బీహార్ వాడికి ఇక్కడ పనేంటి అంటూ ప్రశాంత్ కిషోర్‌పై గత ఎన్నికల సమయంలో నానా రకాలుగా తూలనాడిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమవడం చర్చనీయాంశమైంది. వ్యక్తులను, పార్టీలను, సంస్థలను అవసరమైనప్పుడు అక్కున చేర్చుకోవడం, అవసరం తీరాక గిరాటెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
విషయం వీక్ అయినప్పుడు.. ప్రచారం పీక్‌లో ఉండాలని నమ్మేవాడు బాబూ.. అంటూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక పీకే సరిపోడు, ఇద్దరు పీకేలు కావాలంటున్నారు బాబు..ఒక వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ జాకీలు పెట్టి లేపితే కానీ కనీస పోటీ ఇవ్వలేమని బాబు ఫీలింగ్.
ప్రశాంత్ కిషోర్‌ను బీహార్ డెకాయిట్ అని రకరకాలుగా అనరాని మాటలు అన్న బాబు, లోకేష్‌లు.. ఇదే ప్రశాంత్ కిషోర్ కోసం "పాహిమాం" అంటున్నారంటే జగన్ ఎంత బలంగా ఉన్నారో తెలియడం లేదా?. ప్రశాంత్ కిషోర్ టీంలో ఒకరయిన రాబిన్ శర్మ బాబు కోసం పని చేస్తుంటే ఇంకొకరు రిషి రాజ్ సింగ్ జగన్ కోసం పని చేస్తున్నాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చేసేది ఏమీ ఉండదు. కుదిరితే బీజేపీ లేదంటే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకొని ఇద్దరు పీకేలతో కలసి జగన్‌పై యుద్దానికి వెళ్లాలని వెన్నుపోటు నాయుడు ప్లాన్.
అంతే కాకుండా టీడీపీ గెలుస్తుంది అని రోజూ పేక్ సర్వేలు వాట్సాప్ ప్రచారాలు.. 3,500 మందితో మౌత్ క్యాంపెయిన్ చేయిస్తున్నాడు బాబు.. కులం కోసం బట్టలు చింపుకొనే ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎలానూ ఉన్నాయి. తాజా సర్వేల ప్రకారం.. కోస్తాలో వైఎస్సార్‌సీపీకి 50 శాతం, టీడీపీకి 35-36 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మిగిలిన 3 -4 శాతం మద్దతు ఉంది.
పవన్‌కు 20 సీట్లకు ముంచి ఇవ్వలేమని తేల్చి చెప్పాడు బాబు. దీంతో పవన్ మింగలేక కక్కలేక ఉన్నాడని మొన్న విజయనగరం యువగళం సభలో పవన్ బాడీ లాంగేజ్‌ను చూస్తే తెలుస్తుంది. సీఎం పదవి షేరింగ్ లేకుండా, 60 సీట్లు లేకుండా పోటీ చేస్తే ఒప్పుకునేది లేదని కాపు సంఘాలు, కాపు యువత భగ్గుమంటున్నాయి. ఇంకో వైపు సైలెంట్‌గా జగన్ పని చేసుకునిపోతున్నారు. ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ...!!
ఇదీ చదవండి: టీడీపీలో వణుకు
Comments
Please login to add a commentAdd a comment