shake hands
-
రేపొక్క రోజే ఏడు రోజులు
ఇండిపెండెన్స్ డే.. రిపబ్లిక్ డే...దేశం ఇంకా ఏదైనా సాధిస్తే ఆ డే..ఇవీ మనకు దినోత్సవాలు.తిథుల్ని బట్టి పండుగలూ ఉంటాయి.‘థీమ్’ పాటింపు ‘డే’లు.. కొత్తవి.మంచి ఎక్కడున్నా తీసుకోవలసిందే.రేపొక్క రోజే ఏడు ‘డే’ లున్నాయి.‘డూమ్స్‌డే’ అని కూడా అంటున్నారు.దాన్నొదిలేసిమిగతా ‘డే’లను స్వాగతిద్దాం యోగా డే (ఒక్క ఆసనమైనా నేర్చుకుందాం) భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనపై ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను జరుపుకుంటున్నాం. ఈ రోజును సూచించినది కూడా మోదీనే. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే జూన్ 20–21–22.. ఈ మూడు రోజుల మధ్య రోజైన 21న యోగా డేకి మోదీ ఎంపిక చేశారు. మ్యూజిక్ డే (ఒక మంచి పాట విందాం) వరల్డ్ మ్యూజిక్ డే తొలిసారి పారిస్‌లో 1982 జూన్ 21న జరిగింది. ఆ తర్వాతి నుంచి ఇండియా సహా 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఔత్సాహిక, ఉద్ధండ సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్ కలిసి మ్యూజిక్ డే నెలకొల్పారు. వరల్డ్ హ్యూమనిస్డ్ డే (సాటి మనిషికి చేయూతనిద్దాం) హ్యూమనిస్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ ‘వరల్డ్ హ్యూమనిస్డ్ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే తాత్విక భావనను వ్యాప్తి చేయడానికి ప్రపంచ దేశాలలోని అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్ డే ఆవిర్భవించింది. 1980ల నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వచ్చిందే కానీ, కచ్చితంగా ఫలానా సంవత్సరం నుంచి ప్రారంభం అయిందని చెప్పడానికి తగిన ఆధారాల్లేవు. అయితే జూన్ 21 అందుకు ఫిక్స్ అయింది. హ్యాండ్ షేక్ డే(విశ్వంతోకరచాలనంచేద్దాం) ఇది ఈ ఏడాది గానీ, మరికొన్నేళ పాటు గానీ ఈ ‘డే’ జరిగే అవకాశాలు లేవు. కరోనాతో భౌతిక దూరం తప్పని సరైంది కనుక ఈ ‘వరల్డ్ హ్యాండ్‌షేక్ డే’ కి తాత్కాలికంగా కాలం చెల్లినట్లే. నిజాకిది చేతులు చేతులు కలిపే హ్యాండ్‌షేక్ డే గా మొదలవలేదు. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడంతో ప్రారంభం అయింది. ఇవాన్ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరునికి కలిగిన ఆలోచన నుంచి సముద్రానికి హ్యాండ్‌షేక్ ఇవ్వడం అనే ఆధ్యాత్మిక భావన అంకురించిందని అంటారు. ఏటా జూన్ 21న ఈ డే ని జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే (నాన్న దీవెనలు కోరుకుందాం) తేదీ ఏదైనా గానీ మదర్స్ డే మే రెండో ఆదివారం వస్తే, ఫాదర్స్ డే జూన్ మూడో ఆదివారం వస్తుంది. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 21న వచ్చింది. కుటుంబం పాటు పడుతుండే తండ్రిని గౌరవించుకోవడం కోసం ప్రపంచం ఆయనకొక రోజును కేటాయించింది. జూన్ మూడో వారమే ఫాదర్స్ డే ఎందుకు? ఆ ‘డే’న గుర్తిస్తూ ప్రభుత్వ సంతకాలు అయిన రోజది. మదర్స్ డే కూడా అంతే. హైడ్రోగ్రఫీ డే (నీటికి నమస్కరిద్దాం) హైడ్రోగ్రఫీ అంటే జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం. నదులు, సముద్రాలు, మహా సముద్రాలు, సరస్సులు, ఇతర జలాశయాలను అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి హైడ్రోగ్రఫీ తోడ్పడుతుంది. ‘ఇంటర్నేషనల్ హైడ్రోగ్రఫిక్ ఆర్గనైజేషన్’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్ 21న ‘వరల్డ్ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. టీ షర్ట్ డే (ట్రెండేమిటో తెలుసుకుందాం) సాధారణంగా ‘డే’లన్నీ యు.ఎస్. నుంచి ప్రపంచానికి విస్తరిస్తాయి. టీ షర్ట్ డే మాత్రం జర్మనీలో మొదలైంది. తొలిసారి బెర్లిన్‌లో 2008లో ఇంటర్నేషనల్ టీ షర్ట్ డే జరిగింది. జర్మనీలోని ఫ్యాషన్ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్ డేని ఏర్పరిచారు తప్ప ఇందులో సంఘహితం ఏమీలేదు. అయితే వ్యక్తి సౌలభ్యం ఉంది. ధరించడానికి సులువుగా ఉండటం, ఒక స్టెయిల్ స్టేట్మెంట్ అవడంతో యూత్ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు. ఫాలో అవడమే సెలబ్రేషన్. జూన్ 21న దీనినొక ఉత్సవంలా కొన్నిదేశాలలో నిర్వహిస్తారు. -
కరచాలనం చేస్తున్నారా.. జాగ్రత్త
సాక్షి, సిరిసిల్ల : మనం ఆదమరిస్తే అప్రమత్తం చేసేలా ఓ సెన్సర్ స్మార్ట్ వాచ్‌ను రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని. కరోనా వైరస్ కట్టడి కోసం కరచాలనం చేయొద్దని, చేతితో కళ్లను, నోటిని, ముక్కును ముట్టుకోవద్దని వైద్యులు చెపుతున్న విషయం తెలిసిందే. అయితే అలవాటులో పొరపాటులా చెయ్యి ముఖాన్ని తాకుతూనే ఉంటుంది. ఇలాంటి అలవాటును దూరం చేసే లక్ష్యంతో సెన్సర్ స్మార్ట్ వాచ్‌ను తయారు చేసింది బుధవారపు స్నేహ. స్మార్ట్ సెన్సర్ వాచ్‌ను చూపుతున్న స్నేహ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న స్నేహ.. ఓ వాచ్‌ను రూపొందించి, దానికి సెన్సర్ డివైస్‌ను ఏర్పాటు చేసింది. మనం కరచాలనం చేయబోయినా.. ముక్కు, నోరు, కళ్లను తాకబోయినా వెంటనే ఆ సెన్సర్ గుర్తించి శబ్దం చేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా స్మార్ట్ వాచ్ హెచ్చరిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్‌ను తయారు చేసినట్లు స్నేహ తెలిపింది. స్నేహ కృషిని జిల్లా అధికారులు సోమవారం అభినందించారు. -
మానవ స్పర్శకు కరోనాతో గండి
వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్‌గానే ఎక్కువగా సంభాషిస్తున్న, టెక్నాలజీ ప్రాధాన్యం–సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపది కన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ అనేది మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. ఒకసారి కరోనా వైరస్ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెను సవాల్ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్‌కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి. మానవులకు స్పర్శ అనేది విస్తారమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడంలో సందేహమే లేదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా, ప్రజలు అనేక కారణాలతో సామాజికంగా ఇతరులను స్పర్శించడం పట్ల జాగరూకంగా ఉంటూండటం పెరుగుతూ వస్తోంది. తాజాగా ప్రపంచాన్ని కరోనా వైరస్ ముట్టడిస్తుండంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రజలు ఇప్పటికే పరస్పరం చేతులు కలపటాన్ని మానేస్తున్నారు. బ్రిటిష్ రాణి సైతం వైరస్ బారిన పడకుండా ఉండటానికి ముందుజాగ్రత్తగా చేతులకు గ్లోవ్స్ ధరించి కనిపించారు. ఇప్పటికే పరస్పరం చేతులు కలపడాన్ని వీలైనంతవరకు మానేయాలి అనే భావన ప్రపంచంలో ఉనికిలో ఉంది. కరోనా వైరస్ ఈ కరస్పర్శకు సంబంధించి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగించనుంది. మానవ స్పర్శకు అంత ప్రాధాన్యత ఎందుకు? మనం ఇతరుల పట్ల ఎలా అనుభూతి చెందుతున్నామో స్పర్శ చాటుతుంది. మన మాటల వ్యక్తీకరణను స్పర్శ పెంచుతుంది. ఉదాహరణకు ఇతరులను ఓదార్చుతున్నప్పుడు వారి చేతిని స్పర్శించడం అనేది మనం వారి పట్ల నిజంగా కేర్ తీసుకుంటున్నామని తెలుపుతుంది. తమ జీవితకాలం పొడవునా ప్రజలు భౌతిక స్పర్శ ద్వారా ప్రయోజనం పొందుతూనే ఉంటారు. మనిషికి స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో సంభవించే క్షేమం, సుఖసంతోషాలపై ప్రభావం చూపే స్పర్శ సామర్థ్యానికి సంబంధించి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కూడా. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి మానవ స్పర్శ అనేది ఎంతో కీలకమైంది. ఒత్తిడిని తగ్గించే సంజీవని స్పర్శ సామాజిక స్పర్శకు చెందిన భావోద్వేగ ప్రభావం మన జీవశాస్త్రంలో అంతర్నిహితంగా ఎప్పట్నుంచో కొనసాగుతోంది. స్పర్శ అనేది ఒత్తిడిని తగ్గించే హార్మోన్ అయిన అక్సిటోసిన్ విడుదలను వేగవంతం చేస్తుంది. నిజానికి, మానవులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించే శక్తి ఒక్క స్పర్శకు మాత్రమే ఉంది. శస్త్రచికిత్సకు ముందు రోగిని నర్సు ఊరకే అలా స్పర్శిస్తే చాలు.. రోగుల్లో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని మనందరికీ తెలుసు. తాము సమాజం నుంచి వేరుపడ్డామనే అనుభూతిని స్పర్శ తగ్గిస్తుంది. అంతేకాకుండా నర్సింగ్ హోమ్‌లో గడుపుతున్న వృద్ధులు తీసుకునే ఆహార పరిమాణాన్ని కూడా స్పర్శ పెంచుతుంది. ప్రజల క్షేమానికి, సుఖసంతోషాలకు సామాజిక స్పర్శ ఎంత అవసరమైనదో తెలుస్తోంది కనుక, ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్పర్శకు అత్యంత ప్రధానమైన పాత్ర ఉందని అర్థం చేసుకోవాలి. సామాజిక స్పర్శ తగ్గుముఖం గత కొన్ని దశాబ్దాల్లో సామాజిక స్పర్శ అనేది తగ్గుముఖం పడుతోంది. వ్యక్తులతో ముఖాముఖిగా కాకుండా వర్చువల్‌గానే ఎక్కువగా సంభాషిస్తున్న టెక్నాలజీ ప్రాధాన్యం, సామాజిక అనుసంధానం తెగిపోవడం ప్రాతిపదికన నడుస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం కనుకే మానవ స్పర్శ మనిషి జీవితంలో తగ్గుముఖం పడుతోంది. అంటే గతంలోకంటే ఇప్పుడు మనం చాలా తక్కువగా మాత్రమే పరస్పరం స్పర్శించుకుంటున్నామని దీనర్థం. అయితే మనుషుల మధ్య స్పర్శ తగ్గుముఖం పట్టడానికి ప్రధానంగా అసభ్య స్పర్శ ప్రభావానికి గురికావలసి వస్తుందన్న భయమే కారణం. కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు కరోనా వైరస్ విస్తరణతో ఎదుటివారిని స్పర్శించాలంటేనే ప్రజలు భీతిల్లుతున్నారు. అలా తాకడం ద్వారా అప్పటికే వైరస్ సోకిన వ్యక్తులనుంచి తమకూ వైరస్ సోకుతుందన్న భయం ఎక్కువవుతోంది. అంటే ఎదుటివారందరూ వైరస్ వాహకాలే అని భావించడం మరింత భయపెడుతోంది. కరోనా వైరస్ తారస్థాయిలో చెలరేగుతున్నందున ఇతరులను స్పర్శించడం పట్ల జాగ్రత్తగా ఉంటూనే వైరస్ మితిమీరిపోకుండా తగిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు వైరస్ గురించి తీవ్రమైన ఆందోళనలతో గడుపుతున్నందువల్ల అలాంటివారిని స్పర్శద్వారా పరామర్శిస్తే ఆ ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మనుషులు తోటి మనుషులకు దూరంగా మెలగడం దీర్ఘకాలంపాటు కొనసాగితే సామాజిక స్పర్శకు, దానిపట్ల ప్రతికూల వైఖరికి మధ్య ఒకరకమైన సహసంబంధం నెలకొనే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతకాలానికి ప్రజలు వైరస్ గురించి మర్చిపోవచ్చు కానీ సామాజిక స్పర్శ పట్ల వారి భయం అలాగే కొనసాగవచ్చు. తామెం దుకు అలా దూరదూరంగా ఉంటున్నామో వారికి బహుశా తెలీకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రజల మధ్య సానుకూల సంబంధాల కంటే ప్రతికూల సంబంధాలే ఎక్కువగా మనుషుల జ్ఞాపకాలను ప్రభావితం చేయవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పర్శ అవసరం అయితే వైరస్ ప్రబలిపోయిన సమయంలో ప్రజలు పరస్పరం స్పర్శిం చుకోవడం మంచిది కాదు. ప్రత్యేకించి వృద్ధులు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వారితో స్పర్శకు దూరంగానే ఉండాలి. అయితే మన చేతులను మనం పదే పదే శుభ్రపర్చుకుంటున్నంతకాలం మనకు ప్రియమైన వారితో భౌతిక స్పర్శను కొనసాగిస్తూనే ఉండవచ్చు. కరోనా వైరస్ వంటి ప్రతికూల జీవన ఘటనలు దీర్ఘకాలంలో అవాంఛనీయమైన రీతిలో సామాజిక స్పర్శపై, వ్యక్తుల మధ్య పరామర్శలపై ప్రతి కూల ప్రభావం చూపవచ్చు. ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ ప్రతికూల ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండటమే. ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుషుల మధ్య స్పర్శ ప్రాధాన్యతను గుర్తించకపోయినట్లయితే అది మానవ స్పర్శపట్లే ప్రతికూల జ్ఞాపకాలను పెంచే ప్రమాదం ఎంతైనా ఉంది. ఒకసారి కరోనా వైరస్ పరిసమాప్తి అయ్యాక, మనకు ఎదురయ్యే పెనుసవాల్ మానవ స్పర్శ పట్ల మన ఆలోచనలను పునర్నిర్మించుకోవడం ఎలా అన్నదే. కరోనా వైరస్‌కి చెందిన భయానకమైన అనుభవం నుంచి వైదొలగడానికి కూడా మనకు ఒక స్పర్శ, ఒక వెచ్చని కౌగిలింత అవసరం కావచ్చేమో మరి. సాహిత్య చరిత్ర మనకు నేర్పే పాఠం ప్రాచీన కాలంలో హోమర్ నుంచి ఆధునిక కాలంలో స్టీఫెన్ కింగ్ దాకా పాశ్చాత్య సాహిత్య చరిత్రలో సాంక్రమిక వ్యాధుల గురించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. మానవులు ప్రజారోగ్యం సంక్షోభంలో పడినప్పుడు ఎలా స్పందించారో, కెథార్సిస్ రూపంలో తమ తీవ్రమైన భావోద్వేగాలను ఎలా ప్రకటించారో, రాజకీయంగా ఎలా వ్యాఖ్యానించారో ఈ కథనాలు చాటి చెబుతూ వచ్చాయి. కోవిడ్ 19 సాంక్రమిక వ్యాధి పట్ల మన స్పందనలను కూర్చడంలో సాహిత్యానికి కీలకపాత్ర ఉంది. కరోనా వైరస్ చుట్టూ అలుముకుంటున్న జాత్యహంకారం, జాతి ఉన్మాదం, వివక్షలను మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా సాహిత్యమే మనకు దారి చూపుతుంది. ప్రాచీన కావ్యాల నుంచి ఆధునిక నవలల వరకు సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనం అనిశ్చితపరిస్థితుల్లో తర్వాత ఏం జరుగుతుందో మార్గదర్శినిగా మనకు దారి చూపుతుంది. హోమర్ రాసిన ప్రామాణిక కావ్యం ఇలి యడ్.. ట్రాయ్ వద్ద విడిది చేసిన గ్రీక్ సైనిక శిబిరాల్లో చెలరేగిన ప్లేగ్ వ్యాధి గురించిన వర్ణనతో మొదలవుతుంది. క్రిసీస్ జాతీయులను బానిసలుగా చేసుకున్న గ్రీకులను శిక్షించడానికే ప్లేగ్ విరుచుకుపడిం దని ఆ కావ్యంలో పాత్రలు చెబుతాయి. గ్రీకుల దుష్ట ప్రవర్తన ఫలితంగానే ప్లేగ్ మహమ్మారి వారిపై విరుచుకుపడిందనే నైతిక చర్చను ఇలియడ్ లోని పాత్రలు ప్రదర్శించాయి. అలాగే క్రీ.శ. 1353లో గివోవన్నీ బొకాసియో రాసినది డెకమెరోన్, రచనలో కూడా బ్లాక్ డెత్ సంక్షోభ సమయంలో రెండువారాలపాటు ఏకాంతంగా గడిపిన పాత్రలు నీతి, ప్రేమ, లైంగిక రాజకీయాలు, వాణిజ్యం, అధికారం వంటి అంశాలపై చర్చించాయి. సాంక్రమిక వ్యాధుల కారణంగా స్తంభించిపోయిన సాధారణ జీవితాలను పునర్నిర్మించుకోవడంపై సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పలు రచనలు ఎత్తిచూపాయి. 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ కాము రాసిన ‘ది ప్లేగ్’ (1942) స్టీఫెన్ కింగ్ రాసిన ‘ది స్టాండ్’ (1978) సాంక్రమిక వ్యాధులు చెలరేగిన సమయంలో సమాజంలో వాటి ప్రభావాలపై దృష్టి పెట్టాయి. సామూహిక ఏకాంతవాసం, ప్రభుత్వాల వైఫల్యాల నేపథ్యంలో సాంక్రమిక వ్యాధిని నివారించడం లేక భయాందోళనలను తగ్గించడంపై ఈ రెండు రచనలూ చర్చించాయి. ప్రత్యేకించి కామూ నవల ప్లేగ్ చెలరేగిన సమయంలో మానవ సంబంధాలు, పౌరుల మధ్య పరామర్శల పట్ల జాగరూకత గురించి వర్ణించింది. కోవిడ్ 10 వైరస్ కూడా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలను ప్రకంపింప చేస్తూనే గతంలో ఇలాంటి సందర్బాల్లోనే తలెత్తిన సంక్షోభాలను ప్రాచీనులు ఎలా ఎదుర్కొన్నారు అనే చర్చకు దారి తీయడం విశేషం. వ్యాసకర్త: కేథరీన్ జాన్సన్, రీడర్, కన్సూమర్ సైకాలజీ, అంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (బ్రిటన్) -
నో షేక్‌హ్యాండ్.. ఓన్లీ మోచేతి స్పర్శ
-
కరోనా అలర్ట్: ఇక షేక్‌హ్యాండ్‌కు బైబై!
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్రమత్తతే సరైన విరుగుడు అని వైద్యులు, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్యే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కరచాలనం, ముద్దు పెట్టుకోవడం చేయొద్దంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది షేక్‌హ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు మోచేతులతో హలో చెప్పుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్ర గవర్నర్ పీట్ రికెట్స్ కూడా అదే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ వద్ద ఆయన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మోచేతులతో హలో చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి: వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్) ఇదిలాఉండగా.. నాలుగు రోజుల క్రితం జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఎదురైన వింత అనుభవం కూడా కరోనా నేపథ్యంలో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసింది. తన కార్యాలయానికి వచ్చిన ఛాన్సలర్ సహచర మంత్రి ఒకరితో చేయి కలపబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో మెర్కెల్ ‘మీది మంచి నిర్ణయం’అని చెప్పి మెచ్చుకున్నారు. ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (చదవండి: ప్రపంచం మొత్తం ‘నమస్తే’ పెడుతోంది : మోదీ) (చదవండి: కరోనా: జియో, బీఎస్ఎన్ఎల్ సందేశం విన్నారా?) -
ముద్దులకు దూరంగా ఉంటేనే మంచిది
న్యూయార్క్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో వివిధ దేశాల ప్రతినిధులు దాని బారీ నుంచి తప్పించుకోవడానికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. కేవలం రెండు నెలల్లోనే 2700 మందికి పైగా ప్రాణాలను తీసుకున్న కోవిడ్-19 దాదాపు 12 దేశాల్లో విస్తరించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. గతంలోనూ 1439 సంవత్సరంలో ఇంగ్లండ్ దేశంలో ప్లేగు వ్యాది సోకినప్పుడు అప్పటి మహారాజు కింగ్ హెన్రీ-6 ఇలాగే ముద్దు పెట్టుకోవడం బ్యాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇటలీ, చైనా, అమెరికా, పలు యూరప్ దేశాల్లో కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, హైఫైలు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం నిషేదించారు. ఇదే విషయమై రోమ్కు చెందిన 36 ఏళ్ల ఆర్తికవేత్త జార్జియా నిగ్రి మాట్లాడుతూ.. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఏడుగురు మృతి చెందడంతో అక్కడి ప్రజలు అప్రమత్తమయ్యారు. ఎవరికైనా సెండాఫ్ ఇవ్వాలన్న లేదా ఆహ్వానించాలన్న చేతులతో కాకుండా కేవలం గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం చేస్తున్నారని పేర్కొన్నాడు. మొదట ఇదంతా తనకు తప్పుగా కనిపించినా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఇదే సరైన మార్గం అని చెప్పుకొచ్చాడు. (హాలీవుడ్ మూవీపై కరోనా ఎఫెక్ట్) మరోవైపు యూరప్ దేశంలో కరోనా నేపథ్యంలో ప్రేమికుల రోజుకు అక్కడి ప్రజలు దూరంగా ఉన్నట్లు డెయిలీ మెయిల్, ది సన్ పత్రికలు ప్రచురించాయి. భారత్, సింగపూర్, రష్యా, ఇరాన్ వంటి దేశాల్లో కూడా కౌగిలింతలు, ముద్దులు, షేక్ హ్యాండ్లు చేసుకోవద్దంటూ ఫోన్ ద్వారా సూచిస్తున్నారు. ఇటీవలే చైనాలో బహిరంగ సభలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. కరోనాకు దూరంగా ఉండాలంటే మనుషుల మధ్య షేక్ హ్యాండ్లు ఇచ్చుకోకపోవడమే మంచిదని పేర్కొన్నారు. జపాన్‌లోనూ కరోనాను దూరంగా ఉంచాలంటే అక్కడి సంప్రదాయాలను పక్కన పెట్టడంతో పాటు శారీరక చర్యలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. కరోనా వైరస్ ప్రబలడానికి గల కారణాలు సరిగా తెలియదు. ఏదేతైనేం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక మీటరు దూరంలో ఉండి మాట్లాడితే మంచిదని తెలిపారు. (కరోనా నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారంటే) -
నేతలకు షేక్‌హ్యాండ్‌ఇవ్వకపోవడమే మంచిది...
సాక్షి, హైదరాబాద్: ఓవైపు వేసవి, ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే మరోవైపు రాజధానిలో స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్‌పై కలకలం రేగుతోంది. సాధారణంగా చలి వాతావరణంలో బలపడే ఈ వైరస్ భగ్గుమంటున్న ఎండల్లోనూ విజృంభిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందడమే కాకుండా మరింత బలపడుతోంది. అసలే ఎన్నికల సీజన్.. నగరంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు రోజంతా ప్రచారంలో బిజీగా తిరుతుంటారు. సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో ఎక్కువ సమయం జన సమూహంలోనే గడుపుతుంటారు. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్ వాతావరణంలోకి ప్రవేశించి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ విషయంలో సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జనబాహుళ్యంలోకి వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది కేవలం రెండు మాసాల్లోనే 573 కేసులు నమోదు కాగా, వారిలో 29 మంది మృతి చెందారు. ఒక్క నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 14 మంది మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వైరస్ బారినపడిన ఏడుగురికి చికిత్స అందిస్తుండగా వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో మరో నలుగురికి సైతం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఒకరికి సోకితే అందరినీ చుట్టేస్తుంది... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జనసమూహంలో ఎక్కువగా తిరుగుతుంటారు. నేతల్లో చాలా మంది బీపీ, షుగర్‌తో బాధపడుతుంటారు. వారిలో కొంత మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు ఉదయం నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్యే గడుపాల్సి వస్తుంది. బరిలో నిలిచిన అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యులంతా జనసమూహంలో ఎక్కువసేపు గడపాల్సి వస్తుంది. స్వైన్‌ఫ్లూ కారక వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్ సోకిందంటే చాలు అందరికీ చుట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో ఏ వైరస్ సోకిందో గుర్తించడం కూడా కష్టమే. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101–102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వేంటనే వైద్యులను సంప్రదించాలి. షేక్‌హ్యాండ్‌ఇవ్వకపోవడమే మంచిది... నేతలు షేక్‌హ్యాండ్ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం. దుమ్ము, ధూళి రూపంలో రకరకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సాధ్యమైనంత వరకు బయట తిరిగే సమయంలో ముక్కుకు మాస్క్ ధరించాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.– డాక్టర్ రాజన్న,చిన్న పిల్లల వైద్య నిపుణుడు ♦ ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 573 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు. ♦ నగరంలోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 14 మంది మృతి చెందారు. ♦ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఏడుగురికి, వైరస్ సోకిందని భావిస్తున్న మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. -
చారిత్రక కరచాలనం
ప్యాంగ్‌చాంగ్: బద్ధ శత్రువులైన ఉభయ కొరియా దేశాల మధ్య సామరస్యం, సౌభ్రాభృత్వం వెల్లివిరిశాయి. దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో శుక్రవారం వింటర్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా క్రీడాకారుల బృందాలు కలసి ఒకే జెండా కింద పరేడ్‌లో పాల్గొన్నాయి. అథ్లెట్ల పరేడ్ జరుగుతున్నప్పుడు, వీఐపీ గ్యాలరీలోకి అడుగుపెడుతున్నప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ .. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చెల్లి కిమ్ యో జోంగ్‌తో రెండుసార్లు కరచాలనం చేశారు. ఎన్ని విభేదాలున్నా శాంతి, సామరస్యంతో కలసిమెలసి జీవించేలా ఉభయ కొరియాలు స్ఫూర్తినిస్తున్నాయని ఒలంపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. -
డేటింగ్‌కు రారు.. షేక్ హ్యాండ్ ఇవ్వరు
ముంబయి: 'ఇది 2016.. కానీ ఇండియాలో అమ్మాయిలు ఇప్పటికీ సాధారణంగా చేతులు కలపరు(షేక్ హ్యాండ్స్). ఇక డేటింగ్ అనే విషయం ఇండియాలో అంత సామాన్య విషయం కాదు. ఇక్కడి అమ్మాయిలు చాలా సాంప్రదాయ బద్ధంగా ఉంటారు. సినిమాకొస్తావా అని అడిగితే రాలేమని చాలా గౌరవ ప్రదంగా చెప్తారు' ఈ విషయాలన్నీ కూడా తాజాగా అంతర్జాతీయ పర్యాటకులకు ఇచ్చే హ్యాండ్ బుక్‌లో పొందుపరిచారు. 1999 నుంచి ఈ పుస్తకం వెలువడుతోంది. విదేశాల నుంచి వచ్చి కొద్ది రోజులపాటు ఉండిపోయే పర్యాటకులకు గైడ్ లైన్స్‌గా ఈ పుస్తకాన్ని అందిస్తారు. ఆ పుస్తకాన్ని తిరిగి ముద్రించే క్రమంలో భాగంగా తొమ్మిదో ఎడిషన్‌లో పైన పేర్కొన్న అంశాలను పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ విదేశీ పర్యాటకుల కోసం తాజాగా ఈ అంశాలను పేర్కొంటూ ట్రావెలర్ గైడ్ గా రూపొందించింది. ఇక్కడి అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో అనే విషయాలు స్పష్టంగా ఇందులో తెలిపింది. -
మోదీ గ్రిప్
కరచాలనం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, యువరాణి కేట్ మిడిల్టన్ నిన్నమొన్నటి వరకు భారత్‌లో పర్యటించి వెళ్లారు. క్రికెట్ ఆడారు. విలువిద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఖాజీరంగ పార్కులో వన్యప్రాణులతో ప్రేమగా గడిపారు. తాజ్‌మహల్ ముందు కూర్చొని ఫొటోలు దిగారు. పనిలో పనిగా భూప్రకంపనలూ చవిచూశారు. అయితే వీటన్నిటికన్నా కూడా విలియమ్, కేట్ దంపతులు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఘట్టం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. మోదీ తనను కలిసేందుకు ఎవరు వచ్చినా వారికి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆలింగనం చేసుకోవడం తెలిసిందే. అదే తరహాలో ఆయన.. యువరాజు విలియమ్ చెయ్యి పట్టుకుని గట్టిగా షేక్‌హ్యాండ్ ఇచ్చారు. మోదీ ఎంత గట్టిగా నొక్కారో తెలియదు కానీ, ఈ షేక్ హ్యాండ్ దెబ్బకు విలియమ్ చెయ్యి దాదాపు కమిలిపోయింది. ఎర్రని ఆయన చెయ్యి మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చిన మేరకు రంగు మారిపోయింది. -
ముద్దు వద్దు... మోచేతి తాటింపే బెస్టు
చేతులు కలపొద్దు. కావిలించుకోవద్దు. చెంప పై ముద్దు పెట్టవద్దు. పెక్ కూడా వద్దు. అంతగా కావాలంటే పిడికిళ్లు పరస్పరం ఆనించుకొండి. కుదిరితే కేవలం మోచేతులను ఒకరికొకరు తాకించుకొండి అంటున్నారు వైద్యులు. బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మిగతా రకాల అభివాదాల వల్ల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. కేవలం మోచేతులు కలుపుకోవడాన్ని ఫిస్ట్ బంప్ అంటారు. షేక్ హ్యాండ్స్ కంటే ఫిస్ట్ బంప్ చేసుకుంటే పది శాతం తక్కువ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయట. హాయిగా షర్టులు వేసుకుని కేవలం మోచేతులు తాటించుకుంటే మినిమమ్ రిస్క్ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే స్పృశించుకునే ప్రదేశం తక్కువ. స్పృశించుకునే సమయం మరీ తక్కువ. ఈ అధ్యయనం అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసింది. ఈ కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తే జీర్ణకోశసంబంధిత ఇన్ ఫెక్షన్ వస్తుందని వారంటున్నారు. వారి అధ్యయనం ప్రకారం మోచేతి తాటింపు బెస్టు. పిడికిలి స్పర్శ పరవాలేదు. హ్యాండ్ షేక్ వద్దు. ఆలింగనం అసలు వద్దు. ముద్దు పెట్టుకుంటే ముప్పు. ఇంత అధ్యయనం చేసిన వారు భారతీయుల నమస్కారాన్ని లెక్కలోకి తీసుకోలేదు. నమస్కారం మరీ మంచిది ఎందుకంటే ఒకరి చేయి మరొకరికి తాకే ప్రసక్తే లేదు మరి.