మోదీ గ్రిప్
కరచాలనం
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, యువరాణి కేట్ మిడిల్టన్ నిన్నమొన్నటి వరకు భారత్‌లో పర్యటించి వెళ్లారు. క్రికెట్ ఆడారు. విలువిద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఖాజీరంగ పార్కులో వన్యప్రాణులతో ప్రేమగా గడిపారు. తాజ్‌మహల్ ముందు కూర్చొని ఫొటోలు దిగారు. పనిలో పనిగా భూప్రకంపనలూ చవిచూశారు.
అయితే వీటన్నిటికన్నా కూడా విలియమ్, కేట్ దంపతులు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఘట్టం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్‌ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. మోదీ తనను కలిసేందుకు ఎవరు వచ్చినా వారికి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆలింగనం చేసుకోవడం తెలిసిందే. అదే తరహాలో ఆయన.. యువరాజు విలియమ్ చెయ్యి పట్టుకుని గట్టిగా షేక్‌హ్యాండ్ ఇచ్చారు. మోదీ ఎంత గట్టిగా నొక్కారో తెలియదు కానీ, ఈ షేక్ హ్యాండ్ దెబ్బకు విలియమ్ చెయ్యి దాదాపు కమిలిపోయింది. ఎర్రని ఆయన చెయ్యి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మేరకు రంగు మారిపోయింది.