Harry
-
ఇంగ్లండ్ కెప్టెన్‌కు అరుదైన బహుమతి
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ అరుదైన జాబితాలో చేరనున్నాడు. నేషన్స్ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్లాండ్తో ఇంగ్లండ్ తలపడనుండగా... ఇది హ్యారీ కేన్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందు కేన్‌కు బంగారు టోపీని బహూకరించనున్నారు.ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు తొమ్మిది మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు హ్యారీ కేన్ ఆ ఘనత సాధించిన పదో ప్లేయర్ కానున్నాడు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున వేన్ రూనీ 2014లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా... పదేళ్ల తర్వాత కేన్ ఆ క్లబ్లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటి వరకు 72 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన 31 ఏళ్ల కేన్.. జాతీయ జట్టు తరపున 66 గోల్స్ కొట్టాడు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా గోల్డెన్ బూట్లు ధరించిన కేన్... ఇంగ్లండ్ తరఫున అత్యధిక మేజర్ ఫైనల్స్ (28) ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు. -
బావ,బామ్మర్దులకు ఒకడే విల్లన్!
-
అంగరంగ వైభవంగా..
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్‌ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను.. బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్‌పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. హాజరైన ప్రియాంక చోప్రా.. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు -
యువరాజు పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు
లండన్ : తెలిసిన విషయమే అయినా ఇప్పటి వరకు కొద్దోగొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రముఖ మోడల్ మేఘన్ మార్క్లే, ప్రిన్స్ హ్యారీల ప్రేమ మరోసారి అందరికీ తెలిసిపోయింది. ఓ గేమ్‌ను చూస్తూ ప్రిన్స్ హ్యారీ మార్క్లేకు పబ్లిక్‌గా ముద్దుపెట్టేశారు. అందరూ చూస్తుండగానే ఆమెతో మరింత చనువుగా ఉంటూ ఒకరి చేతులు ఒకరిపై మెలేసుకుంటూ తమ ప్రేమను ఖరారు చేశారు. ఈ దృశ్యం ఇన్విక్టస్ క్రీడల ముగింపు సందర్భంగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు వార్తలు, గాసిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. మార్క్లే, ఆమె తల్లితో కలిసి హ్యారీ గేమ్స్ ముగింపు వేడుకలు చూసేందుకు వచ్చారు. తొలుత ఓ ప్రైవేట్ రూమ్‌లో కూర్చుని వీక్షించిన వారు చనువుగా కనిపించారు. గేమ్స్ పూర్తయి వెళ్లే క్రమంలో మార్క్లే తల్లి ముందు నడుస్తుండగానే వెనుకాలే ఉన్న హ్యారీ టక్కున మార్క్లేను దగ్గరకు లాగేసుకొని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టేశాడు. అతడి ప్రేమను కూడా మరింత బలంగా అంగీకరించినట్లుగా మార్క్లే తెగ నవ్వుతూ మురిసిపోయింది. -
వీరులకు విరుల నివాళి...
బ్రిటన్ యువరాజు విలియమ్, హ్యారీ, యువరాణి కేట్లు విహరిస్తున్నది పూల తోటే.. అయితే.. ఇవి మామూలు పూలు కావు. పింగాణీతో చేసిన పుష్పాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లవుతున్న సందర్భంగా లండన్ టవర్ వద్ద ‘బ్లడ్ స్వెప్ట్ ల్యాండ్స్ అండ్ సీస్ ఆఫ్ రెడ్’ పేరిట ఏర్పాటు చేసిన పింగాణీ పూల స్మారకాన్ని మంగళవారం వీరు అధికారికంగా ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 8,88,246 మంది బ్రిటిష్, కామన్వెల్త్ సైనికులకు (ఇందులో మన భారతీయులు 74 వేల మంది ఉన్నారు) గుర్తుగా.. ఇక్కడ 8,88,246 పింగాణీ పూలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకూ 1,20,000 పింగాణీ పూలను నాటారు. నవంబర్ 11న (మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు-1918, నవంబర్ 11) చివరి పింగాణీ పూల మొక్కను నాటుతారు. -
చెట్టు ఎక్కి ఇల్లు కట్టారు!
అహోరాత్రులు శ్రమించి 85 అడుగుల చెట్టు ఇంటిని నిర్మించారు ఇంగ్లండ్‌కు చెందిన ఎల్డెన్ కోన్లే, హారీ, హైనెస్ అనే కుర్రాళ్లు. విశేషం ఏమిటంటే ఈ వృక్షగృహాన్ని నిర్మించడానికి సుత్తులు, మేకులలాంటివి ఏవీ వాడలేదు. ‘‘ఒకవైపు ఎండ దంచేస్తోంది. మరోవైపు ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దాలనే తపన. మా తపన ముందు ఎండ చిన్న బోయింది’’ అని గుర్తు చేసుకున్నాడు హెనెస్. పందొమ్మిది సంవత్సరాల ఈ కుర్రాడు ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్షైర్లోని ఒక వ్యవసాయక్షేత్రంలో ఈ చెట్టిల్లు కడుతున్న క్రమంలో చిన్నా చితకా గాయాలయ్యాయి. అయితే వాటిని లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఇదంతా ఒక ఎత్తయితే ఫామ్ యజమాని టిమ్ టేలర్ భయాలు మరో ఎత్తు! ‘‘అయ్యో..మీకు ఏమన్నా అవుతుందేమో. రిస్కు తీసుకుంటున్నారేమో’’ ‘‘చెట్టు మీద నుంచి కింద పడతారేమో’’ ఇలా ఏవేవో ఊహించుకొని భయపడుతూ ఉండేవాడు. అతనికి నచ్చజెప్పి పనిలోకి వెళ్లడానికి తలప్రాణం తోకకు వచ్చేది. పనంతా పూర్తయిన తరువాత మాత్రం ముగ్గురు మిత్రులనూ తెగ మెచ్చుకున్నాడు ఆ వ్యవసాయక్షేత్ర యజమాని. ‘‘వాళ్ల పట్టుదల చూస్తే ముచ్చటేసేది’’ అని కుర్రాళ్ల పనితనం గురించి గొప్పగా చెబుతాడు టేలర్. ఫేస్బుక్లో ‘బ్లూ ఫారెస్ట్ ట్రీ హౌజ్’ నిర్వహించిన ‘బెస్ట్ ట్రీ హౌజ్’ పోటీలో ఈ ముగ్గురు మిత్రుల ‘వృక్షగృహం’ మొదటి బహుమతి గెలుచుకుంది. ‘‘ఎప్పుడూ ఈ చెట్టింటిలోనే నివసించాలనేంత గొప్పగా ఉంది’’ అంటున్నారు న్యాయనిర్ణేతలు. -
బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర
అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు బ్రిటన్ యువరాజు హారీ హత్యకు కుట్రపన్నారు. ఆయనను బంధించి చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. అఫ్ఘాన్‌లో బ్రిటీష్ దళాల తరపున హారీ పనిచేస్తున్నప్పడు ఈ సంఘటనలు జరినట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. తాలిబన్ నాయకుడు ఖ్వారీ నస్రుల్లా ఓ పాకిస్థాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పినట్టు వెల్లడైంది. 'అఫ్ఘాన్‌కు హారీ వచ్చినపుడు మా సభ్యులు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నించారు. అమెరికా కోసం పోరాటం చేస్తున్న ఓ సాధారణ సైనికుడిగానే హారీని పరిగణించాం. ఆయన బ్రిటన్‌లో యువరాజే అయినా మా దృష్టిలో ఓ సైనికుడు మాత్రమే. హారీని చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాం కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు' అని తాలిబన్ నేత చెప్పాడు. మొదటిసారి 2008-12 మధ్య కాలంలో అఫ్ఘాన్ వెళ్లిన హారీ సైన్యంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేశారు.