‘సెంచరీ’ మ్యాచ్‌లో హ్యారీ కేన్‌ ‘డబుల్‌’ | England captain Harry Kane earns his 100th senior international cap | Sakshi
Sakshi News home page

‘సెంచరీ’ మ్యాచ్‌లో హ్యారీ కేన్‌ ‘డబుల్‌’

Sep 12 2024 9:42 AM | Updated on Sep 12 2024 12:46 PM

England captain Harry Kane earns his 100th senior international cap

రెండు గోల్స్‌తో మెరిసిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ 

లండన్‌: ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ హ్యారీ కేన్‌ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిశాడు. యూరోపియన్‌ నేషన్స్‌ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్‌లాండ్‌తో జరిగిన పోరులో హ్యారీ కేన్‌ (57వ, 76వ నిమిషాల్లో) విజృంభించడంతో 
ఇంగ్లండ్‌ జట్టు 2–0తో గెలిచింది. మ్యాచ్‌కు ముందు కేన్‌కు బంగారు ట్రోఫీ బహుకరించగా... ఈ కార్యక్రమంలో హ్యారీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. 

ఇంగ్లండ్‌ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన పదో ప్లేయర్‌గా నిలిచిన కేన్‌... ఫిన్‌లాండ్‌తో పోరులో బంగారు బూట్లతో బరిలోకి దిగాడు. ద్వితీయార్ధంలో తన మార్క్‌ స్టయిల్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ తొలి గోల్‌ చేసిన కేన్‌... కాసేపటికే యువ ఆటగాడు నోనీ మాడ్యూకే ఇచ్చిన పాస్‌ను చాకచక్యంగా గోల్‌ పోస్ట్‌లోకి నెట్టి ఇంగ్లండ్‌కు తిరుగులేని ఆధిపత్యం అందించాడు. దీంతో మైదానం మొత్తం హోరెత్తిపోగా... మైలురాయి మ్యాచ్‌లో డబుల్‌ గోల్స్‌తో మెరిసిన కేన్‌కు అభిమానులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇంగ్లండ్‌ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement