Assembly Election 2024: March 18 Political Updates | Sakshi
Sakshi News home page

March 18th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పటి సమాచారం

Published Mon, Mar 18 2024 6:30 AM | Last Updated on Mon, Mar 18 2024 9:08 PM

Andhra Pradesh Assembly Election 2024: March 18 Political Updates - Sakshi

AP Elections March 18th Latest News Telugu

08:50 PM, మార్చి 18 2024

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు

  • వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
  • ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం
  • సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
  • ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు
  • 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం
  • ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో

07:50 PM, మార్చి 18 2024

తాడేపల్లి:

సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్..

  • టీడీపీ, జనసేన, బీజేపీలు పదేళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం ప్రారంభించాయి
  • పొత్తులు లేనిదే చంద్రబాబు పోటీ చేయలేరు
  • 2014లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏం మేలు చేశారు?
  • నాలుగేళ్ల తర్వాత మళ్ళీ విడిపోయి ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు
  • మోదీని చంద్రబాబు అడ్డమైన మాటలు అన్నారు
  • పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని
  • అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి 
  • 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి
  • అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు
  • రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి
  • మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు? 
  • ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి
  • కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?
  • ప్రధానిని సైతం అవమానపరిచారు 
  • కాంగ్రెస్, వైసీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా? 
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు? 
  • నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి
  • జగన్ ప్రభుత్వంలో 87% కుటుంబాలు లబ్ది పొందాయి
  • అందుకే సీఎం జగన్‌ను ప్రజలు ఓన్ చేసుకున్నారు
  • షర్మిళ ఎక్కడ నుండైనా పోటీ చేయొచ్చు
  • కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు

07:29 PM, మార్చి 18 2024

ప్రధాని మోదీని ఆనాడు బాబు ఇష్టానుసారం దూషించారు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఏ మొహం పెట్టుకొని ముగ్గురు స్టేజ్‌పైకి వచ్చారు
  • పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం
  • పొత్తులు వారికి కొత్త కాదు
  • ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారు
  • నాడు విడాకులు తీసుకొని విడిపోయి దూషించుకున్నారు

07:14 PM, మార్చి 18 2024

తాడేపల్లి :

అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది
వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్‌

  • ఎన్నికల షెడ్యూలు వల్ల ఈ వెసులుబాటు వచ్చింది
  • ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
  • ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి
  • సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి

07:10 PM, మార్చి 18 2024

తాడేపల్లి: 

భారీ ప్రచారానికి వైఎస్‌ జగన్‌ సిద్ధం

  • తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు
  • మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర ఈనెల 26 లేదా  27 తేదీన ప్రారంభం
  • దాదాపు 21రోజులపాటు పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
  • రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభల నిర్వహణ
  • ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో " మేమంతా సిద్ధం " ,పేరుతో బస్సు యాత్ర
  • బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్ జగన్
  • బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్
  • మీడియాతో పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురామ్.

06:20 PM, మార్చి 18 2024

పిఠాపురం:
కార్యకర్తలతో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్‌ వర్మ సమావేశం

  • ఇప్పుడు జనసేనలో ఉన్నవాళ్లు నిజమైన కార్యకర్తలు కాదు
  • కొత్త జనసేన వాళ్లు మనల్ని కొడతారు..కేసులు పెడతారు
  • టీడీపీ నుంచి విసిరేసినవాళ్లను జనసేన కొనుక్కుంది
  • కాకినాడ నుండి వచ్చిన వాళ్లు మాస్కులు పెట్టుకుని జనసేనలో చేరుతున్నారు
  • పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలి
  • కొత్త జనసేన వాళ్లు టిడిపి వాళ్ళను కొడతారు..కేసులు పెడతారు
  • టిడిపి నుండి విసిరేసిన వాళ్ళని....కొనుక్కున్న వాళ్ళు జనసేన ఉన్నారు
  • వాళ్ళు టీడీపీనే తొక్కి రాజకీయాలు చేశారు
  • చివరికి నన్ను హత్య కేసులో ఇరికించాలనుకున్నారు.

05:49 PM, మార్చి 18 2024

విశాఖ: 

విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించాలని కోరుతున్నాం
మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు

  • మిత్ర పక్షం టీడీపీ కూడా ఇదే సీటు కావాలని అడుగుతుంది..
  • 2014లో విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు
  • అంతే కాకుండా విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది అందుకే టికెట్ బీజేపీ అభ్యర్థికే ఇవ్వాలని కోరుతున్నాం
  • 2019 ఎన్నికల్లో 4వేల ఓట్ల తేడాతో టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ ఓడిపోయారు కనుక ఆయనకే టికెట్ ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతుంది

05:14 PM, మార్చి 18 2024

తాడేపల్లి :

క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశం

  • సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం
  • జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మ్యానిఫెస్టో తదితర అంశాలపై చర్చ
  • మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై దిశానిర్దేశం చేయనున్న జగన్

04:30 PM, మార్చి 18 2024

విజయవాడ: 
పవన్‌ రూ. 500 కోట్లు తీసుకుని 21 సీట్లకి సరెండర్‌ అయ్యాడు: కేఏ పాల్‌

  • 2014లో మోదీ మోసం చేశాడు
  • ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్‌ చప్పట్లు కొడుతున్నాడు
  • రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్‌ పార్టీ
  • నన్ను వైజాగ్ ఎంపీని చేస్తే దేశాన్ని బాగు చేస్తాను. లేకపోతే ప్రజలే నష్టపోతారు

03:19 PM, మార్చి 18 2024

గుంటూరు:

తెలుగుదేశం పార్టీపై మండిపడ్డ బీసీ సంఘాలు

  • తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది
  • 50 శాతం ఉన్న బీసీలను అసలు మనుషులుగా కూడా చూడలేదు
  • బీసీలు ఓట్లు వేసే యంత్రాలు అనుకుంటున్నారు
  • గుంటూరులో టీడీపీ పార్టీ కోసం పనిచేసే పేదల డాక్టర్ గా ఉన్న శేషయ్యను వాడుకుని వదిలేసింది 
  • ఎక్కడో అమెరికా నుంచి డబ్బులు ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు  ఇవ్వటం దారుణం
  • ఎన్నారైలు వస్తారు డబ్బులు సంపాదించుకుంటారు వెళ్ళిపోతారు
  • మంగళగిరి సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది
  • సామాజిక న్యాయం అంటే అది
  • కానీ లోకేష్ మాత్రం వైఎస్సార్‌సీపీకి చెందిన బీసీ అభ్యర్థి పైన పోటీ చేసి వారిని ఆనగదొక్కడానికి రెడీ అయ్యారు
  • లోకేష్ మంగళగిరి నుంచి పోటీలో తప్పుకుని ఆ సీటును బీసీలకు ఇవ్వాలి
  • తెలుగుదేశం పార్టీ డబ్బు సంచులను మోసుకొచ్చే కంచర గాడిదలకు సీట్లు ఇస్తుంది
  • కృష్ణ , ఎన్టీఆర్, గుంటూరు ,నరసరావుపేట ,బాపట్ల లోక్సభ పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా అవకాశం కల్పించలేదు
  • తెలుగుదేశం పార్టీ యాదవుల నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం

03:12 PM, మార్చి 18 2024

ప్రకాశం

  • కొండేపిలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆద్వర్యంలో టీడీపీ నుండి వైఎస్సార్‌సీపీలో చేరిన పది కుటుంబాలు

02:43 PM, మార్చి 18 2024

జగ్గంపేట(కాకినాడ జిల్లా): 

  • కిర్లంపూడి మండలం వీరవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సమక్షంలో పార్టీలో చేరిన కొత్తపల్లి టీడీపీకి చెందిన 25 కుటుంబాలు

02:33 PM, మార్చి 18 2024

తిరుపతి:

నగర కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు : రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ 

  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదు
  •  తిరుపతి నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న అన్ని పోస్టర్లను, బ్యానర్లను తొలగించడం జరిగింది
  • , ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్లు నగరంలో పర్యటిస్తూ నియమ నిబంధనలు పటిష్టంగా అమలు పరిచేలా తగు చర్యలు తీసుకుంటున్నాం
  • ఎన్నికల నిబందనలకు వ్యతిరేకంగా ఎవరైన ప్రవర్తిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటాం

02:25 PM, మార్చి 18 2024

తిరుపతి జిల్లా: 

  • సత్యవేడు టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు
  • సత్యవేడు మండల కేంద్రంలోని భేరి శెట్టి కళ్యాణమండపంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం
  • వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల ఆందోళన
  • సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలానికి ఎట్టి పరిస్థితిలో సహకరించేది లేదని స్పష్టం చేసిన తెలుగు తమ్ముళ్లు
  • టీడీపీ పార్టీలో చేరకుండానే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారంటూ నిలదీత
  • చంద్రబాబు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని నాయకులు కార్యకర్తలు డిమాండ్

02:22 PM, మార్చి 18 2024

కాకినాడ జిల్లా:

  • జగ్గంపేటలో టీడీపీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
  • మెయిన్ రోడ్డులో అన్న క్యాంటిన్ వద్ద టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు
  • ఎన్టీఆర్ విగ్రహనికి వేయని ముసుగు

02:20 PM, మార్చి 18 2024
‘మేమంతా సిద్ధం’ పేరు సీఎం జగన్‌ బస్సు యాత్ర..

  • భారీ ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం
  • తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభ
  • మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర
  • రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ
  • ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర
  • బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్
  • బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్
  • మరో వారంరోజుల్లో బస్సు యాత్ర ప్రారంభం
  • ఈనెల 26 లేదా 27 తేదీల్లో ప్రారంభం
  • దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర
  • ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర
  • ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ
  • ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ
  • బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడి

02:10 PM, మార్చి 18 2024
టీడీపీ అభ్యర్ధి కొలికపూడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్వామిదాస్

  • ఒక కుహనా మేధావి తిరువూరుకు వచ్చాడు
  • రంగా హత్యకు వైఎస్సార్ కారణమని ఓ కుక్క మొరుగుతోంది 
  • కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు
  • కొలికపూడి ఒక కుసంస్కారి
  • కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు
  • విద్యార్ధి దశ నుంచే రంగా గురించి నాకు తెలుసు 
  • రంగా ఒక్క కాపు కులానికి చెందిన వ్యక్తి కాదు.. రంగా అందరి మనిషి
  • తిరువూరులో 70 వేల మంది ఎస్సీల్లో చంద్రబాబుకు ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా? 
  • చందాలు వసూలు చేసి వాటాలు పంచుకోవడానికే కొలికపూడిని తిరువూరు పంపించారు
  • నేను పక్కా లోకల్.. తిరువూరులోనే పుట్టాను. 
  • జీవితాంతం తిరువూరులోనే ఉంటాను. 
  • చంద్రబాబు తన ప్రధాన శత్రువు మోదీతో జీవితంలో కలవనన్నాడు
  • ఇప్పుడు తన స్వార్ధం కోసం.. తన కొడుకుని సీఎం చేయడానికి చేతులు కలిపాడు
  • ఏం చేశారని మోదీతో చేతులు కలిపాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి 
  • చంద్రబాబు, పవన్ జిమ్మిక్కులను కాపులు నమ్మరు
  • సీఎం జగన్‌కు ఓడించడానికి ముగ్గురూ కలిసి వస్తున్నారు 
  • ముఖ్యమంత్రి జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తారు
  • 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సభ్యుల్లో సగం బీసీలకు కేటాయించారు
  • కాపులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యం కల్పించారు 
  • కాపులను అన్ని విధాలా ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
  • కాపులను బిసిల్లో చేర్చాలని రంగా చేసిన పోరాటానికి వైఎస్సార్ అండగా నిలిచారు
  • నన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం
  • కాపులను మంత్రులు.. ఉపముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సీఎం జగన్‌
  • టీడీపీలో ఉన్న కాపులు ఆలోచించాలి
  • కాపులకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు
  • కాపులకు రిజర్వేషన్లు వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం
  • తిరువూరులో నల్లగట్ల స్వానిదాస్‌కు కాపులు అండగా నిలవాలి 
  • కాపులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉందనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
  • రేపట్నుంచే ప్రతీ గ్రామానికీ తిరిగి వైసీపీ చేసిన మేలును గుర్తు చేయాలి

01:45 PM, మార్చి 18 2024
సీనియర్లతో చంద్రబాబు సమావేశం

  • తన నివాసంలో టీడీపీ సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు నాయుడు
  • నిన్నటి ప్రజాగళం మీద సమీక్ష నిర్వహించిన టీడీపీ అధినేత
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగళం పేరిట మరిన్ని సభలు నిర్వహించాలని భేటీలో తీర్మానం

01:43 PM, మార్చి 18 2024
కాపు రాజ్యాధికారం జగన్‌ వల్లే సాధ్యమైంది: అడపా శేషు

  • పవన్ పార్టీ పెట్టిన తర్వాత కాపుల పరిస్థితి మరింత దిగజారిపోయింది 
  • జనసేన పెట్టి 11 ఏళ్లయ్యింది 
  • వైఎస్సార్‌సీపీ పెట్టి 14 ఏళ్లయ్యింది 
  • కాపుల పై ఒక ముద్ర వేశారు
  • ఈ ముద్ర వల్ల మనం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం
  • కాపులకు అండగా ఉంటానని జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు
  • 30 మందిని ఎమ్మెల్యేలను చేశారు ...మంత్రి పదవులిచ్చారు
  • కాపులు ఎవరికీ తలొంచరు...అదే మన ఆత్మవిశ్వాసం 
  • ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకూ కాపులను మంత్రులు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కింది
  • మనం కోరుకున్న రాజ్యాధికారం జగన్ మోహన్ రెడ్డి వల్లే దక్కింది 
  • జనసేనలో పవన్ వెనుక తిరిగిన వారు రాజ్యాధికారం కోరుకోరా?
  • ఇల్లూవాకిల్లు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి ?
  • 21 సీట్లు తీసుకుని తనను నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశాడు 
  • జగన్ మోహన్ రెడ్డి మనకు ఏంచేయలేదని వ్యతిరేకించాలి 
  • జగన్ మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారు
  • చెప్పాడంటే చేస్తాడంతే...అదే జగన్ మోహన్ రెడ్డి
  • పార్టీలతో పనిలేకుండా మనకు మేలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
  • కొలికపూడి శ్రీనివాస్ పై అడపా శేషు ఫైర్
  • రంగా హత్యకు వైఎస్సార్ కారణమని కొలికపూడి చాలా నీచంగా మాట్లాడుతున్నారు
  • రంగా హత్యకు కారణం ముమ్మాటికీ టీడీపీ,చంద్రబాబే
  • టీడీపీ పతనం వంగవీటి మోహన్ రంగా ఆశయం 
  • వంగవీటి మోహన్ రంగా మనకు ఇచ్చిన ఆయుధం జగన్ మోహన్ రెడ్డి 
  • టీడీపీకి ఓటేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలొస్తాయి...పథకాలు ఆగిపోతాయి
  • కాపులకు తిరువూరులో అండగా నిలబడే వ్యక్తి నల్లగట్ల స్వామిదాస్ 
  • మనకు రాజకీయ గురువు రంగా ఒక్కరే 
  • చిరంజీవి,పవన్ మనకి కేవలం సినిమా హీరోలు మాత్రమే 
  • వంగవీటి మోహన రంగా ముఖ్యమంత్రి అవుతారని తెలిసే టీడీపీ,చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు
  • పవన్ జనసేన పెట్టగానే చంద్రబాబు తన దొడ్లో కట్టేసుకున్నాడు

తిరువూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు వ్యాఖ్యలు

01:38 PM, మార్చి 18 2024
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం:నాదెండ్ల

  • చిలకలూరిపేట ప్రజాగళం సభపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పందన
  • ప్రధాని సభలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుందని వ్యాఖ్య
  • ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న నాదెండ్ల
  • టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కొందరికి నచ్చట్లేదు.. అందుకే పొత్తులపై అపోహ సృష్టించే యత్నమన్న నాదెండ్ల
  • దుష్ప్రచారాలను నమ్మొద్దు.. తిప్పికొట్టాలంటూ జనసేన కేడర్‌కు నాదెండ్ల పిలుపు

01:25 PM, మార్చి 18 2024
నితీశ్‌లాగే చం‍ద్రబాబు కూడా.. : ఆదినారాయణ రెడ్డి

  • బీహార్ లో నితీష్ కుమార్ ఎన్నోసార్లు బయటకి వచ్చి మళ్లీ ఎన్డీయేలో చేరలేదా?
  • చంద్రబాబు కూడా అంతే! 
  • ప్రత్యేక‌హోదా కోసం బయటకి వచ్చారు.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి  ఇవాళ ఎన్డీయేలో చేరారు
  • ఏపీలో కూడా ఎన్డియే ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నా
  • ఏపీ ఎన్నికల గురించే నిన్నంతా చంద్రబాబు, పవన్‌, మోదీ మాట్లాడుకున్నారు

మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు

01:21 PM, మార్చి 18 2024
బీసీలను వాడుకున్న చరిత్ర బాబుది: వాసుపల్లి గణేష్

  • బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనే సీఎం జగన్ ఆలోచనకు హ్యాట్సాఫ్..
  • సీఎం జగన్ చేసిన సామాజిక న్యాయం.. వేరే పార్టీ వాళ్లు ఎవ్వరూ చెయ్యలేరు..
  • దేశ చరిత్రలో వాడబలిజ కులం నుంచి నేను ఒక్కడినే ఎమ్మెల్యే
  • మళ్లీ సీఎం జగన్ నాకు అవకాశం ఇచ్చారు
  • అంబేడ్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు
  • చంద్రబాబు బీసీలను వాడుకున్నారు
  • మత్స్యకారులకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి బాబు మోసం చేశారు
  • నేను ప్రశ్నిస్తే.. బాబు నన్ను తిట్టారు
  • మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా బాబుకి గుర్తుండవు
  • కోలా గురువులు కి సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తే చంద్రబాబు ఓడించారు
  • మాకు పదవులు ఇస్తే చంద్రబాబు చూడలేకపోయారు
  • ఒకప్పుడు మోదీని తిట్టిన బాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నారు
  • చంద్రబాబు మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారు

సాక్షి టీవీతో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్
 

01:14 PM, మార్చి 18 2024
కొలికపూడి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: వైఎస్సార్‌సీపీ కాపు నేతలు

  • తిరువూరులో వైఎస్సార్‌సీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం
  • కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, ఆకుల శ్రీనివాస్,తిరువూరు అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్ తదితరులు
  • రంగా చనిపోయిన తర్వాత కాపులకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్.రాజశేఖర్ రెడ్డి  : ఆకుల శ్రీనివాస్
  • వైఎస్సార్ పై తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ చేసిన  వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : ఆకుల శ్రీనివాస్
  • రంగా అనే వ్యక్తి అసలు కొలికపూడి శ్రీనివాస్ కు తెలుసా : ఆకుల శ్రీనివాస్
  • ఎక్కడినుంచో  ఇక్కడికి వచ్చి రంగా శిష్యుడినని చెప్పుకుంటున్నాడు: ఆకుల శ్రీనివాస్
  • కొలికపూడిని కాపులంతా వ్యతిరేకించాలి : ఆకుల శ్రీనివాస్
  • తిరువూరులో స్థానికుడైన నల్లగట్ల స్వామిదాస్ కు కాపులంతా అండగా ఉండాలి : ఆకుల శ్రీనివాస్
  • పవన్ ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు పెద్దన్న అయ్యాడు: ఆకుల శ్రీనివాస్
  • టీడీపీతో కలిశాక చిన్నయ్య అయ్యాడు: ఆకుల శ్రీనివాస్
  • 24 సీట్ల నుంచి 21 సీట్లకు తగ్గించుకుని పవన్ దిగజారిపోయాడు: ఆకుల శ్రీనివాస్
  • కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ : ఆకుల శ్రీనివాస్
  • కాపులకు కాపు కాసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి: ఆకుల శ్రీనివాస్

12:49 PM, మార్చి 18 2024
విశాఖ జనసేనలో టికెట్ల రచ్చ

  • విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణయాదవ్ కు కేటాయిస్తారంటూ ప్రచారం
  • స్థానికులకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతల డిమాండ్
  • 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదంటూ అభ్యంతరాలు 
  • స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని పట్టుబడుతున్న కార్యకర్తలు

12:34 PM, మార్చి 18 2024
సిగ్గుందా ?.. ప్రజలన్నీ గమనిస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్

  • తన తల్లిని లోకేష్ తిట్టించారని పవన్ కల్యాణ్ యాగీ చేశారు 
  • తల్లిని తిట్టిన లోకేష్ క్షమాపణ చెప్పకుండా పవన్ ఎలా కలిశారు 
  • పవన్ కల్యాణ్‌కి సిగ్గుందా ?
  • చంద్రబాబుపై పవన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసాడు 
  • ఆరోపణలు నిజమైతే చంద్రబాబుతో పవన్ క్షమాపణలు చెప్పించాలి 
  • అబద్దమైతే పవన్ క్షమాపణలు చెప్పాలి 
  • మోదీని చంద్రబాబు ఇష్టానుసారంగా తిట్టారు 
  • పోలవరం ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీ విమర్శించారు 
  • ఇప్పుడు వీళ్ళంతా కలవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు 
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు 
  • అందుకే ప్రధాని,  ఒక సినిమా స్టార్, 40ఏళ్ల ఇండస్ట్రీ, తొడలు కొట్టే బాలయ్య కలిసినా సభ వెలవెలబోయింది 
  • జగన్ ఒక్క పిలుపు ఇస్తే సిద్ధం సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు
  • మూడు పార్టీలు పొత్తు పొత్తు పెట్టుకున్నా విజయం వైఎస్సార్‌సీపీదే


12:15 PM, మార్చి 18 2024
మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పిఠాపురం వర్మ

  • టీడీపీ శ్రేణుల పై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు
  • పిఠాపురం టీడీపీ కార్యకర్తలెవరూ జనసేనలోకి వెళ్లడం లేదు
  • కాకినాడ నుంచి మాస్కులు పెట్టుకొని వచ్చి జనసేనలో జాయిన్ అవుతున్నారు
  • కాకినాడ నుంచి వచ్చినవాళ్లే మా వాళ్ల పై దాడులు చేస్తున్నారు
  • పవన్ పల్లకి మోసినంతమాత్రాన మేమేమీ చేతులు కట్టుకుని కూర్చోము
  • పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది 

12:01 PM, మార్చి 18 2024
కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా??:  మాజీ ఎంపీ మేకపాటి

  • చంద్రబాబు బతిమాలితేనే పొత్తుకి మోదీ ఒప్పుకున్నారని నిన్న సభ స్పష్టం చేసింది..
  • సీఎం జగన్ ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా అనలేదు.. జగన్ అవసరం మోదీకి చాలా ఉంది
  • చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రధాని మోదీ లేరు.. అందుకు నిన్నటి ప్రజాగళం సభే నిదర్శనం
  • చంద్రబాబు దుర్మార్గుడు కాబట్టే ప్రజలు,  ప్రధాని మోదీ ఆయన్ని నమ్మడం లేదు
  • పవన్ కల్యాణ్‌ తన స్థాయికి మించి జగన్ పై విమర్శలు చేస్తున్నారు
  • కాపు నేతలు ఒక్కరైనా పవన్ వెంట ఉన్నారా??
  • పవన్ కల్యాణ్‌ తాత ముత్తాతలు దిగివచ్చినా.. సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయలేరు
  • పాదయాత్ర సమయంలో లక్షణాలు చూసి జగన్‌ గొప్ప నాయకుడు అవుతారని అప్పుడే ఊహించాను
  • ప్రధాని నరేంద్ర మోదీ  పెద్దమనిషి తరహాలో  మాట్లాడారు
  • ఎన్డీయేకి మద్దతు ఇవ్వమని అడిగారు తప్ప.. టీడీపీని గెలిపించమని మోదీ ఎక్కడా కోరలేదు

సాక్షి టీవీతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్ది వ్యాఖ్యలు

11:53 AM, మార్చి 18 2024
అక్రమ కలయిక కాబట్టే.. : మార్గాని భరత్‌ కౌంటర్‌

  • చిలకలూరిపేటలో ప్రతిపక్షాల బహిరంగ సభ అపశకునం..
  • ప్రధాని సభలో మైకులే మూగబోయాయి
  • పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడు
  • అందుకే మైకులు పనిచేయలేదు
  • రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఆ మూడు పార్టీలే..
  • ఈ మూడు పార్టీలది  అక్రమ కలయిక
  • పోలవరం పూర్తి చేయలేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు,
  • వెనుకబడిన జిల్లాలకు ఇచ్ఛిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు
  • అయినా జనసేన, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
  • చిలకలూరిపేట వేదికగా ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ మీకు హామీ ఇచ్చారా?
  • ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరంతా కలసి తాకట్టు పెడుతున్నారు
  • ఎన్డీయేలో మీరంతా ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలి
  • విలువలు విశ్వసనీయతకు చంద్రబాబు జీవితంలో అసలు చోటు ఉందా?
  • ఆంధ్ర ప్రదేశ్ ను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య
  • నాపై ఆదిరెడ్డి వాసు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. ఆయనకిదే స్ట్రాంగ్ కౌంటర్
  • రాజమండ్రిలో పర్సంటేజీలు తీసుకుంటున్నానని నాపై దుష్ప్రచారాలు చేస్తున్నావ్‌
  • గంజాయి బ్యాచ్ లను పెంచి పోషించే నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివా?
  • నీ అనుచరులు హైదరాబాదులో గంజాయితో దొరకలేదా?
  • సానిటరీ ఇన్స్పెక్టర్ల వద్ద వెయ్యి రెండువేలు లంచం తీసుకునే పరిస్థితి నీది
  • ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్‌సీపీ పెట్టిన భిక్ష
  • నిన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు అడగలేదు? 
  • విభజన హామీలు బీజేపీ ఇంకా అమలు చేయలేదు 

ప్రజాగళం సభపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యలు

11:38 AM, మార్చి 18 2024
పొత్తుతో కూడా ఈసారి బాబు ఓడి తీరతారు

  • చంద్రబాబు ఎప్పుడూ సింగిల్‌గా విజయం సాధించలేదు
  • ఈసారి పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విజయం సాధించలేరు
  • సీఎం పవన్ కావాలనుకున్న పవన్.. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే చాలన్నట్లున్నారు
  • బీజేపీకి అభ్యర్ధులు కూడా దొరకడంలేదు

డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి వ్యాఖ్యలు

11:11 AM, మార్చి 18 2024
పిఠాపురం వెళ్లనున్న పవన్‌ కల్యాణ్‌

  • వచ్చేవారం పిఠాపురం నియోజకవర్గానికి పవన్‌ కల్యాణ్‌
  • పిఠాపురం నుంచి పోటీ ప్రకటించాక తొలిసారి అక్కడికి జనసేన అధినేత
  • నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో కార్యకర్తలతో సమావేశం
  • గ్రామాలవారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం
  • వర్మ చల్లబడ్డట్లు కనిపిస్తున్నా.. టీడీపీ సహకరిస్తుందా? అనే అనుమానాలు
  • పిఠాపురం పోటీ ప్రకటించగానే.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

10:56 AM, మార్చి 18 2024
సీఎం జగన్‌ ఆ ధైర్యమిచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి

  • వెంకటగిరి నియోజకవర్గ లో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
  • ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రీజనల్ కోఆర్డినేటర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్ధి  నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపి అభ్యర్ధి  మద్దెల గురుమూర్తి, ఇతర ముఖ్యనేతలు
  • వైఎస్సార్‌సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది
  • రామ్ కుమార్ రెడ్డి అందరికీ అండగా నిలబడుతారు
  • అందరం కలిసి మెలిసి వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలి
  • ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్దిని మనం గెలిపించుకోవాలి
  • ఎంపీగా గురుమూర్తి నిత్యం శ్రమించారు
  • అభివృద్ది కార్యక్రమాలు, నిధులు రాబట్టడం లో గురుమూర్తి చుకైన పాత్ర పోషించారు
  • వారిద్దరినీ ఎన్నుకోవడం మన బాధ్యత
  • ప్రతి ఇంటి సంక్షేమ పథకాలు అందించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం
  • ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యాన్ని సీఎం జగన్‌ మనకు ఇచ్చారు
  • జన్మభూమి కమిటీలతో దోచుకున్న టీడీపీ నాయకులకి ప్రతి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు
  • భారీ మెజారిటీ తో విజయం సాధించడమే మన లక్ష్యం
  • రామ్ కుమార్ రెడ్డి అభ్యర్ధిగా ఖరారు అయ్యారు... ఆయనే వెంకటగిరి నుండి పోటీ చేస్తారు
  • మిగిలిన వారిని కూడా కలుపుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్న
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి.. వైఎస్ జగన్‌కు అత్యధిక స్థానాలు అందించాలి

10:54 AM, మార్చి 18 2024
వైఎస్సార్‌సీపీలో చేరారని కత్తులతో దాడి

  • అనంతపురం తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీ లో టీడీపీ నేతల దాష్టీకం
  • వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఖాదర్ బాషా, షేక్షావలి పై కత్తులతో దాడి 
  • వైఎస్సార్ సీపీ లో చేరారన్న అక్కసుతో దాడికి పాల్పడిన జేసీ వర్గీయులు 
  • ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రి కి తరలింపు

10:52 AM, మార్చి 18 2024
విజయవాడ వెస్ట్‌లో చల్లారని కూటమి మంట

  • బీజేపీ సీటు వెళ్లిందని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ 
  • భగ్గుమన్న జనసేన కార్యకర్తలు
  • విజయవాడ వెస్ట్‌ నుంచి సీటు ఆశించిన పోతిన మహేష్‌
  • నిరసనగా ప్రజాగళం సభను బహిష్కరించిన జనసేన కార్యకర్తలు  
  • ఇవాళ జనసేన యువత ఆధ్వర్యంలో ఆందోళన

10:43 AM, మార్చి 18 2024
‘జగనన్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం’

  • చంద్రబాబు.. పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి
  • ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమైన సీఎం వైఎస్‌ జగన్
  • 175కి 175 గెలవాలన్నదే జగన్‌ లక్ష్యం
  • ఆ లక్ష్యాన్ని మేం నెరవేరుస్తాం అంటూ ప్రజా గళం

10:39 AM, మార్చి 18 2024
బాబు ఎన్డీయే సహకారంతోనే అన్నీ చేశారట

  • ఎన్నికల వేళ..  మళ్లీ ఎన్డీయే పంచన చేరిన చంద్రబాబు
  • గతంలో ఎన్డీయే కూటమి, బీజేపీని బహిరంగంగా విమర్శలు గుప్పించిన బాబు
  • చిలూకలూరిపేట ప్రజాగళంలో ఎన్డీయే, మోదీపై ప్రశంసలు
  • గతంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నీ ఎన్డీయే సహకారంతోనే చేశామంటూ ప్రసంగం

10:34 AM, మార్చి 18 2024
కడప ఎంపీ బరిలో షర్మిల?

  • కాంగ్రెస్‌ తరఫున కడప ఎంపీ అభ్యర్థినిగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల
  • షర్మిలకు సీటు కేటాయించే యోచనలో ఏఐసీసీ
  • కొనసాగుతున్న అభ్యర్థుల ఎంపిక
  • ఉగాది లోపు కాంగ్రెస్‌ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదలయ్యే అవకాశం

10:10 AM, మార్చి 18 2024
కాసేపట్లో YSRCP మేనిఫెస్టోపై చర్చ

  • వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక సమావేశం
  • కాసేపట్లో తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యనేతలతో సీఎం జగన్‌ భేటీ
  • మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దనున్న వైఎస్సార్‌సీపీ
  • ఎప్పుడు ప్రకటిస్తారనేదానిపైనా భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్‌

ఇదీ చదవండి: నవరత్నాలకు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌లా మేనిఫెస్టో!

10:05 AM, మార్చి 18 2024
ఫ్రస్టేషన్‌లో వసంత కృష్ణప్రసాద్ 

  • టీడీపీలో చేరినా వసంతకు టిక్కెట్ ఎక్కడో చెప్పని చంద్రబాబు 
  • తనను ఎవరైనా ప్రశ్నిస్తే ఆవేశంతో ఊగిపోతున్న వసంత 
  • టీడీపీలోకి చేరిన విషయం పై వసంతను ప్రశ్నించిన జర్నలిస్టులు
  • సమాధానం లేక జర్నలిస్టుల పై బూతులతో విరుచుకుపడ్డ వసంత కృష్ణప్రసాద్ 
  • జర్నలిస్ట్ లు ఛానల్స్ మారట్లేదా?
  • రాజకీయనాయకులు పార్టీలు మారితే తప్పేంటని దబాయింపు 
  • తనను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై బూతులతో విరుచుకుపడిన వసంత కృష్ణప్రసాద్ 
  • వసంత వైఖరితో షాకైన జర్నలిస్టులు

09:42 AM, మార్చి 18 2024
విశాఖ: ‘వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు’

  • విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన పార్టీలో బయటపడ్డ విభేదాలు
  • వంశీకి సీటు ఇవ్వొద్దంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సాదిక్, మూగి శ్రీనివాస్
  • జనసేన సౌత్ నియోజక వర్గం సీటు స్థానికులకే  కేటాయించాలి
  • నేనే అభ్యర్థినని వంశీ హడావిడి చేస్తున్నారు
  • పార్టీ ఎక్కడ అధికారికంగా వంశీని అభ్యర్థిగా ప్రకటించలేదు
  • వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదు
  • గతంలో 50 వేల ఓట్లు ఓడిపోయిన వంశీకి సీటు ఎలా  ఇస్తారు
  • విశాఖ చరిత్రలో అంత మెజార్టీతో ఓడిపోయిన నేత మరొకరు లేరు
  • వంశీకి సీటు ఇస్తే వైఎస్ఆర్సిపి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుంది
  • పక్క నియోజకవర్గంలో పనికిరాని వంశీని మా నెత్తిన పెడతారా?
  • జనసేన జెండా మోయని వంశీకి జనసేన సీటు ఇస్తారా?
  • వంశీకి సీటు ఇవ్వడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు

08:59 AM, మార్చి 18 2024
ఎన్నికల సమరం.. ఇక ప్రచారంలోకి సీఎం జగన్‌

  • ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్
  • జిల్లాల వారీగా క్యాంపెయిన్ షెడ్యూల్ పై కీలక భేటీ 
  • నేడు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లతో మధ్యాహ్నం మీటింగ్ 
  • ఎన్నికల ప్రచారం, కార్యాచరణపై చర్చ
  • నియోజకవర్గాల్లో పార్టీ పోరాట సన్నద్ధత పైనా చర్చ
  • చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి నియోజకవర్గంలో పర్యటన
  • నేడో రేపో సీఎం ప్రచార షెడ్యూల్‌పై రానున్న స్పష్టత


దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్‌

08:08 AM, మార్చి 18 2024
ఇది మోదీ సభేనా అసలు?

  • టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభ అట్టర్ ప్లాప్
  • ఎన్టీయే కూటమి పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని మోదీకి ఘోర అవమానం
  • ప్రదాని మోదీకి వేదికపై కనీసం‌ బొకె, శాలువా కూడా తీసుకురాని చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ప్రదాని మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటించడంతో బిత్తరచూపులు చూసిన చంద్రబాబు, పవన్
  • వ్యాఖ్యాత సన్మాన ప్రకటనతో లేచి నిల్చున్న ప్రధాని
  • ఎవరూ బొకే ఇవ్వకపోవడంతో తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని బహుకరించిన ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి
  • జనం లేక సభ వెల వెలబోయిన సభ
  • 15 లక్షల మంది వస్తారంటూ ఊదరగొట్టిన టీడీపీ నేతలు
  • కనీసం‌ లక్షమంది కూడా హాజరుకాకపోవడంపై నేతల్లో నైరాశ్యం
  • పవన్, చంద్రబాబు ప్రసంగ సమయానికి సగం కుర్చీలు ఖాళీయే
  • సభకి పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ కార్యకర్తలు
  • పార్టీల మధ్య సమన్వయ లోపంతో సభ అట్టర్ ప్లాప్
  • కవరింగ్ చేసుకోవడానికి చంద్రబాబు పాట్లు.. కార్యకర్తలకి సైగలు
  • స్టేజ్ ముందు టీడీపీ కార్యకర్తల హంగామాతో పనిచేయని మైకులు
  • ప్రదాని మోదీ ప్రసంగ సమయంలో పలుమార్లు పనిచేయని మైకులు
  • ప్రదాని సభలో మైకులు పనిచేయకపోవడం ఇదే మొదటిసారి అంటున్న‌ బీజేపీ నేతలు
  • ప్రదాని సభకి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై బీజేపీలో అసహనం
  • మైకులు పనిచేయకపోవడంపై  ప్రధాని మోదీ సైతం తీవ్ర అసంతృప్తి
  • పదే పదే మైకులు మొరాయించడంతో ఉత్సాహంగా మాట్లాడలేకపోయిన ప్రదాని
  • స్టేజ్ పైనా చంద్రబాబు, పవన్ లతో ముభావంగానే ప్రదాని
  • సభ ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ లపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని?
  • ప్రధాని వచ్చే సభని ఇలాగేనా నిర్వహించేదంటూ చురకలు
  • ఎన్డీయే తొలి సభనే సరిగ్గా నిర్వహించలేకపోయారని బీజేపీ శ్రేణులు ఎద్దేవా

08:00 AM, మార్చి 18 2024
జనసేన ఆఫీస్‌కు Tolet బోర్డు

  • జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం
  • పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డ్ ఏర్పాటు..
  • పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం మాధవధారలో జనసేన కార్యాలయం ఏర్పాటు
  • రీజనల్ పార్టీ కార్యాలయం నుంచి సమీక్షలు సమావేశాలు..
  • కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిలిపివేత
  • కొన్ని రోజుల క్రితం అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన నాగబాబు
  • ఆ తర్వాత పార్టీ కార్యాలయం మూసివేసిన నాగబాబు
  • పార్టీ కార్యాలయం మూసివేత పై జనసేన నాయకుల ఆగ్రహం
  • పార్టీ కార్యాలయం లేని పార్టీగా జనసేన తయారయ్యిందంటూ అసంతృప్తి
  • పార్టీ కార్యాలయం నడిపించలేని స్థితికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారని ఆవేదన
  • పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించలేని దుస్థితి జనసేనకు ఏర్పడిందని మండిపాటు

07:33 AM, మార్చి 18 2024
YSRCP మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి

  • తుది దశకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో
  • త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు
  • తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మ్యానిఫెస్టోని ప్రకటించే అవకాశం
  • వైఎస్సార్‌సీపీ మ్యానిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపు
  • ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వబోమని పార్టీ ఆవిర్భావం నుంచి చెబుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
  • ఎన్నికల హామీల విషయంలో కాంప్రమైజ్‌ కాని వైనం 
  • 2019 మేనిఫెస్టోలోని 99%  హామీలు అమలు
  • జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజల్లో బలంగా నమ్మకం
  • ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్

07:19 AM, మార్చి 18 2024
ప్రజాగళంపై అంబటి సెటైర్‌

  • మైక్ ఫెయిల్ !
  • మీటింగ్ ఫెయిల్ !
  • టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ ! అంటూ అంబటి ట్వీట్‌

07:11 AM, మార్చి 18 2024
ఓటమి భయంతో.. టీడీపీ నేత తప్పుడు ఫిర్యాదు

  • ఓటమి భయంతో టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు తప్పుడు ఫిర్యాదు
  • తనిఖీలు నిర్వహించి తప్పుడు ఫిర్యాదుగా తేల్చిన అధికారులు
  • గ్రీన్ గార్డెన్ లో క్రికెట్ కిట్లు, చీరలు ఎంవీవీ పంపిణీ చేస్తున్నారని తప్పుడు ఫిర్యాదు చేసిన వెలగపూడి
  • ఫిర్యాదు రాగానే ఆర్డీఓ భాస్కర్ రెడ్డి, భీమిలి, ఈస్ట్ పోలీసులు అపార్ట్ మెంట్ లోని 65 ప్లాట్ లు తనిఖీలు నిర్వహించారు
  • తనిఖీలు నిర్వహించిన అనంతరం టీడీపీ నేత ఇచ్చింది తప్పుడు ఫిర్యాదుగా తేలిన వైనం 
  • ఈ తనిఖీ పై 24 గంటల్లో రిపోర్ట్ పైకి పంపాలని నిర్ణయించిన ఆర్డీఓ భాస్కర్ రెడ్డి
  • ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత తమకి వచ్చిన మొదటి ఫిర్యాదుగా పేర్కొన్న అధికారులు


06:59AM, మార్చి 18 2024
బాబు బండారం బయటపడింది

  • టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అరకొరగా సీట్లు
  • రెండు విడతలుగా ప్రకటించిన 128 సీట్లలో ఓసీలకే ప్రాధాన్యం 
  • సొంత సామాజిక వర్గానికంటే తక్కువగా బీసీలకు బీసీలకు 24తో సరి
  • కమ్మ సామాజికవర్గానికి 28 సీట్లు 
  • ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు 
  • కాపులకు 8, మైనారిటీలకు 3 
  • మహిళలకు ఇచ్చిన సీట్లు కేవలం 17 
  • సామాజిక న్యాయానికి పాతర.. ఇదీ బాబు బండారం

సంబంధిత కథనం కోసం క్లిక్‌ చేయండి

06:49AM, మార్చి 18 2024
ప్రజాగళంలో వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే 

  • ప్రధానికి అవమానంతో మొదలైన ఎన్డీఏ తొలి సభ 
  • కనీసం ఓ శాలువా, ఓ పూల బొకే కూడా తీసుకురాని బాబు, పవన్‌ 
  • మోదీకి సన్మానమంటూ వ్యాఖ్యాత ప్రకటన 
  • లేచి నిల్చున్న మోదీ.. దిక్కులు చూసిన టీడీపీ, జనసేన అధినేతలు 
  • తాను తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని ప్రధానికి బహూకరించిన పురందేశ్వరి 
  • 15 లక్షల మంది ప్రజలు వస్తారని నేతల ప్రకటన 
  • లక్ష మంది కూడా లేక వెలవెలబోయిన సభ
  • వేసిందే 48 వేల కుర్చీలు.. అవీ ఖాళీనే 
  • జనం లేకపోవడంతో బాబు కవరింగ్‌
  • టీడీపీ కార్యకర్తలతో స్టేజి ముందు హంగామా 
  • పని చేయని మైకులు.. మోదీ అసహనం
  • పవన్‌ ప్రసంగం మధ్యలో ఆపి మరీ వారిని కిందికి దించిన ప్రధాని 
  • కూటమి తొలి సభ అట్టర్‌ ఫ్లాప్‌తో నైరాశ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు 

ఇదీ చదవండి: బాండ్లతో బీజేపీకి రూ.6,986 కోట్లు


06:47AM, మార్చి 18 2024
చంద్రబాబుకి మాదిగల అల్టిమేటం

  • కొవ్వూరు టికెట్‌ విషయంలో చంద్రబాబుకు మాదిగల అల్టిమేటం
  • జవహర్ కి టికెట్ కేటాయించకపోతే టీడీపీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక
  • చంద్రబాబు మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నాడని ఆగ్రహం
  • మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి జవహర్ కి టికెట్ ఎందుకు ఇవ్వలేదని? సూటి ప్రశ్న
  • చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్దమైన మాదిగలు
  • టీడీపీ కష్ట కాలంలో వున్నపుడు జవహర్ పార్టీ కోసం కృషి చేసారు: మాదిగ సంఘాల ప్రతినిధులు
  • మాదిగలకు ఒక పెద్ద దిక్కుగా జవహర్ వున్నాడు: మాదిగ సంఘాల ప్రతినిధులు
  • చంద్రబాబు కష్ట కాలంలో వున్నపుడు మాదిగల సహకారం తీసుకోవడం,  తర్వాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది: మాదిగ సంఘాల ప్రతినిధులు
  • వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు: మాదిగ సంఘాల ప్రతినిధులు
  • వాగ్ధానాలకు, ప్రకటనకు బాబు పరిమితం.. ఆచరణ మాత్రం శూన్యం : మాదిగ సంఘాల ప్రతినిధులు
  • జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే బాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు : మాదిగ సంఘాల ప్రతినిధులు
  • జవహర్ కి టికెట్ ఇవ్వకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తాం : మాదిగ సంఘాల ప్రతినిధులు
  • పార్టీని సేవ చేయనివాళ్ళు, పార్టీ జెండా పట్టుకొని వాళ్లకు బాబు టికెట్ ఇస్తున్నారు : మాదిగ సంఘాల ప్రతినిధులు
  • చంద్రబాబు ఎన్నికలు కాకముందే సీఎం అయ్యిపోయాననే భావనలో కూరుకుపోయారు: మాదిగ సంఘాల ప్రతినిధులు

06:29AM, మార్చి 18 2024
కూటమి పరిస్థితి దారుణం

  • ఒకేసారి 175 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
  • ప్రతిపక్ష కూటమి మాత్రం నాన్చుడు ధోరణి
  • ఎటూ తేల్చలేక చంద్రబాబు సతమతం 
  • బలమైన అభ్యర్థులు దొరకకపోవడమే కారణం 
  • ఉత్తరాంధ్ర పెండింగ్‌ సీట్లపై డోలాయమానం 
  • తేలని మైలవరం, పెనమలూరు పంచాయితీ 
  • ఆలూరు, గుంతకల్లు సీట్లపైనా నాన్చుడే 
  • టికెట్ల ఖరారులో బీజేపీ, జనసేనదీ అదే తీరు

06:25AM, మార్చి 18 2024
YSRCP.. జయహో బీసీ

  • గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం
  • దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు
  • గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి
  • 2019, ఫిబ్రవరి 17న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం
  • మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సమున్నత స్థానం
  • డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో వారికి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనం 
  • ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు
  • భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తేటతెల్లం
  • అదే 2012లో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతర
  • కనీసం కేబినెట్‌లో కూడా ప్రాధాన్యత లేదు.. పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపని టీడీపీ అధినేత
  • బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని.. తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళన చేసిన బాబు
  • ఇప్పుడు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచించారంటూ ఫైర్‌.. తమ వెన్నువిరిచిన చంద్రబాబు నాయకత్వంపై బీసీల్లో ఆగ్రహావేశాలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అంటున్న విశ్లేషకులు

06:23AM, మార్చి 18 2024 
పవన్‌కు షాకిచ్చిన బెజవాడ జనసేన కార్యకర్తలు

  • జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన సొంత పార్టీ కార్యకర్తలు
  • ప్రధాని మోదీతో మిత్రపక్షం అధినేత చంద్రబాబుతో ప్రజాగళం పేరిట బహిరంగ సభ నిర్వహించిన పవన్‌
  • జనంతో పాటు జనసేన కార్యకర్తలూ దూరం
  • విజయవాడ వెస్ట్‌ టికెట్‌లో తీవ్ర అసంతృప్తితో ప్రజాగళం బహిష్కరణ
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement