లాక్‌డౌన్‌ పొడిగింపు... ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ | Prashant Kishor Asks If Centre Has Alternate Plan Lockdown Extension | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పొడిగింపు: ప్రశాంత్‌ కిషోర్‌ స్పందన

Published Tue, Apr 14 2020 3:49 PM | Last Updated on Tue, Apr 14 2020 4:18 PM

Prashant Kishor Asks If Centre Has Alternate Plan Lockdown Extension - Sakshi

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ స్పందించారు. ఒకవేళ లాక్‌డౌన్‌ సత్పలితాలను ఇవ్వకపోతే ఇందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1211 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైరస్‌ బాధితుల సంఖ్య 10 వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం ప్రకటన చేశారు.(లాక్‌డౌన్‌ కష్టాలు: మండిపడ్డ మాయావతి)

ఈ విషయం గురించి సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌... ‘‘ లాక్‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే వాస్తవం ఏమిటంటే... ఒకవేళ లాక్‌డౌన్‌ వల్ల ఆశించిన ఫలితం రానట్లయితే మే 3 తర్వాత ఏం జరగబోతోంది. ఆ తప్పిదాన్ని సరిచేయడానికి మన దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా’’అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. తొలిసారిగా మార్చి 24 అర్ధరాత్రి విధించిన లాక్‌డౌన్‌ సరైందేనన్న ప్రశాంత్‌ కిషోర్‌.. దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయని గతంలోనే పేర్కొన్నారు. అయితే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌ సరైన రీతిలో సంసిద్ధం కాలేదని.. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉందని హెచ్చరించిన విషయం తెలిసిందే. (ఆ విషయాన్ని రేపు ప్రధాని వెల్లడిస్తారు: జవదేకర్‌)

అసహ్యంగా ఉంది: ప్రశాంత్‌ కిషోర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement