గూగుల్ సెర్చ్‌లో టాప్ నటి ఎవరో తెలుసా? | Meghan Markle is most Googled actress of 2016 | Sakshi
Sakshi News home page

గూగుల్ సెర్చ్‌లో టాప్ నటి ఎవరో తెలుసా?

Published Sun, Jan 1 2017 8:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

గూగుల్ సెర్చ్‌లో టాప్ నటి ఎవరో తెలుసా?

గూగుల్ సెర్చ్‌లో టాప్ నటి ఎవరో తెలుసా?

వాషింగ్టన్: గడిచిన 2016 ఏడాదికిగారూ గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన నటి అమెరికన్ టీవీ స్టార్ మేఘన్ మార్కెల్. ఈ విషయాన్ని గూగుల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సూట్స్‌ టీవీ డ్రామాతో మేఘన్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాంతోపాటుగా అమెరికన్ నెట్‌వర్స్ షోలో విజేతగా నిలిచింది. అంతమాత్రాన ఆమె మోస్ట్ సెర్చ్‌డ్ నటి కాలేదండోయ్.. బ్రిటన్‌ యువరాజు హ్యారీతో ఆమె ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన టీవీ నటి మేఘన్‌ మార్కెల్‌తో  ప్రిన్స్ డేటింగ్ చేస్తున్నట్లు గతేడాది చాలా కథనాలు వచ్చాయి. దీంతో ఆమె పేరు మార్మోగిపోయింది.

ప్రిన్స్ హ్యారిస్‌తో ప్రేమలో పడిపోయిందన్న వార్తలు గుప్పమన్న తర్వాత ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా 2016 ఏడాదికి గానూ తన పేరు లిఖించుకుంది. యువరాజుతో రిలేషన్ లో ఆమె ఎవరు అని తెలుకునేందుకు 'హూ ఈజ్ మెఘన్ మార్కెల్' అని, మరికొన్ని కీ వర్డ్స్ తో నెటిజన్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టీవీ నటి కోసం వెతికారు. గతేడాది మే నెలలో 'సూట్స్‌' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఆపై హ్యారితో అనుబంధం కారణంగానే ఆమె మోస్ట్ సెర్చ్‌డ్ నటిగా నిలిచిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement