ఇంగ్లండ్‌ సూపర్‌ విక్టరీ.. క్వార్టర్స్‌కు చేరిన కేన్‌ సేన | Impressive England crush Senegal 30, set up quarter-final | Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఇంగ్లండ్‌ సూపర్‌ విక్టరీ.. క్వార్టర్స్‌కు చేరిన కేన్‌ సేన

Published Mon, Dec 5 2022 9:55 AM | Last Updated on Mon, Dec 5 2022 10:01 AM

Impressive England crush Senegal 30, set up quarter-final - Sakshi

ఫిఫా ప్రపంచకప్-2022 క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టు అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఆదివారం అర్ధ రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్‌ తొలి భాగం నుంచే సెనెగల్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్‌.. ఏ దశలోనూ సెనెగల్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు.

ఇంగ్లండ్‌ తరపున జోర్డాన్ హెండర్సన్, హ్యారీ కెన్, బుకాయో సాకా గోల్స్‌ సాధించారు. మ్యాచ్‌ ఫస్ట్‌ హాఫ్‌ 38వ నిమిషంలో హెండర్సన్ ఇంగ్లండ్‌కు తొలి గోల్‌ను అందించారు. కాగా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్‌ జట్టు మొత్తం 12 గోల్స్‌ను సాధించింది.

ఇక క్వార్టర్‌ ఫైనల్లో డిసెంబర్‌ 11న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. సెనెగల్‌ ఇంటిముఖం పట్టడంతో ఇప్పడు ఈ మెగా ఈవెంట్‌ పోటీలో నిలిచిన ఒకే ఒక ఆఫ్రికా జట్టు మొరాకో. రౌండ్ 16 లో మొరాకో మంగళవారం స్పెయిన్‌తో తలపడనుంది.
చదవండిQatar FIFA World Cup 2022: ఫ్రాన్స్‌ జోరు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement