ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం: గుడివాడ అమర్‌నాథ్‌ | Gudivada Amarnath Comments On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం: గుడివాడ అమర్‌నాథ్‌

Published Thu, Jul 4 2024 1:37 PM | Last Updated on Thu, Jul 4 2024 1:45 PM

Gudivada Amarnath Comments On Chandrababu Govt

సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ జయంతి వేడుకల నిర్వహణపై చర్చించారు.

అనంతరం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే  వైఎస్ జగన్ సమీక్ష మొదలు పెట్టారని.. నియోజక వర్గ స్థాయిలో నాయకులతో సమావేశాలు పెట్టే ఆలోచన అధిష్టానం చేస్తుందని తెలిపారు. ప్రజల పక్షాన ఎప్పడూ వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. ప్రజలకు అండగా వైఎస్ జగన్ నిలబడతారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగింది.’’ అని అమర్‌నాథ్‌ అన్నారు.

కార్యకర్తలు, నాయకుల కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతాము. 99 శాతం హామీలు అమలు చేసిన వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో అభిమానం ఉంటుంది. కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ ఉంటుంది’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement