ముంబై: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇకపై వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీకే శుక్రవారం ముంబైలో శరద్ పవార్‌తో కలిసి లంచ్ చేసినట్లు సమాచారం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ ఇంటిలో వీరిద్దరు కలవడంతో అందరి దృష్టి 2024 ఎన్నికలపై సడింది. పవార్, పీకే మిషన్ 2024 గురించి చర్చించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కానీ ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు మాత్రం ఈ భేటీని ధన్యవాదసమావేశంగా పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహరచయితగా వ్యవహరించిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించడంతో వారికి మద్దతిచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కృతజ్ఞతల తెలిపే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
కానీ విశ్లేషకులు మాత్రం ఇది కేవలం ధన్యవాద సమావేశం మాత్రమే కాదు.. అంతకు మించి పెద్ద విషయాల గురించే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో మోదీకి పోటీ ఇచ్చే బలమైన ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి ఎవరనే దాని గురించి చర్చించి ఉంటారంటున్నారు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇకపై రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించబోనని సంచలన ప్రకటన చేసి.. అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే.
‘‘ఇన్ని రోజులుగా నేను చేస్తున్న పనిని ఇక మీదట కొనసాగించబోను. ఇప్పటికే చాలా చేశాను. కొంత విరామం తీసుకుని.. జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా’’ అన్న ప్రశ్నకు పీకే బదులిస్తూ.. ‘‘నేను విఫలమైన రాజకీయ నాయకుడిని.. నేను వెనక్కి వెళ్లి ఏం చేయాలో చూడాలి’’ అన్నారు. అయితే పీకే ఏదో భారీ రాజకీయ వ్యూహంతో తిరిగి రంగంలోకి దిగుతారని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు శరద్ పవార్‌తో భేటీ కావడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
చదవండి:
మమత కోసం రంగంలోకి శరద్ పవార్
వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్
Comments
Please login to add a commentAdd a comment