ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప‍్రకారం.. సెనెగల్‌లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు.
ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాగా, అంతకుముందు కూడా సెనెగల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గడేదాడి లింగూరీలో ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు చనిపోయారు.
ఇది కూడా చదవండి: ప్రపంచానికి టెన్షన్.. పుతిన్ మరో బిగ్ ప్లాన్..?
Comments
Please login to add a commentAdd a comment