ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తమ జోరును కొనసాగిస్తుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లో ఫ్రాన్స్ అడుగు పెట్టింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన యూరప్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టుక్కలేకపోయింది. మ్యాచ్ తొలి ఆర్ధబాగంలో ఫ్రాన్స్ ఆటగాడు అరెలియన్ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు.
దీంతో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయాయి. ఇక సెకెండ్ హాఫ్‌లో బ్రిటన్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. ఈ క్రమంలో ఇరు జట్ల శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ఇటువంటి సమయంలో 78 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు ఒలివర్ గిరౌడ్ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో 2-1 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఫ్రాన్స్ సెమీస్‌లో ఆఫ్రికా జట్టు మొరాకోతో తలపడనుంది.
చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే
Comments
Please login to add a commentAdd a comment