యువరాణి గౌను కోటి!  | Britain Prince Marriage Meghan Dress Is One Crore | Sakshi
Sakshi News home page

యువరాణి గౌను కోటి! 

Published Sun, May 6 2018 1:49 AM | Last Updated on Sun, May 6 2018 4:24 AM

Britain Prince Marriage Meghan Dress Is One Crore - Sakshi

ఎలిజబెత్‌–2 రాణి

మరికొద్ది రోజుల్లో (మే 19) అంగరంగ వైభవం గా బ్రిటన్‌ యువరాజు హ్యారీ, మేగన్‌ల వివాహ మహోత్సవం జరగనుంది. ఇంకేముంది సాధారణంగానే ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడుకుంటాయి. ఏం వంటలు చేస్తారు.. ఎంతమంది అతిథులను పిలుస్తారని కుతూహలంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. మరి పెళ్లి రోజు పెళ్లి కూతురు మేగన్‌ ఏ పెళ్లి గౌను వేసుకుంటారు..? ఎంత ఖర్చుతో తయారు చేయిస్తున్నారు..? ఏ సంస్థ రూపొందిస్తోంది.. ఎలాం టి డిజైన్‌తో తయారు చేస్తున్నారనేది చాలా మంది డిజైనర్లు.. సాధారణ జనాల మెదడును తొలుస్తున్న ప్రశ్న.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టకేలకు లభించింది.

మేఘన్‌ పెళ్లి గౌను డిజైన్‌ బయటకొచ్చింది. మేగన్‌ వేసుకునే గౌను ఖరీదు ఎంతో తెలుసా.. దాదాపు రూ.94 లక్షలు.. ఈ గౌనును యువరాజు హ్యారీనే కొనిస్తున్నారట. అయితే ఇంతకు ముందు జరిగిన రాజవివాహాల్లోకెల్లా ఈ గౌనే ఖరీదైనదా అంటే కాదు.. కేట్‌ మిడిల్‌టన్‌ వివాహానికి దాదాపు రూ.రెండున్నర కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన గౌను ధరించారు. ప్రిన్సెస్‌ డయానా 1981లో ఇప్పటిలెక్క ప్ర కారం దాదాపు రూ.33 లక్షల విలువైన గౌను ధరించారు. 1947లో ఎలిజబెత్‌–2 రాణి వివాహ మహోత్సవంలో కూడా ఆమె ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మేగన్‌ ధరించే గౌను నమూనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement