
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు. అదానీ అంశం పార్లమెంటు లో చర్చకు వస్తుందనే కమలం పార్టీ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కాంను బయటకు తీసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అదానీ ఆంశం వల్ల బీజేపికి నష్టం జరుగుతుందనే ఈ చర్చకు తెరలేపారని విమర్శించారు. బీజేపి, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధికోసమే లిక్కర్ స్కాంపై చర్చ జరిగేలా చేస్తున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ మూడోసారి అధికారంలో ఉండాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించాలనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయిని రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ కు కట్టు బానిసలని ఎద్దేవా చేశారు. చిన్నపిల్లాడిని కుక్కులు చంపేస్తే పట్టించుకోలేదు, మహిళలపై దాడులు జరిగితే స్పందిచరు, కానీ కవిత లిక్కర్ స్కాం పై మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్లారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయయని, కవిత అరెస్టు.. తర్వాత రోడుపైకి వచ్చి గొడవలు ఇవన్నీ జరుగుతాయని చెప్పారు.
చదవండి: బీఆర్‌ఎస్‌లో ‘చిలిపి’ రాజకీయం!
Comments
Please login to add a commentAdd a comment