యువరాజు పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు | Meghan Markle and smitten Prince Harry kiss and cuddle | Sakshi
Sakshi News home page

యువరాజు పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు

Published Sun, Oct 1 2017 4:04 PM | Last Updated on Sun, Oct 1 2017 7:23 PM

Meghan Markle and smitten Prince Harry kiss and cuddle

అందరి మధ్యే ప్రియురాలికి ముద్దు పెడుతున్న ప్రిన్స్‌ హ్యారీ

లండన్‌ : తెలిసిన విషయమే అయినా ఇప్పటి వరకు కొద్దోగొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రముఖ మోడల్‌ మేఘన్‌ మార్క్‌లే, ప్రిన్స్‌ హ్యారీల ప్రేమ మరోసారి అందరికీ తెలిసిపోయింది. ఓ గేమ్‌ను చూస్తూ ప్రిన్స్‌ హ్యారీ మార్క్‌లేకు పబ్లిక్‌గా ముద్దుపెట్టేశారు. అందరూ చూస్తుండగానే ఆమెతో మరింత చనువుగా ఉంటూ ఒకరి చేతులు ఒకరిపై మెలేసుకుంటూ తమ ప్రేమను ఖరారు చేశారు. ఈ దృశ్యం ఇన్‌విక్టస్‌ క్రీడల ముగింపు సందర్భంగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు వార్తలు, గాసిప్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

మార్క్‌లే, ఆమె తల్లితో కలిసి హ్యారీ గేమ్స్‌ ముగింపు వేడుకలు చూసేందుకు వచ్చారు. తొలుత ఓ ప్రైవేట్‌ రూమ్‌లో కూర్చుని వీక్షించిన వారు చనువుగా కనిపించారు. గేమ్స్‌ పూర్తయి వెళ్లే క్రమంలో మార్క్‌లే తల్లి ముందు నడుస్తుండగానే వెనుకాలే ఉన్న హ్యారీ టక్కున మార్క్‌లేను దగ్గరకు లాగేసుకొని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టేశాడు. అతడి ప్రేమను కూడా మరింత బలంగా అంగీకరించినట్లుగా మార్క్‌లే తెగ నవ్వుతూ మురిసిపోయింది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement