![వీరులకు విరుల నివాళి...](/styles/webp/s3/article_images/2017/09/2/51407276812_625x300.jpg.webp?itok=U8Li9smQ)
వీరులకు విరుల నివాళి...
బ్రిటన్ యువరాజు విలియమ్, హ్యారీ, యువరాణి కేట్‌లు విహరిస్తున్నది పూల తోటే.. అయితే.. ఇవి మామూలు పూలు కావు. పింగాణీతో చేసిన పుష్పాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లవుతున్న సందర్భంగా లండన్ టవర్ వద్ద ‘బ్లడ్ స్వెప్ట్ ల్యాండ్స్ అండ్ సీస్ ఆఫ్ రెడ్’ పేరిట ఏర్పాటు చేసిన పింగాణీ పూల స్మారకాన్ని మంగళవారం వీరు అధికారికంగా ఆవిష్కరించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 8,88,246 మంది బ్రిటిష్, కామన్వెల్త్ సైనికులకు (ఇందులో మన భారతీయులు 74 వేల మంది ఉన్నారు) గుర్తుగా.. ఇక్కడ 8,88,246 పింగాణీ పూలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకూ 1,20,000 పింగాణీ పూలను నాటారు. నవంబర్ 11న (మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు-1918, నవంబర్ 11) చివరి పింగాణీ పూల మొక్కను నాటుతారు.