infant dies
-
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అగ్ని ప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెనెగల్‌లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాగా, అంతకుముందు కూడా సెనెగల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గడేదాడి లింగూరీలో ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు శిశువులు చనిపోయారు. ఇది కూడా చదవండి: ప్రపంచానికి టెన్షన్.. పుతిన్ మరో బిగ్ ప్లాన్..? -
కవల ఆడపిల్లల్ని కాదనుకున్న తల్లి
సాక్షి, కోదాడ: నెలల నిండకముందే పుట్టిన ఆ కవల ఆడ పిల్లలను ఆ తల్లి వద్దనుకుంది. వైద్యశాలకు వచ్చిన అత్త చేతిలో పెట్టి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈలోగా కవలల్లో ఒకరు.. మరికొంతసేపటికి మరొకరు.. ఇద్దరూ మృతిచెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన ఆరోగ్యానికి చిలుకూరుకు చెందిన నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఏడో నెల గర్భిణిగా ఉన్న ఆరోగ్యానికి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. ఆమెకు సాధారణ ప్రసవంలో కవల ఆడపిల్లలు జన్మించారు. బరువు తక్కువతో అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు చికిత్స కోసం ఖమ్మం వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. చదవండి: క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం విషయం తెలుసుకున్న భర్త, అతని తల్లి వైద్యశాలకు వచ్చారు. అంతలో ఆరోగ్యం.. తనకు పిల్లలు వద్దంటూ వారిని అత్త చేతిలో పెట్టి తల్లి గారింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త, అత్త కలిసి కవలలతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతశిశువుతో పాటు బతికున్న శిశువును తీసుకొని వెళ్తున్న క్రమంలో రెండో బిడ్డ కూడా కన్నుమూసింది. ఇద్దరినీ స్వగ్రామంలో ఖననం చేశారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని కోదాడ రూరల్ పోలీసులు చెప్పారు. -
'ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నా'
-
నడిరోడ్డుపై వదిలేసిన శిశువు మృతి
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఓ దారుణం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని ఓ పసిమెగ్గను ఆదిలోనే తుంచేశారు. పోషించడానికి భారమనుకున్నారో, లేక చీకటిపాపం వెంటాడుతుందని భయపడ్డారో.. అప్పుడే పుట్టిన శిశువును నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. దాంతో అభుం శుభం తెలియని ఆ పసికందు రోదిస్తూ రోదిస్తూ.. చివరకు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.