
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత్ కిషోర్ ఒక ఈవెంట్ మేనేజర్ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 మంది ఎమ్మెల్యేల కంటే 5 కోట్ల మంది ప్రజల సంక్షేమమే సీఎం జగన్‌కు ముఖ్యం. నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. బీఫామ్ ఇచేవరకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరేనేది నిర్థారణ కాదు. అవసరం అనుకుంటే ఎవరినైనా మార్చవచ్చు. సీటు ఇవ్వలేదని ఇంట్లో కూర్చోం.. పార్టీ జెండా మోస్తాం’’అని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నారన్న విషయం నాకు తెలియదు. పార్టీ మారితే స్వయం కృపారాధమే. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయంటారు అది ఆ ఎమ్మెల్సీ విషయంలో నిజమవుతుంది’’ అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఈయనేందబ్బా జనాన్ని ఉద్దరించబోయేది?
Comments
Please login to add a commentAdd a comment