బాబు గూట్లో బిహారీ బాబు | big-question: 10 Straight Questions To Prashant Kishor | Sakshi
Sakshi News home page

బాబు గూట్లో బిహారీ బాబు

Published Mon, Apr 8 2024 7:25 PM | Last Updated on Mon, Apr 8 2024 9:05 PM

big-question: 10 Straight Questions To Prashant Kishor - Sakshi

బాబు గ్రాఫ్ దిగజారింది.. పెయిడ్ క్యాంపెయినర్లు దిగిపోయారు
పెన్షన్ల ఇష్యూతో పాతాళానికి పడిపోయిన బాబు గ్రాఫ్ 
వెంటనే రంగంలోకి పెయిడ్ క్యాంపెయినర్ ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్ పచ్చగూటి చిలుకగా మారిపోయాడా ? 
పేమెంట్ కు తగ్గట్టుగా పెర్ఫామెన్స్ చూపిస్తున్నాడా ? 

బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంతమాత్రం. అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటేం.. గ్రాఫ్ పడిపోక.. పరుగులు పెడుతుంందా ఏంటి ? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా.. పచ్చగూటిలో ఆ చిలుక ఎవరో..! పేరు ప్రశాంత్ కిషోర్. బిహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి.. బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశంమొత్తం తిరుగుతున్నాడు.

బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో.. అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు.. చంద్రబాబును ఆయన గ్రాఫ్ ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు.. సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్ర్కిప్ట్ ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్లు ఎవ్వరూ లేరు. అయినా ఒక టీమ్ లేదు.. సర్వేలు చేయడం లేదు.. ఒక స్ట్రాటజిస్ట్ కాడు.. ఒక రాజకీయ నాయకుడు కాదు.. అలాగని విశ్లేషకుడు కాదు.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో.. అందుతున్న సంక్షేమం ఎంతో.. అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కార్ పై విషం చిమ్ముతున్న మిస్టర్ బిహారీ బాబు నువ్వు బాబు గూటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ పది ప్రశ్నలు అడుగుతున్నారు.. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు.. లేదా బీహారీలో చెప్పు.. ట్రాన్స్ లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం...!


1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దింపుతాడు.. అందులో భాగమే నువ్వు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలకగా మారిపోయావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
4. 2024 మార్చి 3న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కార్ పై విషం చిమ్మావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కాక్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు.. నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
9. నీకంటూ టీమ్ లేదు.. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలియదు.. అయినా స్ట్రాటజిస్ట్ లా మాట్లాడుతావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే
10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే

బిగ్ క్వశ్చన్ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement