Britains Prince William
-
మోదీ గ్రిప్
కరచాలనం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, యువరాణి కేట్ మిడిల్టన్ నిన్నమొన్నటి వరకు భారత్‌లో పర్యటించి వెళ్లారు. క్రికెట్ ఆడారు. విలువిద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఖాజీరంగ పార్కులో వన్యప్రాణులతో ప్రేమగా గడిపారు. తాజ్‌మహల్ ముందు కూర్చొని ఫొటోలు దిగారు. పనిలో పనిగా భూప్రకంపనలూ చవిచూశారు. అయితే వీటన్నిటికన్నా కూడా విలియమ్, కేట్ దంపతులు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఘట్టం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. మోదీ తనను కలిసేందుకు ఎవరు వచ్చినా వారికి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆలింగనం చేసుకోవడం తెలిసిందే. అదే తరహాలో ఆయన.. యువరాజు విలియమ్ చెయ్యి పట్టుకుని గట్టిగా షేక్‌హ్యాండ్ ఇచ్చారు. మోదీ ఎంత గట్టిగా నొక్కారో తెలియదు కానీ, ఈ షేక్ హ్యాండ్ దెబ్బకు విలియమ్ చెయ్యి దాదాపు కమిలిపోయింది. ఎర్రని ఆయన చెయ్యి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మేరకు రంగు మారిపోయింది. -
భూటాన్‌లో ప్రిన్స్ జంట
థింపు: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులు గురువారం భూటాన్ పర్యటనకు వచ్చారు. రాజధాని థింపులో వారికి అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు. విలియం, కేట్లు భూటాన్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్, రాణి జట్సన్ పేమాను వారు తషికో డోంగ్ కోటలో కలుసుకున్నారు. భారత్‌నుంచి విలియం దంపతులు గురువారం ఉదయం థింపు చేరుకున్నారు. గురువారం రాత్రి విలియం, కేట్ గౌరవార్థం భూటాన్ రాజు విందు ఏర్పాటు చేశారు. వీరు శనివారం ఆగ్రాకు వస్తారు. ఖడ్గమృగాన్ని చంపిన వేటగాళ్లు: బుధవారం రాత్రి విలియం దంపతులు అస్సాం గువాహటిలో కజిరంగా జాతీయ పార్కు సమీపంలోని రిసార్టులో ఉండగానే భారీ భద్రతను కూడా లెక్కచేయకుండా వేటగాళ్లు పార్కులో ఖడ్గమృగాన్ని వేటాడి చంపి దాని కొమ్మును తీసుకెళ్లారు. అధికారులు గురువారం ఖడ్గమృగం కళేబరాన్ని కనుగొన్నారు. -
స్కూలుకెళ్లనున్న యువరాజు
లండన్: బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన బుల్లి యువరాజు పాఠశాల చదువుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కనిపిస్తోంది. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతుల తొలి సంతానమైన ప్రిన్స్ జార్జ్. ప్రస్తుతం జార్జ్ వయసు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు. అయితే, తమ కుమారున్ని స్కూలుకు పంపించాలని రాజదంపతులు నిర్ణయించుకున్నారు. జార్జ్ నర్సరీ విద్యను మొదలెట్టనున్నట్లు కెన్సింగ్టన్ రాజప్రసాదానికి చెందిన ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో యువరాజు విద్యాభ్యాసం ప్రారంభం అవుతుందని చెప్పారు. లండన్ తూర్పువైపుగా 110 మైళ్ల దూరంలో ఉన్న నార్ఫోల్క్ లోని వెస్టాక్రె మాంటెస్సోరి స్కూళ్లో యువరాజుని చేర్చనున్నట్లు సమాచారం. ఆ పాఠశాల కూడా బుల్లి యువరాజుకు స్వాగతం పలుకుతోంది. తమ పాఠశాలలోని ఇతర విద్యార్థుల మాదిరిగానే యువరాజు కూడా ఇక్కడ సంతోషంగా, హాయిగా ఉంటాడని ఆశిస్తున్నామని యజమాన్యం పేర్కొంది. యువరాజు జార్జ్ వెళ్లనున్న మాంటిస్సోరి పాఠశాల -
వీరులకు విరుల నివాళి...
బ్రిటన్ యువరాజు విలియమ్, హ్యారీ, యువరాణి కేట్లు విహరిస్తున్నది పూల తోటే.. అయితే.. ఇవి మామూలు పూలు కావు. పింగాణీతో చేసిన పుష్పాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లవుతున్న సందర్భంగా లండన్ టవర్ వద్ద ‘బ్లడ్ స్వెప్ట్ ల్యాండ్స్ అండ్ సీస్ ఆఫ్ రెడ్’ పేరిట ఏర్పాటు చేసిన పింగాణీ పూల స్మారకాన్ని మంగళవారం వీరు అధికారికంగా ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 8,88,246 మంది బ్రిటిష్, కామన్వెల్త్ సైనికులకు (ఇందులో మన భారతీయులు 74 వేల మంది ఉన్నారు) గుర్తుగా.. ఇక్కడ 8,88,246 పింగాణీ పూలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకూ 1,20,000 పింగాణీ పూలను నాటారు. నవంబర్ 11న (మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు-1918, నవంబర్ 11) చివరి పింగాణీ పూల మొక్కను నాటుతారు. -
నిజాం నగ ధగ...
లండన్‌లో మంగళవారం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో బ్రిటన్ ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ధరించిన ఈ డెమైండ్ నెక్లెస్ చూపరులను విశేషంగా ఆకర్షించింది. రెండో ఎలిజబెత్ రాణి నుంచి అరువుపై తెచ్చుకొని మరీ మిడిల్టన్ ఈ హారాన్ని ధరించింది. ఇందులోని విశేషం ఏమిటంటే ఈ వజ్రాల హారం హైదరాబాద్ నిజాం నవాబులకు చెందినది. ‘నిజాం ఆఫ్ హైదరాబాద్’గా పిలిచే ఈ కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను 1947లో రెండో ఎలిజబెత్ రాణి తన వివాహ కానుకగా అందుకుంది. -
బేబీ ప్రిన్స్ జార్జ్‌కు దీవెనలు
లండన్: బ్రిటిష్ రాచ శిశువు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతులు తమ మగ శిశువును పొత్తిళ్లలో ఎత్తుకుని, లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆస్పత్రి వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చిన కేట్, మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి వెలుపల గుమిగూడిన మీడియా ప్రతినిధులకు, ప్రజలకు విలియమ్, కేట్ దంపతులు అభివాదం చేశారు.