పట్నా: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో బీహార్‌లో ప్రభుత్వాన్ని తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని, రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కూడా తమ పార్టీకి చెందినవారేనని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన్ సూరజ్‌తో బరిలోకి దిగనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వర్గానికి చెందిన 40 మందిని అభ్యర్థులుగా నిలబెడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా పోరాటం ఆర్జేడీతో కాదని ఎన్డేతోనేనని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'వక్ఫ్ సవరణ బిల్లు-2024'ను లోక్‌సభలో ప్రవేశపెట్టారని, బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనికి మద్దతు తెలిపారన్నారు.
తమ లాంటివారు రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదని, జేపీసీలో చర్చ జరుగుతోందన్నారు. అయితే భవిష్యత్‌లో నితీష్ కుమార్ తిరిగి మహాకూటమిలోకి వస్తారని, ముస్లింల గురించి మాట్లాడే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజలను వీటన్నింటినీ గమనిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment