cardboard boxes
-
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ఉంచారు. ఆ ఎస్టేట్‌లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్‌లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్‌లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్‌లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్‌పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్‌లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్‌లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్‌ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్‌పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్‌లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
స్కూల్ టీచర్ వికృత చర్య..
మెక్సికో : విద్యార్థులు పరీక్షలో కాపీ కొట్టకుండా ఉండేందుకు ఓ టీచర్ అనుసరించిన విధానం విమర్శలకు తావిచ్చేలా ఉంది. విద్యార్థులు పరీక్షలో చీటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు టీచర్ వారి తలలపై అట్ట పెట్టెలను ఉంచారు. ఈ భయానక ఘటన సెంట్రల్ మెక్సికోలోని బాచిల్లెరెస్ 01 ఎల్ సబినల్ స్కూల్లో చోటుచేసుకంది. ఈ వికృత చర్యకు పాల్పడిన టీచర్‌ను లూయిస్ జ్యూరెజ్ టెక్సిస్గా గుర్తించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ టీచర్ తన విద్యార్థులను ఇలా అవమానపరచడం సరైనదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే లూయిస్ జ్యూరెజ్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు అట్ట పెట్టలు పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. విద్యార్ధుల మానసిక పరివర్తనకు ఇది ఒక వ్యాయామం లాంటిదని తెలిపింది. విద్యార్థులు ఈ వ్యాయామానికి ముందే అంగీకరించారని చెప్పింది. తాము ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని పేర్కొంది. అయితే ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. -
నిలిచిన అట్టపెట్టెల తయారీ
⇒ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో కూడా... ⇒ క్రాఫ్ట్ పేపర్ ధర పెరగడమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అట్ట పెట్టెల తయారీలో వాడే క్రాఫ్ట్ పేపర్ ధరను మిల్లులు ఇష్టారాజ్యంగా పెంచడాన్ని నిరసిస్తూ వేలాది కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 19 నుంచి 21 వరకు, తమిళనాడులో 20 నుంచి 23 వరకు తయారీ పనులను కంపెనీలు ఆపేశాయి. రెండు నెలల్లో కిలో క్రాఫ్ట్ పేపర్ ధరను మిల్లులు రూ.7 దాకా పెంచాయని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా కారుగేటెడ్ బాక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ మాజీ ప్రెసిడెంట్ ఎం.ఎల్.అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాతో అన్నారు. మిల్లుల సంఘాలే ధర పెంచుతూ నిర్ణయం తీసుకుని సభ్య కంపెనీలకు సమాచారం ఇవ్వడాన్నిబట్టి చూస్తుంటే కుమ్మక్కు అయినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. పేపర్ ధర పెరిగినా క్లయింట్లు ధర సవరించకపోవడంతో పెట్టెల తయారీ కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. సరఫరా ఎక్కువే అయినా.. దేశవ్యాప్తంగా 50 లక్షల టన్నుల అట్ట పెట్టెలు తయారవుతున్నాయి. 9 శాతం వృద్ధితో పరిశ్రమ విలువ రూ.20,000 కోట్లుంది. దేశంలో 25,000 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2,500 దాకా ఉన్నాయి. మొత్తం 7,50,000 మందికిపైగా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. క్రాఫ్ట్ పేపర్ పూర్తిగా దేశీయంగా ఉన్న మిల్లులే సరఫరా చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. డిమాండ్ కంటే పేపర్ ఉత్పత్తి అధికంగా ఉన్నా ధర పెంచుతున్నాయని అన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు నెలకు అయిదు రోజులు మిల్లులు మూసి వేస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కూడా ధర పెంచాల్సిందేనని, లేదంటే కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ఎమ్వీఎం భరత్ తెలిపారు.