అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం..
వలసలపై కఠిన వైఖరే
అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు.
గర్భస్రావాలపై మహిళలకు హక్కులు
తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది.
ట్రాన్స్‌జెండర్లకు రక్షణ
లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్‌కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment