ఇంత దిగజారి అబద్ధం చెప్తారా? | Prashant Kishor hits out at Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఇంత దిగజారి అబద్ధం చెప్తారా?

Published Wed, Jan 29 2020 9:08 AM | Last Updated on Wed, Jan 29 2020 1:35 PM

Prashant Kishor hits out at Nitish Kumar - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సిఫారసు మేరకే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను జేడీయూలోకి తీసుకున్నామని ఆ పార్టీ చీఫ్‌, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిషోర్‌ తీవ్రంగా స్పందించారు. తనను ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారనే విషయంలో ఎంతో దిగజారి నితీశ్‌ అబద్దం చెప్తున్నారని మండిపడ్డారు. అమిత్‌ షా సిఫారసు చేసిన వ్యక్తి మాటలు సైతం వినే ధైర్యం లేదని నితీశ్‌కు లేదని ఎద్దేవా చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ కిషోర్‌పై నితీష్‌ మంగళవారం తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ‘పార్టీలో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు’ అంటూ ప్రశాంత్‌కు ఆయన తేల్చిచెప్పారు. పార్టీలో కొనసాగాలి అనుకుంటే జేడీయూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేకపోతే పార్టీ వదిలి వెళ్లాలన్నారు. దీనిపై ట్విటర్‌లో స్పందించిన ప్రశాంత్‌.. నితీశ్‌ అబద్ధం చెప్తున్నారని పేర్కొన్నారు.
చదవండి: అమిత్‌ షాకు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు  ఎన్డీయే మిత్రపక్షమైన జేడీయూలో కొనసాగుతూ.. బీజేపీ వ్యతిరేక పక్షాలకు మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్‌ తలదూర్చారు. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. హస్తినలో ఆప్‌ విజయానికి ప్రణాళికలు రచిస్తూ... తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఆప్‌ తరఫున ప్రచార బరిలోనూ దిగుతానని ఇటీవల ప్రకటించారు. మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తూ ఇటీవల ఆయన ట్వీట్‌ కూడా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement