britain prince
-
ఇక బ్రిటన్ రాజు చార్లెస్
బల్మోరల్ క్యాజిల్: బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రైవీ కౌన్సిల్ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదీ చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత -
షాకింగ్! బ్రిటన్ ప్రిన్స్‌కు బిన్ లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు!
లండన్: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు(రూ.9.6కోట్లు) విరాళంగా తీసుకున్నారని ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ మొత్తం చార్లెస్‌కు చెందిన చారిటబుల్ ట్రస్టులో జమ అయినట్లు తెలిపింది. అమెరికా ట్విన్ టవర్లపై దాడి(9/11) ఘటనలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి. అలాంటిది ఆయన సోదరులు బకర్ బిన్ లాడెన్, షఫీక్‌ల నుంచి ప్రిన్స్ చార్లెస్ భారీ విరాళం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే సౌదీకి చెందిన వీళ్లు ఏదైనా తప్పు చేశారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ చార్లెస్ చారిటబుల్ ట్రస్టులపై అధికారుల నిఘా మరింత పెరిగింది. 2013లో బకర్ లాడెన్‌ను ప్రిన్స్ చార్లెస్ లండన్‌లో కలిసినప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్(పీడబ్ల్యూసీఎఫ్)కు విరాళం అందిందని నివేదిక తెలిపింది. ట్రస్టు సలహాదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రిన్స్ దీన్ని అంగీకరించారని పేర్కొంది. అయితే ఆ సమయంలో ట్రస్టులోని ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని పీడబ్ల్యూసీఎఫ్ ఛైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు. సౌదీ వ్యాపారవేత్తతో క్యాష్ ఫర్ ఆనర్స్ కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో చారిటబుల్ ట్రస్టుపై బ్రిటిష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ప్రిన్స్ పౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా చేశారు. చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు.. -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
అంగరంగ వైభవంగా..
బెర్క్‌షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్‌ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను.. బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్‌పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. హాజరైన ప్రియాంక చోప్రా.. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు -
యువరాణి గౌను కోటి!
మరికొద్ది రోజుల్లో (మే 19) అంగరంగ వైభవం గా బ్రిటన్ యువరాజు హ్యారీ, మేగన్‌ల వివాహ మహోత్సవం జరగనుంది. ఇంకేముంది సాధారణంగానే ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడుకుంటాయి. ఏం వంటలు చేస్తారు.. ఎంతమంది అతిథులను పిలుస్తారని కుతూహలంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మరి పెళ్లి రోజు పెళ్లి కూతురు మేగన్ ఏ పెళ్లి గౌను వేసుకుంటారు..? ఎంత ఖర్చుతో తయారు చేయిస్తున్నారు..? ఏ సంస్థ రూపొందిస్తోంది.. ఎలాం టి డిజైన్‌తో తయారు చేస్తున్నారనేది చాలా మంది డిజైనర్లు.. సాధారణ జనాల మెదడును తొలుస్తున్న ప్రశ్న.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టకేలకు లభించింది. మేఘన్ పెళ్లి గౌను డిజైన్ బయటకొచ్చింది. మేగన్ వేసుకునే గౌను ఖరీదు ఎంతో తెలుసా.. దాదాపు రూ.94 లక్షలు.. ఈ గౌనును యువరాజు హ్యారీనే కొనిస్తున్నారట. అయితే ఇంతకు ముందు జరిగిన రాజవివాహాల్లోకెల్లా ఈ గౌనే ఖరీదైనదా అంటే కాదు.. కేట్ మిడిల్టన్ వివాహానికి దాదాపు రూ.రెండున్నర కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన గౌను ధరించారు. ప్రిన్సెస్ డయానా 1981లో ఇప్పటిలెక్క ప్ర కారం దాదాపు రూ.33 లక్షల విలువైన గౌను ధరించారు. 1947లో ఎలిజబెత్–2 రాణి వివాహ మహోత్సవంలో కూడా ఆమె ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
యువరాజు పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు
లండన్ : తెలిసిన విషయమే అయినా ఇప్పటి వరకు కొద్దోగొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రముఖ మోడల్ మేఘన్ మార్క్లే, ప్రిన్స్ హ్యారీల ప్రేమ మరోసారి అందరికీ తెలిసిపోయింది. ఓ గేమ్‌ను చూస్తూ ప్రిన్స్ హ్యారీ మార్క్లేకు పబ్లిక్‌గా ముద్దుపెట్టేశారు. అందరూ చూస్తుండగానే ఆమెతో మరింత చనువుగా ఉంటూ ఒకరి చేతులు ఒకరిపై మెలేసుకుంటూ తమ ప్రేమను ఖరారు చేశారు. ఈ దృశ్యం ఇన్విక్టస్ క్రీడల ముగింపు సందర్భంగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు వార్తలు, గాసిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. మార్క్లే, ఆమె తల్లితో కలిసి హ్యారీ గేమ్స్ ముగింపు వేడుకలు చూసేందుకు వచ్చారు. తొలుత ఓ ప్రైవేట్ రూమ్‌లో కూర్చుని వీక్షించిన వారు చనువుగా కనిపించారు. గేమ్స్ పూర్తయి వెళ్లే క్రమంలో మార్క్లే తల్లి ముందు నడుస్తుండగానే వెనుకాలే ఉన్న హ్యారీ టక్కున మార్క్లేను దగ్గరకు లాగేసుకొని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టేశాడు. అతడి ప్రేమను కూడా మరింత బలంగా అంగీకరించినట్లుగా మార్క్లే తెగ నవ్వుతూ మురిసిపోయింది. -
గూగుల్ సెర్చ్‌లో టాప్ నటి ఎవరో తెలుసా?
వాషింగ్టన్: గడిచిన 2016 ఏడాదికిగారూ గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన నటి అమెరికన్ టీవీ స్టార్ మేఘన్ మార్కెల్. ఈ విషయాన్ని గూగుల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సూట్స్ టీవీ డ్రామాతో మేఘన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాంతోపాటుగా అమెరికన్ నెట్వర్స్ షోలో విజేతగా నిలిచింది. అంతమాత్రాన ఆమె మోస్ట్ సెర్చ్డ్ నటి కాలేదండోయ్.. బ్రిటన్ యువరాజు హ్యారీతో ఆమె ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన టీవీ నటి మేఘన్ మార్కెల్‌తో ప్రిన్స్ డేటింగ్ చేస్తున్నట్లు గతేడాది చాలా కథనాలు వచ్చాయి. దీంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రిన్స్ హ్యారిస్‌తో ప్రేమలో పడిపోయిందన్న వార్తలు గుప్పమన్న తర్వాత ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ తన పేరు లిఖించుకుంది. యువరాజుతో రిలేషన్ లో ఆమె ఎవరు అని తెలుకునేందుకు 'హూ ఈజ్ మెఘన్ మార్కెల్' అని, మరికొన్ని కీ వర్డ్స్ తో నెటిజన్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టీవీ నటి కోసం వెతికారు. గతేడాది మే నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఆపై హ్యారితో అనుబంధం కారణంగానే ఆమె మోస్ట్ సెర్చ్డ్ నటిగా నిలిచిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి. -
ఆ నటితో డేటింగ్ చేస్తున్న ప్రిన్స్!
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రేమలో మునిగితేలుతున్నాడు. తన కన్నా మూడేళ్లు పెద్దదైన అమెరికన్ టీవీ నటి మేఘన్ మార్కెల్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘సూట్స్’ టీవీ డ్రామాతో పాపులర్ అయిన మేఘన్‌తో సానిహిత్యంతో పెరిగాక ప్రిన్స్ హ్యారీ చాలా ఆనందంగా ఉంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ’ద సన్డే ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపింది. 35 ఏళ్ల మేఘన్ అందం చూసి హ్యారీ ఫిదా అయ్యాడని, అయితే, వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను నెమ్మదిగా ముందుకుతీసుకెళుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ’కొన్నివారాలుగా వారు సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరినొకరు చూడటాన్ని ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ’తమ మధ్య కొనసాగుతున్న బంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలని హ్యారీ ప్రయత్నిస్తున్నాడు. తమ రొమాన్స్ గురించి బయటకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో హ్యారీకి తెలుసు. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టడం కూడా కష్టమని ఆయన భావిస్తున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ’సూట్స్’ షూటింగ్ సందర్భంగా టొరంటోలో తొలిసారి హ్యారీ (32), మేఘన్ మధ్య చూపులు కలిశాయట. ఆ తర్వాత తరచూ కలుసుకున్న ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడిందని, అయితే ఇది దీర్ఘకాలం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి. -
బ్రిటన్ యువరాజు హారీ హత్యకు తాలిబన్ల కుట్ర
అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ ఉగ్రవాదులు బ్రిటన్ యువరాజు హారీ హత్యకు కుట్రపన్నారు. ఆయనను బంధించి చంపేందుకు గతంలో పలుమార్లు ప్రయత్నించారు. అఫ్ఘాన్‌లో బ్రిటీష్ దళాల తరపున హారీ పనిచేస్తున్నప్పడు ఈ సంఘటనలు జరినట్టు ఆలస్యంగా వెలుగుచూసింది. తాలిబన్ నాయకుడు ఖ్వారీ నస్రుల్లా ఓ పాకిస్థాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పినట్టు వెల్లడైంది. 'అఫ్ఘాన్‌కు హారీ వచ్చినపుడు మా సభ్యులు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నించారు. అమెరికా కోసం పోరాటం చేస్తున్న ఓ సాధారణ సైనికుడిగానే హారీని పరిగణించాం. ఆయన బ్రిటన్‌లో యువరాజే అయినా మా దృష్టిలో ఓ సైనికుడు మాత్రమే. హారీని చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాం కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు' అని తాలిబన్ నేత చెప్పాడు. మొదటిసారి 2008-12 మధ్య కాలంలో అఫ్ఘాన్ వెళ్లిన హారీ సైన్యంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేశారు.