వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్రమత్తతే సరైన విరుగుడు అని వైద్యులు, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్యే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కరచాలనం, ముద్దు పెట్టుకోవడం చేయొద్దంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది షేక్‌హ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు మోచేతులతో హలో చెప్పుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్ర గవర్నర్ పీట్ రికెట్స్ కూడా షేక్‌హ్యాండ్‌కు బదులు మోచేతులతో హలో చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ వద్ద ఆయన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మోచేతులతో హలో చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది.