Senegal
-
పడవలో కుళ్లిన 30 మృతదేహాలు.. సెనెగల్‌లో కలకలం
డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
డాకర్: ఆఫ్రికా దేశం సెనెగల్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. కఫ్రిన్ ప్రాంతం గ్నివీ గ్రామం వద్ద ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సుల్లోని 40 మంది చనిపోగా, మరో 78 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు బస్సులు పూర్తిగా నుజ్జయ్యాయన్నారు. ఘోర విషాదం నేపథ్యంలో దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని అధ్యక్షుడు మాకీ సాల్ ప్రకటించారు. కెన్యా–ఉగాండా సరిహద్దుల్లోనూ... నైరోబి: ఉగాండాలోని ఎంబాలె నగరం నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తున్న బస్సు రెండు దేశాల సరిహద్దుల్లో ప్రమాదానికి గురైంది. 21 మంది చనిపోగా 49 మంది గాయపడ్డారు. -
పార్లమెంట్ వేదికగా మహిళా ఎంపీపై దాడి.. వీడియో వైరల్
డాకర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధికార కూటమి బెన్నో బాక్ యకార్(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS — Daniel Marven (@danielmarven) December 2, 2022 ఇదీ చదవండి: మస్క్లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. క్వార్టర్స్‌కు చేరిన కేన్ సేన
ఫిఫా ప్రపంచకప్-2022 క్వార్టర్ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఆదివారం అర్ధ రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్ తొలి భాగం నుంచే సెనెగల్ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్.. ఏ దశలోనూ సెనెగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ తరపున జోర్డాన్ హెండర్సన్, హ్యారీ కెన్, బుకాయో సాకా గోల్స్ సాధించారు. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ 38వ నిమిషంలో హెండర్సన్ ఇంగ్లండ్‌కు తొలి గోల్‌ను అందించారు. కాగా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ జట్టు మొత్తం 12 గోల్స్‌ను సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్లో డిసెంబర్ 11న డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. సెనెగల్ ఇంటిముఖం పట్టడంతో ఇప్పడు ఈ మెగా ఈవెంట్ పోటీలో నిలిచిన ఒకే ఒక ఆఫ్రికా జట్టు మొరాకో. రౌండ్ 16 లో మొరాకో మంగళవారం స్పెయిన్‌తో తలపడనుంది. చదవండి: Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు... -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చి తగిన గుర్తింపు పొందిన ఖతర్ దేశం ఆటలో మాత్రం మెరవలేకపోయింది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖతర్ 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సెనెగల్ వరల్డ్‌కప్‌లో తమ ఖాతా తెరిచి రౌండ్ ఆఫ్ 16 ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక వరుసగా రెండో పరాజయం చవి చూసిన ఖతర్ ఇంటిబాట పట్టినట్లే. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య ఖతర్‌పై సెనెగల్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్థభాగంలో ఆట 41వ నిమిషంలో బులాయో డిఐఏ సెనెగల్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే ఆట 48వ నిమిషంలో ఫర్మారా డియోహౌ రెండో గోల్ అందించాడు. దీంతో తొలి అర్థభాగం ముగిసేసరికి సెనెగల్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగంలో ఆట 78వ నిమిషంలో ఖతర్‌కు తొలి గోల్ వచ్చింది. మహ్మద్ ముంతారి ఖతర్‌కు తొలి గోల్ అందించాడు. దీంతో 2-1తో ఖతర్ కాస్త లైన్లోకి వచ్చినట్లే అనిపించింది. కానీ ఆట 84వ నిమిషంలో సెనెగల్ చెక్ డింగ్ మరో గోల్ కొట్టడంతో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఖతర్ మరో గోల్ చేయడంలో విఫలం కాగా సెనెగల్ ఈ వరల్డ్‌కప్‌లో తొలి గెలుపును రుచి చూసింది. చదవండి: కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్ స్టార్ ఇదీ ఆటంటే.. ఆఖరి నిమిషంలో రెండు గోల్స్; ఇరాన్ సంచలనం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాకౌట్‌కు చేరే అవకాశాలు ఆ రెండు జట్లకే..!
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఖతర్‌తో పాటు నెదర్లాండ్స్, సెనెగల్, ఈక్వెడార్‌లు పోటీ పడుతున్నప్పటికీ నాకౌట్ అవకాశాలు డచ్, సెనెగల్ జట్లకే ఉన్నాయి. ఆసియా చాంపియన్ ఖతర్ ఆ రెండు జట్లను మించి నాకౌట్‌కు చేరడం అంత సులువేమీ కాదు. అయితే ఘనమైన ఆతిథ్యంతో పాటు టోర్నీలో చక్కని ప్రదర్శనతో ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఖతర్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలేంటో పరిశీలిద్దాం ఖతర్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ఇదే తొలిసారి ఇతర ఘనతలు: ఆసియా కప్ విజేత (2019) ఫిఫా ర్యాంకు: 50 అర్హత: ఆతిథ్య హక్కులతో నేరుగా సాకర్ వరల్డ్‌కప్ ఆతిథ్యం కోసం ఖతర్ ప్రభుత్వం, పాలకులు తెరముందు, తెరవెనుక ఎంతో చేశారు. అయితే ఖతర్ ఫుట్‌బాల్ జట్టు కోసం అహర్నిశలు కృషిచేసింది మాత్రం కోచ్ ఫెలిక్స్ సాంచెజ్ మాత్రమే! స్పానిష్కు చెందిన 46 ఏళ్ల కోచ్ కృషి వల్లే 2019లో ఖతర్ ఆసియా కప్ సాధించింది. 2006 నుంచి ఆయన జట్టును సానబెడుతూ వచ్చారు. ఈ జట్టులో అక్రమ్ అఫిఫ్ కీలక ఆటగాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. నెదర్లాండ్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు రన్నరప్ (1974, 1978, 2010) ఇతర ఘనతలు: యూరోపియన్ చాంపియన్ (1988) ఫిఫా ర్యాంకు: 8 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్‌లో తొలిస్థానం ఈ గ్రూపులో మేటి జట్టు నెదర్లాండ్స్. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్–జిలో అగ్ర స్థానంతో మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. మిడ్‌ఫీల్డర్ ఫ్రెంకీ డి జాంగ్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. డిఫెండర్లలో డేలి బ్లిండ్, స్టీఫన్ డి రిజ్ ప్రత్యర్థి స్ట్రయికర్లను చక్కగా నిలువరిస్తున్నారు. దీంతో ఈ సారి ఫైనల్ చేరితే మాత్రం కప్‌ను చేజార్చుకునే ప్రసక్తే లేదనే లక్ష్యంతో ఉంది. సెనెగల్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్స్ (2002) ఇతర ఘనతలు: ఆఫ్రికన్ చాంపియన్స్ (2022) ఫిఫా ర్యాంకు: 18 అర్హత: ప్లే–ఆఫ్స్‌లో ఈజిప్టును ఓడించి ఈ గ్రూపు నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అర్హత ఉన్న రెండో జట్టు సెనెగల్. ఈ ఏడాది ఆఫ్రికన్ చాంపియన్‌గా నిలిచింది. స్టార్ డిఫెండర్ కలిడో కలిబేలి సారథ్యంలోని సెనెగల్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. మిడ్ఫీల్డర్లలో ఇడ్రిసా గుయె, పేప్ గుయె, ఫార్వర్డ్‌లో బౌలయె డియా, హబిబ్ డైయలోలు కూడా స్థిరంగా రా>ణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రిక్వార్టర్స్ లక్ష్యంగా పెట్టుకున్న సెనెగల్ 20 ఏళ్ల క్రితంనాటి క్వార్టర్ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలనుకుంటుంది. ఈక్వెడార్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (2006); ఫిఫా ర్యాంకు: 44 ఇతర ఘనతలు: కోపా అమెరికా కప్‌లో నాలుగో స్థానం (1959, 1993) అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానం నెదర్లాండ్స్, సెనెగల్‌లతో కనీసం డ్రాతో గట్టెక్కినా అది ఈక్వెడార్ గొప్ప ప్రదర్శనే అవుతుంది. సంచలనాలు నమోదైతే తప్ప నాకౌట్ చేరడం కష్టం. అర్జెంటీనాకు చెందిన కోచ్ గుస్తావో అల్ఫారోకు అక్కడి క్లబ్ జట్లను తీర్చిదిద్దిన అనుభవంతో 2020లో ఈక్వెడార్ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా ఈక్వెడార్ తురుపుముక్క. మేజర్ ఈవెంట్లలో 35 గోల్స్‌తో ఈక్వెడార్ ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో ఒకడిగా నిలిచాడు. –సాక్షి క్రీడావిభాగం -
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెనెగల్‌లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాగా, అంతకుముందు కూడా సెనెగల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గడేదాడి లింగూరీలో ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు చనిపోయారు. ఇది కూడా చదవండి: ప్రపంచానికి టెన్షన్.. పుతిన్ మరో బిగ్ ప్లాన్..? -
ప్రేయసి కోసం ‘ఆమె’లా మారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన లవర్
ఎంతగానో ప్రేమిస్తున్న తన ప్రేయసి చదువులో కొంత వెనకబడింది. పరీక్ష రాస్తున్నా కొద్దీ తప్పడంతో తనకు బదులుగా తన ప్రియుడిని ఆమె పంపించింది. ప్రియుడు ప్రియురాలిగా వేషం వేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం కలిగిన అధికారులు వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం తెలుసుకుని బిత్తరపోయారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కడియం ఎంబొప్ (22), గంగ్యూ డియోమ్ (19) ప్రేమికులు. తన ప్రియురాలు గంగ్యూ వార్షిక పరీక్షలు రాస్తోంది. అయితే ప్రతిసారి ఆమెకు ఇంగ్లీశ్ అంతగా రాదు. ఆ పరీక్షలో వరుసగా తప్పుతోంది. దీంతో రంగంలోకి తన ప్రియుడు కడియాన్ని దింపింది. తన మాదిరి వేషధారణ వేసుకుని వెళ్లమని చెప్పడంతో మనోడు సిద్ధమయ్యాడు. అచ్చం ప్రేయసి మాదిరి మేకప్ వేసుకున్నాడు. డ్రెస్, స్కాఫ్, తలపై మరో స్కాఫ్ చుట్టేసుకున్నాడు. విగ్ పెట్టుకుని హొయలు ఒలుకుతూ సెయింట్ లూయిస్ పట్టణం సమీపంలోని గ్యాస్టన్ బర్గర్ విశ్వవిద్యాలయంలో పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇలా మూడు పరీక్షలు రాశాడు. ఇక నాలుగో రోజు ఇతగాడి ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం కలిగింది. దీంతో లేపి పరిశీలించి వివరాలు అడగ్గా ఈ నాటకం బయటపడింది. చివరకు అతడిని పోలీసులకు పట్టించారు. ప్రేమ కోసం వెళ్లి కటకటాలపాలైన ఆ యువకుడిపై సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి.. -
మరోసారి వార్తల్లోకి గ్యాంగ్‌స్టర్ రవి పూజారి
న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్‌కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్) 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!) కాగా గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
1982 తర్వాత తొలి‘సారీ’
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ అందరి సరదాను తీరుస్తుందంటారు. అనుకోని జట్లు అద్బుత విజయాలతో దూసుకపోతుంటే.. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్లు చతికిలపడుతుంటాయి. సాకర్ సమరంలో ఒక ఘట్టం(గ్రూప్ దశ) పూర్తయింది. ఇక ప్రతీ మ్యాచ్ అన్ని జట్లకు చావోరేవో. చిన్నచితకా జట్లు, ఆగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఇంటికి పంపించిన ఈ మెగా టోర్నీలో ఆఫ్రికా అభిమానుల కోరిక మాత్రం తీరకుండా అలాగే మిగిలి ఉంది. తమ ఖండపు జట్టు కనీసం సెమీస్‌కు చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల ఆశలు ఈసారి కూడా ఆవిరయ్యాయి. రష్యాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ఏ ఆఫ్రికా జట్టు రౌండ్16కు చేరలేకపోయింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండపు జట్టు నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి. రష్యాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ఈసారి అత్యధికంగా ఐదు ఆఫ్రికా జట్లు(నైజీరియా, మొరాకో, ట్యూనీషియా, ఈజిప్ట్, సెనెగల్) అర్హత సాధించాయి. అయితే ఈ దఫా విశ్వసమరంలో ఆఫ్రికా జట్లకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ హెచ్లో జపాన్, సెనెగల్ జట్లకు సమాన పాయింట్లు లభించినా ఫెయిర్ ప్లే కింద జపాన్(ఆసియా నుంచి ఏకైక జట్టు) రౌండ్ 16లోకి అడుగుపెట్టగా.. సెనెగల్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో ఒక్క జట్టైనా నాకౌట్‌కు చేరుతుందనుకున్న ఆఫ్రికా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఈజిప్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది. మొరాకో కూడా 20 సంవత్సరాల తర్వాత సాకర్‌లోకి అడుగుపెట్టి రెండు ఓటములు, ఒక డ్రాతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆఫ్రికన్ అభిమానులు, క్రీడా పండితులు ఎంతో నమ్మకం పెట్టుకున్న నైజీరియా ఒక్క విజయం రెండు ఓటములతో టోర్నీ నుంచి వైదలొగింది. ట్యూనీషియా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆఫ్రికా దేశాలు ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించి అభిమానులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. సెమీఫైనల్ చేరాలనుకున్న ఆఫ్రికన్ అభిమానుల కల రష్యాలో కుదరలేదు.. కనీసం ఖతార్‌లోనైనా సాధ్యపడుతుందో చూడాలి. -
గ్రూప్‘హెచ్’ టాపర్ కొలంబియా
సమారా: గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా కొలంబియా ప్రపంచకప్‌లో నాకౌట్ చేరింది. సెనెగల్‌తో గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 1–0 తేడాతో గెలుపొందింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎరీ మినా (74వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. బంతిపై 43 శాతమే నియంత్రణ దక్కినా... అటాకింగ్ గేమ్‌తో సెనెగల్ పోరాడింది. అయితే, మినా అద్భుతమైన హెడర్ గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించాడు. దీనిని సమం చేసేందుకు అవకాశం చిక్కని సెనెగల్ ఉసూరుమంటూ నిష్క్రమించింది. జపాన్‌పై పోలాండ్ నెగ్గడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. కొలంబియా 6 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 1982 తర్వాత ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక్క జట్టు కూడా నాకౌట్‌కు చేరకపోవడం ఇదే తొలిసారి -
జపాన్ 2–2 సెనెగల్
ఎకటెరిన్‌బర్గ్: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మరో హోరాహోరీ పోరులో ఇరు జట్లు సమంగా నిలిచాయి. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం జపాన్, సెనెగల్ మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. రెండు సార్లు కూడా ముందుగా గోల్ కొట్టి సెనెగల్ ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత జపాన్ సమంచేసి మ్యాచ్‌ను కాపాడుకుంది. సెనెగల్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాదియో మానె (11వ నిమిషం), మూసా వేగ్ (71వ నిమిషం) గోల్స్ కొట్టారు. జపాన్ తరఫున తకషి నుయ్ (34వ నిమిషం), కీసుకే హోండా (78వ నిమిషం) గోల్స్ సాధించారు. ఈ గోల్‌తో హోండా... జపాన్ తరఫున వరుసగా మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో (2010, 2014, 2018) గోల్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తాజా ఫలితం అనంతరం ఈ గ్రూప్‌లో ఇరు జట్లు చెరో 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానం లో ఉన్నాయి. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో పోలాండ్‌తో జపాన్, కొలంబియాతో సెనెగల్ ఆడతాయి. -
పోలాండ్... చేజేతులా!
మాస్కో: పాపం పోలాండ్... మ్యాచ్‌లో బంతి దాదాపు 60 శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. దాడుల్లోనూ మెరుగే. తప్పులూ తక్కువే చేసింది. కానీ థియాగో సియోనెక్ (37వ నిమిషం) సెల్ఫ్ గోల్ కొంపముంచింది. ఆ తర్వాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఎంబె నియాంగ్ (60వ నిమిషం) మరో గోల్ కొట్టడంతో సెనెగల్ 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పోలాండ్ తరఫున క్రిచోవియాక్ (86వ నిమిషం) చివర్లో గోల్ చేసినా... అది ప్రత్యర్థి ఆధిక్యం తగ్గించేందుకే ఉపయోగపడింది. అంచనాలకు తగ్గట్లే మ్యాచ్ మొదట్లో సమతూకంతో సాగింది. బ్లాస్జికొవొస్కీ, క్రిచోవియాక్లు సెనెగల్ స్టార్మానెను కట్టిపడేశారు. అయితే ఇద్రిస్సా గుయె షాట్‌ను తిప్పికొట్టే క్రమంలో పోలాండ్ ఆటగాడు సియోనెక్ అనూహ్యంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. 60వ నిమిషంలో బంతిని దొరకబుచ్చుకున్న నియాంగ్... బలహీనంగా ఉన్న పోలాండ్ రక్షణ శ్రేణిని ఛేదిస్తూ గోల్‌గా మలిచాడు. కీపర్ సెజెన్సీ గోల్ పోస్ట్‌ను వదిలి అప్పటికే చాలా దూరం వచ్చేయడంతో అడ్డుకునే అవకాశమూ లేకపోయింది. పోలాండ్ తరఫున చివర్లో క్రిచోవియాక్ గోల్ కొట్టినా అప్పటికే ఆలస్యమైంది. స్టార్ ఆటగాడు రాబర్ట్ లెవాన్‌డోస్కీ వైఫల్యం కూడా ఆ జట్టును దెబ్బతీసింది. -
మగాడుగా మారాలంటే..
జిగ్వింకర్: మనది ప్రజాస్వామ్య రాజ్యం. ఇక్కడ ఓ అబ్బాయి మేజర్ కావాలంటే 18 ఏళ్ల వయసు నిండాలి. చాలా దేశాల్లో ఇలా వయసును బట్టి అబ్బాయిలు, అమ్మాయిలను మేజర్, మైనర్లుగా నిర్ధారిస్తారు. కానీ, పశ్చిమ ఆఫ్ర్రికాలోని సెనగల్ దేశంలోని జిగ్వింకర్ ప్రాంతం మాత్రం అబ్బాయిలకు కఠిన పరీక్ష పెడుతోంది. అబ్బాయి.. మగాడుగా మారాలంటే నెల రోజుల పాటు అడవిలో వనవాసం చేయాలి. దీన్ని వారు బౌకౌట్ అని పిలుస్తారు. అలా వనవాసం చేసిన వచ్చిన తర్వాతే నివాస ప్రాంతంలోకి అబ్బాయిలను తిరిగి రానిస్తారు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న అబ్బాయిల్ని వారి కుటుంబీకులే ఓ వయసు వచ్చాక అడవిలోకి పంపుతారు. కేవలం అబ్బాయిలే కాకుండా వారి తండ్రులు కూడా నెలరోజుల వనవాసానికి వెళ్తారు. అయితే, ఇలా అడవిలోకి పంపే ముందు కొన్ని ఆచారాలను వారు పాటిస్తారు. జిగ్వింకర్ ఆచారాలకు ఆకర్షితురాలైన ఫొటోగ్రాఫర్ డయానా బగ్నోలి వారి సంప్రదాయాలను తన కెమెరాలో బంధించి ఓ డాక్యుమెంట్‌గా మార్చారు. ఇలా అబ్బాయిలను అడవిలోకి పంపడాన్ని జిగ్వింకర్లో ఒక్కొక్క గ్రామం ఒక్కో ఏడాది నిర్వహిస్తుంది. అడవిలోకి అబ్బాయిలను పంపే ముందు వారిని సంప్రదాయబద్దంగా అలంకరిస్తారు. తర్వాత కొందరు గ్రామస్తులు వారి శారీరక దృఢత్వాన్ని, మనోశక్తిని నిరూపించుకునేందుకు కత్తులతో శరీర భాగాలను కోసుకుంటారు. అయితే, ఇలా కత్తులతో శరీరాన్ని గాయపర్చుకునే సమయంలో వారి ఒంటిపై ఆభరణాలు అలానే ఉంటాయి. అవి వారికి రక్షణ కవచంలా పనిచేస్తాయని నమ్మకం. గ్రామస్ధుల ప్రదర్శన అనంతరం అడవిలోకి పంపే అబ్బాయిలందరికీ గుండు చేయిస్తారు. అది మొదలు వారు తిరిగొచ్చే వరకూ స్త్రీల మొహం చూడటం, తాకడం లాంటివి చేయకూడదు. అబ్బాయిలు వెళ్లిన తర్వాత ఇంటి వద్ద ఉండే ఆడవాళ్లందరూ ఒకేచోట నివసించడం ప్రారంభిస్తారు. నెల రోజుల పాటు అడవిలో ఉండటం వల్ల అబ్బాయిలు శక్తిమంతులు అవుతారని వారి నమ్మకం. అయితే, కొందరు అటవీ పరిస్ధితులు తట్టుకోలేక మరణిస్తారు కూడా. అడవి నుంచి తిరిగివచ్చిన వారిని ఓ గుడిసెలో ఉంచి మహిళలు ఒక్కొక్కరిగా వచ్చి చూస్తారు. ఆ తర్వాతే వారిని గ్రామంలోకి రానిస్తారు. -
ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం
డాకర్: వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమ ఆఫ్రికా దేశం సెనెగల్‌లో ఫుట్ బాల్ లీగ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు మధ్య జరిగిన ఘర్షణ ఎనిమిది మంది మృత్యువాత పడటానికి కారణమైంది. యూఎస్ ఓకామ్-స్టేడ్ డీ బార్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఫ్యాన్స్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మొదటి యూఎస్ ఓకామ్ అభిమానులు.. స్టేడ్ డీ బార్ ఫ్యాన్స్ పై రాళ్లు విసరడం ఆరంభించారు. దాంతో అవతలి జట్టు అభిమానులు సైతం ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని బెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించగా కొంతమంది అభిమానులు తమ సీట్లను ఖాళీ చేసేందుకు యత్నించారు. అదే సమయంలో అభిమానుల రద్దీ బాగా పెరిగి సీట్లను అనుకుని ఉన్న గోడ కూలిపోయింది. దాంతో ఎనిమిది మంది తమ ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
127 మందిపై అత్యాచారానికి తెగబడ్డారు ..
డాకర్, సెనగల్ : ఇళ్లపై దాడి చేశారు. ఆపై ఇంటిలోని సామాన్లను లూటీ చేశారు. అక్కడితో ఆగకుండా మహిళలపై 60 మంది ఆర్మీ మిలిషియా అత్యాచారానికి తెగబడ్డారు. ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా 127 మంది మహిళలపై అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్లో మే మొదటి వారంలో చోటు చేసుకుందని డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం వెల్లడించింది. అత్యాచారానికి గురైన మహిళల్లో 14 నుంచి 70 ఏళ్ల వృద్ధులు ఉన్నారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై చాలా మంది మహిళలు బయటకు వచ్చి చెప్పేందుకు జంకుతారని, అయితే వైద్య సహాయం కోసం ఆతృతగా ఎదురు చూశారని చెప్పారు. వారందరికి వైద్య సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తూర్పు కాంగోలో మహిళలపై ఆర్మీ మిలిషియా సభ్యులు చేస్తున్న అత్యాచారాలకు అంతుపొంతు లేకుండా పోయిందని డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది. ఓ విధంగా చెప్పాలంటే అత్యాచారం అనేది ఆర్మీ మిలిషియా సభ్యులకు అత్యంత పాశవికమైన ఆయుధంగా తయారైందని అభిప్రాయపడింది. కాంగోలో అత్యాచారాలను నిరోధించేందుకు చేసిన తీర్మానంపై ఆర్మీ కమాండర్స్ సంతకాలు చేసిన... మహిళలపై జరుగుతున్న దురాగతాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగోతోపాటు దాదాపు 18 దేశాలలో ఇలాంటి ఆఘాయిత్యాలు జరుగుతున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
సెనెగల్
ప్రపంచ వీక్షణం డకార్ సెనెగల్ దేశానికి రాజధాని నగరం. నగరం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. నగరం చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎక్కువ. అయితే పర్యాటకులకు ఆనందాన్ని కలిగించేది నగరం ఒడ్డుననే ఉన్న అట్లాంటిక్ సముద్రపు నీలి ఆకుపచ్చ నీళ్ల సౌందర్యం. నగరంలోనూ చూడదగిన ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఈ నగరాన్ని క్రీ.శ. 1444లో పోర్చుగల్ రాజులు నిర్మించారు. నగరంలో చూడదగినవి డకార్ క్యాథడ్రల్, డకార్ గ్రాండ్ మాస్క్, ఐఫాన్ మ్యూజియం, ఆఫ్రికన్ రినేసెన్స్ మాన్యుమెంట్, పార్క్ డిహన్ లెపోల్డ్ సెడార్ అంతర్జాతీయ విమానాశ్రయం, డకార్ విశ్వవిద్యాలయ భవనం, జాతీయ అసెంబ్లీ భవనం, 1776లో నిర్మింపబడిన బానిసల భవనం ఇప్పటికీ మనం చూడవచ్చు. నగరమంతా చక్కని రోడ్డు, రైలు వ్యవస్థ కలిగి ఉంది. అయితే పర్యాటకులకు స్థానిక టాక్సీల వల్ల కొంత ఇబ్బందే ఉంటుంది. కొత్త వాళ్లని నమ్మడం కొంత కష్టం. నైసర్గిక స్వరూపం ఖండం: ఆఫ్రికా వైశాల్యం: 1,96,712 చదరపు కిలోమీటర్లు జనాభా: 1,36,35,927 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: డకార్ ప్రభుత్వం: సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: సిఎఫ్ఎ ఫ్రాంక్ భాషలు: ఫ్రెంచి అధికార భాష, ఇతర ఆఫ్రికన్ భాషలు మతం: 90 శాతం ముస్లిములు, 6 శాతం క్రైస్తవులు, 3 శాతం ఇతర తెగలు వాతావరణం: జనవరిలో 18 నుండి 26 డిగ్రీలు, సెప్టెంబర్‌లో 24 నుండి 32 డిగ్రీలు పంటలు: వరి,జొన్న, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ. పరిశ్రమలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పెట్రోలియం శుద్ధి, ఎరువుల తయారీ, దుస్తులు, మత్తుపానీయాలు, సిమెంటు పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్. ఎగుమతులు: పెట్రోలియం ఉత్పత్తులు, చేపలు, ఎరువులు, నూలుదుస్తులు, స్వాతంత్య్రం: జూన్ 20, 1960. సరిహద్దులు: మారిటానియా, మాలి, గినియా, గియియాబిసావు, అట్లాంటిక్ మహాసముద్రం. చరిత్ర సెనెగల్ అనేది సెనెగల్ నది పేరు వల్ల వచ్చింది. 7వ శతాబ్దానికి పూర్వం వివిధ రాజులు దీనిని పరిపాలించారు. 9వ శతాబ్దంలో టక్రూర్ రాజులు, 13,14 శతాబ్దాలలో నమన్దిరు, జొలోఫ్ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేశ తూర్పు భాగం ఒకప్పుడు ఘనాదేశ పరిపాలనలో ఉండేది. టోకోలీర్, సోనింకే రాజుల పాలనా కాలంలో దేశంలో ఇస్లాం మతం సహారా అలోల్మోరావిద్ రాజుల సహకారంతో ఈ దేశంలో ప్రవేశించింది. 13-19 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం సెనెగాంబియా ప్రాంతంగా పిలువబడేది. 14వ శతాబ్దంలో జోలోఫ్ రాజు క్రమంగా బలం పుంజుకుని సమీపంలో ఉండే కేయర్, బావోల్, సెనై, సాలోమ్, వాలో, ఫుటా టూరో బాంబోక్ లాంటి చిన్న చిన్న రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేశారు. 15వ శతాబ్దం మధ్యలో పోర్చుగీసు రాజులు ఈ దేశంలో ప్రవేశించి వ్యాపారం ఆరంభించారు. ఆ తర్వాత ఫ్రెంచివారు వచ్చారు. క్రీ.శ. 1677లో ఫ్రెంచివారు సెనెగల్ దేశంమీద పూర్తి ఆధిపత్యాన్ని సాధించి తమ పాలనను ఆరంభించారు. చివరికి 1960లో సెనెగల్ స్వాతంత్య్రాన్ని పొందింది. పరిపాలనారీతులు దేశాన్ని రాష్ట్రపతి పాలిస్తాడు. పూర్తి అధికారాలు రాష్ట్రపతివే. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 14 రీజియన్లుగా విభజించారు. ఒక్కొక్క రీజియన్‌ను రీజినల్ కౌన్సిల్ పరిపాలిస్తుంది. ఈ రీజియన్లు తిరిగి 45 డిపార్ట్మెంట్లుగా, వాటిని 103 అర్రోన్డిస్సెమెంటులుగా విభజించారు. ప్రజలు-సంస్కృతి దేశ ప్రజల్లో అత్యధిక శాతం ముస్లిములే. దేశంలో అన్ని ఇతర తెగల ప్రజలలో ఇతరులను గౌరవించడం ‘కెర్పా’ మంచిమర్యాదలు ‘తెగిన్’, సహాయ సహకారాలు ‘టెర్రాంగ’ ఈ మూడు గుణాలు అధికంగా ఉన్నాయి. మహిళలు వ్యవసాయ పనులు చేస్తారు. వీరు తలకు రుమాలు చుట్టుకుంటారు. పొడవాటి లుంగీ లేదా పొడవాటి స్కర్టు సాధారణంగా ధరిస్తారు. జొన్నలు, గోధుమ, పత్తి, వరి, చెరకు, వేరుశనగ అధికంగా పండుతాయి. భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఇక్కడి ప్రజలకు చాలా ఇష్టం. చూడదగిన ప్రదేశాలు దేశంలో చాలా పొడవైన సముద్ర తీరం ఉన్నందున ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ఈ దేశానికి ఎక్కువగా ఫ్రెంచ్, అమెరికా దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. దేశంలో గోరీ ఐలాండ్ యునెస్కో సంస్థ ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేయబడింది. దేశంలో ఏడు జాతీయ పార్కులున్నాయి. ఇక్కడ కొన్నింటిని పరిశీలిద్దాం. గోరీ ద్వీపం ఇది రాజధాని డికార్ భూభాగం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో ఉంది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపంలో జనాభా దాదాపు 11 వందలు. ఈ మొత్తం ద్వీపం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. శతాబ్దాల క్రితం ఈ ద్వీపం బానిసల మార్కెట్‌కు బాగా ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది బానిసలను కొనుక్కొని ఓడల మీద ఇతర దేశాలకు త రలించే వారు. 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ బానిస తరలింపు తగ్గిపోయింది. ఇదొక నౌకాశ్రయంగా వృద్ధి చెందింది. పోర్చుగీసు వాళ్లు యూరోపియన్లు, నెదర్లాండ్ వాళ్లు ఈ ద్వీపాన్ని ఒకప్పుడు తమ స్వంత ప్రదేశంగా ఉపయోగించుకున్నారు. 1664లో ఈ ద్వీపానికి రాబర్ట్ హోమ్స్ ఈ ద్వీపానికి గొరీ ఐలాండ్‌గా నామకరణం చేశాడు. ప్రస్తుతం ఈ ద్వీపంలో ఉన్న పురాతన భవనాలన్నీ హోటళ్లుగా మారి, పర్యాటకులకు ఆకర్షణగా నిలిచాయి. అప్పటి కట్టడాలన్నీ ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి. ఈ ద్వీపంలో బానిసల గృహం, విలియం పాంటీ స్కూల్, మారిటైమ్ మ్యూజియం, ఫోర్ట్డి ఎస్ట్రీస్ సెనెగల్ మ్యూజియం, గవర్నమెంట్ ప్యాలస్, గోరి క్యాజిల్, 17వ శతాబ్దపు పోలీస్ స్టేషన్ భవనం... ఇలా అనేక కట్టడాలు గత శతాబ్దాలవి నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ద్వీపం మొత్తం సముద్రాన్ని చుట్టి ఉంటుంది. పర్యాటకులకు ఇదొక స్వర్గధామంగా నిలిచింది. సెయింట్ లూయిస్ సెయింట్ లూయిస్ దేశానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న పెద్ద నగరాలలో ఒకటి. నగరం సెనెగల్ నది ముఖ ద్వారం దగ్గర ఉంది. రాజధాని నగరం నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ నగరం క్రీ.శ.1659లో ఫ్రెంచ్ వ్యాపార వేత్తలు నిర్మించారు. ఆ కాలంలో సెయింట్ లూయిస్‌ను ఎన్డార్ అని పిలిచేవారు. ఈ నగరంలో శతాబ్దాల క్రితం నాటి చారిత్రక కట్టడాలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఈ నగరంలో నిలిచి వున్న సెయింట్ లూయిస్ రీసెర్చ్ సెంటర్, మ్యూజియంలో సెనెగల్ దేశశతాబ్దాల చరిత్ర, అప్పటిదుస్తులు, పరికరాలు, ఇతర ఎన్నోవస్తువులను భద్రంగా దాచి ఉంచారు. వీటిని చూస్తుంటే ఆ కాలం నాటి మనుషులు, చరిత్ర కళ్లముందు కనబడతాయి. నగరంలో ఉన్న గవర్నర్ పాలెస్, పార్క్ ఫెదర్ బే, గ్రాండి మాస్క్, ఫెదర్ బే బ్రిడ్జి ఇలా అనేక ఆనాటి కట్టడాలు నేడు దర్శనమిస్తాయి. నగరంలో ఇళ్లన్నీ దాదాపు రెండంతస్తులుగా ఉంటాయి. వీధులన్నీ ఎంతో సుందరంగా ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధ స్మారకం అందర్నీ ఆకర్షిస్తుంది. ఈ నగరం సముద్ర మట్టానికి దాదాపు సమాన ఎత్తులో ఉండటం ప్రత్యేకత. సముద్రం ఏ మాత్రం ఉప్పొంగినా నీళ్లు నగరాన్ని ముంచెత్తుతాయి. ఎమ్బోర్ ఈ నగరం రాజధాని డకార్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరాన్ని అక్కడి వాళ్లు చేపలు పట్టే నగరంగా పిలుచుకుంటారు. సముద్ర తీరంలో ఉండడం వల్ల నగరమంతా బీచ్‌లతో నిండివుంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే చేపలు పట్టే వారు అప్పటికప్పుడే చేపలు పట్టి అమ్ముతుంటారు. బీచ్ పొడవునా చేపల మార్కెట్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడే దేశంలోని అతిపెద్ద ఓడరేవు ఉంది. నగరం సమీపంలో టైటానియం గనులు ఉన్నాయి. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళకోసం ప్రత్యేకంగా ఒక గ్రామం ఉంది. నగరంలో ఉన్న సెంట్రల్ మార్కెట్ ప్రదేశం అత్యంత పురాతనమైన ప్రాంతం. ఈ నగరం పర్యాటకుల పాలిట ఒక గొప్ప అనుభూతిని కలిగించే నగరం. 15వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని బవోల్ రాజకుటుంబం పరిపాలించేది. నగరంలో ప్రస్తుతం దాదాపు రెండు లక్షల జనాభా ఉంటుంది. నగరానికి సమీపంలో జోయల్ ఫెడియోత్, బండియా నేషనల్ పార్కు, లాసమోనోలు ఉన్నాయి. కావోలాక్ నగరం ఈ నగరం సాలోమ్ నది తీరంలో ఉంది. ఈ నగరంలో ఉన్న జనాభా మొత్తం ముస్లిములే ఉన్నారు. ఈ నగరంలో ఉన్న మదీనా మసీదు మొత్తం సెనెగల్ దేశంలోనే అతి పెద్ద మసీదు. ఒకప్పుడు ఈ నగరం సాలోమ్, కహకీనే రాజకుటుంబాల పరిపాలనలో ముఖ్యనగరంగా వెలుగొందింది. సాలోమ్ నదీ తీర ప్రాంతంలో ఉప్పు తయారు చేసే మడులు అనేకం ఉంటాయి. ఇక్కడ బాదం పలుకుల, బాదం నూనె, ఉప్పు తయారీ అధికంగా జరుగుతుంది. నగరమంతా ఇస్లాం వాతావరణంతో నిండి ఉంటుంది. ఇస్లామిక్ విద్య నేర్చుకోవడానికి ఇక్కడికి ఎన్నో దేశాల నుండి విద్యార్థులు వస్తారు. జనాభాలో దాదాపు 50 శాతం మంది ఏదో ఒక వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతారు. సాలోమ్ నది ఇక్కడి నుండి ముందుకు ప్రవహించి సముద్రంలో కలుస్తుండడంతో ఓడలు, పడవల ప్రయాణాలు ఎక్కువగా దర్శనమిస్తాయి. ఈ నది గుండా ఓడలు సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల తమ ఎగుమతులను ఇక్కడి నుండే తీసుకువెళ్తారు.