లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ అరుదైన జాబితాలో చేరనున్నాడు. నేషన్స్ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్‌లాండ్‌తో ఇంగ్లండ్ తలపడనుండగా... ఇది హ్యారీ కేన్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందు కేన్‌కు బంగారు టోపీని బహూకరించనున్నారు.
ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు తొమ్మిది మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు హ్యారీ కేన్ ఆ ఘనత సాధించిన పదో ప్లేయర్ కానున్నాడు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున వేన్ రూనీ 2014లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా... పదేళ్ల తర్వాత కేన్ ఆ క్లబ్‌లో అడుగు పెట్టనున్నాడు.
ఇప్పటి వరకు 72 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన 31 ఏళ్ల కేన్.. జాతీయ జట్టు తరపున 66 గోల్స్ కొట్టాడు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా గోల్డెన్ బూట్‌లు ధరించిన కేన్... ఇంగ్లండ్ తరఫున అత్యధిక మేజర్ ఫైనల్స్ (28) ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment