Nebraska
-
కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్షన్‌కు పాల్పడి కటకటాల పాలయ్యింది. తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది. మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్‌లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్‌ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్షియస్ తెగ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రకరకాల ఆహార అలవాట్లు ఆచరిస్తున్నారు. ఐతే భిన్న ఆహార అలవాట్లు భిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. పచ్చి మాంసాన్ని రోజు వారీ ఆహారంగా తినడం అటువంటి ప్రత్యేక ఆహార అలవాట్లలో ఒకటి. అవును.. మీరు సరిగ్గానే చదివారు! ఓ వ్యక్తి గత మూడేళ్లగా పచ్చిమాంసం తింటూ ఎటువంటి అనారోగ్యం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుతున్నాడు. అతనెవరో.. అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం.. అమెరికాలోని నెబ్రస్కాకు చెందిన వెస్టన్ రో అనే వ్యక్తి మూడుళ్లుగా వండకుండా లేదా వేడిచేయకుండా మాంసం, చికెన్, గుడ్లు.. వంటి మాంస ఉత్పత్తులను పచ్చిగానే తింటున్నాడట. ఔరా! అని ముక్కు మీద వేలేసుకుంటున్నారా? అంతేకాదు.. తన విచిత్ర ఆహార అలవాట్లపై 'ది నేచురల్ హ్యూమన్ డైట్' పేరుతో యూట్యూబ్ ఛానెల్లో డాక్యుమెంట్ కూడా చేశాడట. సాల్మన్ అనే చేప, చికెన్ ఆర్గన్స్, పచ్చి మాంసం.. మొదటైన వాటిని పచ్చిగా తినడం మనం అతని వీడియోల్లో చూడొచ్చు. పచ్చి మాంసం తినే అలవాటు మీకు కొంత విడ్డూరంగా అనిపించినా... వెస్టన్ రో మాత్రం ఈ ఆహారంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటున్నట్లు చెబుతున్నాడండీ!! రో తన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా స్థిమితంగానే ఉందనీ, ఈ పచ్చి మాంసం ఆహారంగా తినడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యం బారీన పడ్డదాకలాలు లేవని, ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ.. తన ఆరోగ్యంపై పచ్చి మాంసం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ది ఇండిపెండెంట్ అనే ఆన్లైన్ న్యూస్ పేపర్‌కు వివరించాడు. కల్టివేట్ (వ్యవసాయం) చేసిన మాంసం, చికెన్, గుడ్లు.. క్రమంతప్పకుండా తింటున్నానని, ఉడికించిన ఆహారంతో పోలిస్తే మరింత శక్తినిస్తుందని డైలీ మెయిల్ అనే బ్రిటీష్ డైలీ మిడిల్ మార్కెట్ న్యూస్‌పేపర్‌కు వెల్లడించాడు. ముడి చికెన్ తరచుగా తింటే ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్ బారీన పడే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా సోకుతుంది. ఎప్పుడైనా ఈ వ్యాధితో బాధపడ్డావా అని అడిగినప్పుడు, ఇది చాలా వివాదాప్సదమైన అంశం. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని, ఎటువంటి హాని కలగదని న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పడు. ఇతని పచ్చి మాంసం ఆహార అలవాట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే అతని యూట్యూబ్ చానెల్లో తెలుసుకోవచ్చు. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. -
ప్లీజ్.. బోన్‌లెస్ చికెన్ పేరును మార్చండి
నెబ్రాస్కా : చికెన్ అంటే ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారు చెప్పండి. చికెన్‌కు యూనివర్సల్ ఫ్యాన్స్ ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. పైగా కరోనా టైంలో ఎంత చికెన్ తింటే అంత రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇక చికెన్‌లో వందల రకాల వంటకాలు ఉన్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ హోటల్స్, రెస్టారెంట్లలో చికెన్ పేరుతో తయారు చేసే చికెన్ కబాబ్స్, చికెన్ 65, బోన్‌లెస్ చికెన్, చికెన్ కర్రీ అంటూ వందల రకాల మెనూ ఐటమ్స్ మన కళ్ల ముందు మెదులుతాయి. వీటికి రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం తప్ప అసలు వాటికి ఆ పేరెలా వచ్చిందన్నది ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. చికెన్ పేరు చెబితే చాలు.. మాకు ఇంకేం అవసరం లేదంటూ లొట్టలేసుకుని తినే ఈ రోజుల్లో నెబ్రాస్కాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం బోన్‌లెస్ చికెన్ పేరును మార్చాలంటూ ఏకంగా ఆ దేశానికి చెందిన లింకన్ సిటీ కౌన్సిల్లో తీర్మానం చేయడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే.. నెబ్రాస్కాకు చెందిన అండర్ క్రిస్టిన్సన్ అనే వ్యక్తి బోన్‌లెస్ చికెన్ వింగ్స్‌ను చికెన్ టెండర్స్‌గా పేరు మార్చాలంటూ లింకన్ సిటీ కౌన్సిల్లో తీర్మానం చేశాడు. క్రిస్టిన్సన్ చేసిన తీర్మానం అక్కడున్నవారికి నవ్వు తెప్పించింది. కానీ అండర్ ఆ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందనేది అతను చెప్పిన మాటల ద్వారా అర్థమైంది. 'బోన్‌లెస్ చికెన్ అనే పదానికి అర్థం తెలుసుకోకుండానే ఆ పేరును వాడుతున్నారు. సాధారణంగా బోన్‌లెస్ చికెన్ అనే పదం కోడి రెక్కలను విరిచి చెస్తారే తప్ప మాంసం నుంచి ఎముకలను వేరు చేయరు. ఎందుకంటే మనం తినే మాంసంలో అధికబలం ఎముకల్లోనే ఉంటుంది. ఆ విషయం తెలుసుకోకుండా రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు బోన్‌లెస్ చికెన్ అనే పేరును వాడుతున్నారు. నేను వెళ్లిన ప్రతీ రెస్టారెంట్లలో ఇదే గమనించాను. అంతెందుకు నా పిల్లలు కూడా బోన్‌లెస్ చికెన్ అర్థం తెలియకుండానే ఆర్డర్ చేయడం గమనించాను. అందుకే ఈరోజు సిటీ కౌన్సిల్ వేదికగా ఒక తీర్మానం చేయాలనుకున్నాను.. అదే బోన్‌లెస్ చికెన్ వింగ్ అనే పేరును హోటల్స్ మెనూ నుంచి తొలగించాలి. బోన్‌లెస్ అనే పదానికి బదులుగా చికెన్ టెండర్, సాసీ నగ్స్, వెట్ టెండర్స్ లాంటి పేర్లను పెడితే బాగుంటుంది. 'అంటూ చెప్పుకొచ్చాడు. Don’t want to get too political here ... but he has a point. #SaucyNugs #KeepLNKWeird pic.twitter.com/uFgpyTRAAV — Ethan Rowley (@e10rowley) September 2, 2020 క్రిస్టిన్సన్ చేసిన ప్రతిపాధన నవ్వు తెప్పించే విధంగా ఉన్నా అంతర్లీనంగా మాత్రం అతని బాధ మనకు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొందరు అండర్ ప్రతిపాధనను సమర్థిస్తూ కామెంట్ చేయగా... ఏ పేరు అయితే ఏంటి.. మన కడుపులోకే వెళుతుందిగా అంటూ చురకలంటించారు. -
కరోనా కలిపింది ఇద్దరినీ..
నెబ్రాస్కా: కరోనా వైరస్ మనుషుల్ని విడదీస్తూ మానవ సంబంధాలను దెబ్బతీస్తూ ఉంటే ఆ తోబుట్టువులను మాత్రం ఏకం చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారిద్దరూ కరోనా వైరస్ తమ పాలిట దైవం అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఒక న్యూస్ ఛానెల్‌తో వారు పంచుకున్న అనుభూతులు ప్రకారం.. అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన డోరిస్ క్రిపెన్(73) కరోనా సోకడంతో ఫ్రీమెంట్ నగరంలోని ఒక ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు వైద్యం చేసింది ఎవరో కాదు. ఆమె తోడబుట్టిన చెల్లెలు బేవ్ బోరో. 1967లో తండ్రి మరణానంతరం తల్లి లేకపోవడంతో అక్కా చెల్లెళ్లు ఇద్దరూ చెరో చోట పెరిగారు. బోరోకి ఆరు నెలలు ఉన్నప్పుడు ఇద్దరూ విడిపోయారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలా ఆస్పత్రిలో కలుసుకున్నారు. బోరో ఆస్పత్రికి వచ్చిన రోగుల జాబితా చూస్తూ ఉంటే క్రిపెన్ పేరు కనిపించింది. తన అక్క పేరు కూడా అదే కదా ఆమే అయి ఉంటే ఎంత బాగుండు అనుకుంటూ క్రిపెన్ చికిత్స పొందుతున్న వార్డుకి వచ్చింది. ఆమెకి వినికిడి సమస్య ఉండడంతో ఒక బోర్డు మీద మీ తండ్రి పేరు వెండాల్ హఫ్‌మ్యాన్? అని రాసింది. దానికి క్రిపెన్ అవునని తలూపడంతో బోరో భావోద్వేగాలను పట్టలేకపోయింది. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ నేను నీ చెల్లెలు బోరోని అంటూ మళ్లీ రాసింది. అది చదివిని క్రిపెన్‌కి కుర్చీలోంచి కింద పడ్డంత పనైంది. ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ తోబుట్టువులు సంతోషంలో మునిగిపోయారు. కరోనా కలిపింది ఇద్దరినీ అంటూ హాయిగా పాడుకుంటున్నారు. -
'నాకు కరోనా వచ్చి మేలు చేసింది'
నెబ్రాస్కా : 'నా జీవితంలోకి కరోనా వైరస్ వచ్చి మంచిపని చేసిందని' నెబ్రాస్కాకు చెందిన 73 ఏళ్ల డోరిక్ క్రిప్పన్ అంటున్నారు.. అదేంటి ఒకపక్క వైరస్‌తో జనజీవనం అస్తవ్యస్తమవుతుంటే ఈమె ఇలా అంటుందేంటి అనుకుంటున్నారా.. కానీ ఆమె చెప్పింది అక్షరాలా నిజం.. ఎందుకంటే 53 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా, చెల్లిని కలిపింది కరోనానే. డోరిక్ క్రిప్పన్కు కరోనా రావడంతోనే ఎప్పుడో విడిపోయిన తన చెల్లిని కలుసుకుంది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అది 1967వ సంవత్సరం.. డోరిక్ క్రిప్పన్, బెవ్ బోరో ఇద్దరు తోబుట్టువులు.. అప్పటికే డోరిక్ వయస్సు 20 ఏళ్లు కాగా.. బెవ్ బోరో వయస్సు.. ఆరు నెలలు మాత్రమే.. డోరిక్ తన చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకునేది. కాని తల్లిదండ్రుల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోయారు. బెవ్ బోరో తన తండ్రి వద్ద పెరిగింది. అయితే బోరో తన అక్క పేరు మాత్రం గుర్తుపెట్టుకుంది. అప్పటినుంచి ఈ 53 ఏళ్లో వారిద్దరు ఒక్కసారి కూడా కలసుకోలేకపోయారు.(పోగాకు ఆకులతో కరోనా టీకా) కట్‌చేస్తే.. 73 ఏళ్ల డోరిక్ క్రిప్పన్.. ప్రస్తుతం నెబ్రాస్కాలో నివనివసిస్తుంది. 53 ఏళ్ల బెవ్ బోరో ఫ్రీమౌంట్లోని మెథోడిస్ట్ ఆసుపత్రిలో మెడికో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుంది. కొన్నిరోజుల క్రితం.. డోరిక్కు కరోనా సోకడంతో బెవ్ బోరో పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చేరి చికిత్స తీసుకుంటుంది. అయితే ఒకరోజు పేషేంట్లకు మందులు ఇవ్వడానికి బెవ్ బోరో రోగుల పేర్లు ఉన్న లిస్ట్ బోర్డ్ చచూసింది. అందులో డోరిక్ క్రిప్పన్ అనే పేరు కూడా ఉంది. ఆ పేరు చూసి బహుశా తన అక్క అయ్యుంటదన్న ఆలోచనలో అదే లిస్ట్ బోర్డును తీసుకోని డోరిక్ వద్దకు వెళ్లింది. ఆ బోర్డుపై బెవో తన తండ్రి వెండాల్ హఫ్‌మన్ పేరును రాసింది. ఇతని పేరు మీకు తెలుసా అంటూ డోరిక్ను అడిగింది.. అది చూసిన డోరిక్ ' తెలుసు ఆయన మా నాన్న.. నువ్వు నా చెల్లి బెవ్ బోరో కదా' అంటూ కన్నీటిపర్యంతమైంది. అప్పటివరకు వీల్‌చైర్‌లో ఉన్న డోరిక్ బెవ్ను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో కిందపడింది. కానీ సంతోషంలో ఉన్న డోరిక్ అది పట్టించుకోకుండా బెవ్ దగ్గరికి వెళ్లి..' దేవుడు మనిద్దరిని 53 ఏళ్లు విడదీశాడు.. ఇన్ని సంవత్సారాల్లో నిన్ను ఎన్నోసార్లు వెతకడానికి ప్రయత్నించా.. కానీ కరోనా మనల్ని కలుపుతుందని అస్సలు ఊహించలేదు' అంటూ డోరిక్ బావోద్వేగానికి గురయింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషం నెలకొంది. -
నో షేక్‌హ్యాండ్.. ఓన్లీ మోచేతి స్పర్శ
-
కరోనా అలర్ట్: ఇక షేక్‌హ్యాండ్‌కు బైబై!
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అప్రమత్తతే సరైన విరుగుడు అని వైద్యులు, పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్యే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కరచాలనం, ముద్దు పెట్టుకోవడం చేయొద్దంటున్నారు. ఈనేపథ్యంలో చాలామంది షేక్‌హ్యాండ్‌కు ప్రత్యామ్నాయంగా ఒకరికొకరు మోచేతులతో హలో చెప్పుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్ర గవర్నర్ పీట్ రికెట్స్ కూడా అదే చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ వద్ద ఆయన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు మోచేతులతో హలో చెప్పారు. ఈ వీడియో వైరల్ అయింది. (చదవండి: వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్) ఇదిలాఉండగా.. నాలుగు రోజుల క్రితం జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఎదురైన వింత అనుభవం కూడా కరోనా నేపథ్యంలో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేసింది. తన కార్యాలయానికి వచ్చిన ఛాన్సలర్ సహచర మంత్రి ఒకరితో చేయి కలపబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో మెర్కెల్ ‘మీది మంచి నిర్ణయం’అని చెప్పి మెచ్చుకున్నారు. ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా గురువారం నాటికి 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లోనూ కరోనా భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. (చదవండి: ప్రపంచం మొత్తం ‘నమస్తే’ పెడుతోంది : మోదీ) (చదవండి: కరోనా: జియో, బీఎస్ఎన్ఎల్ సందేశం విన్నారా?) -
1 నేనొక్కదాన్నే..
ఇది మహేష్‌బాబు సినిమా కథ కాదు.. అమెరికాలోని మోనోవై అనే ఊరు కథ.. మరీ ముఖ్యంగా ఆ ఊర్లో ఉండే ఎల్సీ ఐలర్ అనే బామ్మ కథ.. అంత స్పెషల్ ఏంటట.. నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనోవై.. ఈ ఊరికి మేయర్ ఉన్నారు.. క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ ఇలా అందరూ ఉన్నారు.. కానీ ఊర్లో ఉన్నది మాత్రం ఒక్కరే.. అవును.. 2010 అమెరికా జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరి జనాభా 1. ఆ ఒక్కరు ఎల్సీ ఐలర్.. వయసు 84. ఇక మేయర్, క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ గురించి అంటారా.. అవన్నీ కూడా ఎల్సీ ఐలరే!! ఎందుకలా? 1930ల్లో ఇక్కడ 150 మంది దాకా ఉండేవారు. రెస్టారెంట్లు, షాపులు చివరికి ఓ జైలు కూడా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో జనం వలస బాటన పడ్డారు. ఎల్సీ ఆమె భర్త రూడీ మాత్రం ఇక్కడే ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరి పిల్లలు కూడా ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2004లో రూడీ చనిపోయారు. అయినా.. ఎల్సీ ఊరిని విడిచిపోలేదు.. ఊరి మీద ఆమెకున్న మమకారం అలాంటిది. అంతేకాదు.. ఈ ఊరికి ఇన్కార్పొరేటెడ్ టౌన్ స్టేటస్ కోసం ఆమె పన్నులు కడతారు. దీనికి కావాల్సిన మున్సిపల్ రోడ్ ప్లాన్‌ను ఏటా సమర్పిస్తారు. ఇన్కార్పొరేటెడ్ టౌన్ అంటే ఇక్కడ ప్రభుత్వపరంగా నియమించే అధికారులు ఉంటారు. మేయర్ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. ఎన్నికల్లో ఓటేసేదెవరు? ఇంకెవరు ఎల్సీనే.. ఊర్లో ఎవరూ లేరు.. దీంతో ఏటా మేయర్ ఎన్నికల్లో నిల్చొని.. తనకు తానే ఓటు వేసుకుంటారు. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏటా బార్, టొబాకో షాపు లైసెన్సు కోసం ఓ బార్ యజమానిగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటారు.. ఓసారి దీన్ని పరిశీలించండి అంటూ ఆ అప్లికేషన్ ఊరి సెక్రటరీ దగ్గరకు వస్తుంది.. సెక్రటరీ దరఖాస్తును పరిశీలించి.. అంతా ఓకే అని క్లర్క్ వద్దకు పంపిస్తారు.. క్లర్క్ కూడా ఓకే చేసేసి.. అనుమతి మంజూరు చేస్తూ బార్ యజమానికి ఉత్తర్వుల కాపీ ఇస్తారు.. ఇక్కడ సెక్రటరీ, క్లర్క్, బార్ యజమాని ముగ్గురూ ఎల్సీనే.. అంటే.. తనే దరఖాస్తు పెట్టి.. తనే ఓకే చేసి.. తనే తీసుకుంటారన్నమాట! మరి.. ఒక్కరే బోర్ కొట్టదా.. కొట్టదు.. ఎందుకంటే.. ఆమె నడుపుతున్న బార్, లైబ్రరీలకు పర్యాటకుల తాకిడి ఉంటుంది. గతంలో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన వాళ్లు తమ రెండో, మూడో తరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. ఎల్సీని చూపిస్తుం టారు. అమెరికాలో ఒక్కరే ఉంటున్న ఇన్కార్పొరేటెడ్ టౌన్‌గా పేరు రావడంతో దీన్ని చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. పలు చానళ్లు డాక్యుమెంటరీలు కూడా ఇక్కడ తీశాయి. ఎల్సీ మనవలు అక్కడికి 90 మైళ్ల దూరంలోని పోన్కా పట్టణంలో ఉంటారు. వాళ్లు అక్కడికి సమీపంలోనే ఉన్నా.. ఊరిని విడిచి వెళ్లడానికి ఆమె ఇష్టపడటం లేదు. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ప్రాణం పోయినా ఇక్కడే పోవాలి.. అంతే తప్ప.. ఈ మట్టిని..ఊరిని మాత్రం విడిచిపోను.. – ఎల్సీ ఐలర్ ..: సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఊరు చిన్నది.. కథ పెద్దది!
అది అమెరికాలోని నెబ్రస్కాలోని మనోవీ పట్టణం. జనాభా.. ఒక్కరు. అవును 2010 జనాభా లెక్కల ప్రకారం ఒకే ఒక్కరు అక్కడ నివసిస్తారు.అందుకే అమెరికాలోనే అతి చిన్న.. ఒకే ఒక్క వ్యక్తి నివసించే ఊరుగా ఖ్యాతికెక్కింది. 84 ఏళ్ల ఎల్సీ ఈలర్ అనే మహిళ ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ పట్టణానికి మేయర్.. క్లర్క్.. కోశాధికారి.. లైబ్రేరియన్.. ఒక్కటేమిటి అన్నీ ఆమే.. ఏటా ఆ ఊరి ముందు ‘మేయర్ కోసం ఎన్నికలు నిర్వహించబోతున్నాం.. ఎవరైనా పోటీ చేయండి’ అని ఓ బోర్డు తగిలిస్తారు.. ఎన్నికలు నిర్వహిస్తారు.. ఓటుకూడా ఆమే వేస్తారు.. ఆమే గెలుస్తారు.. ఆ ఊరికి ప్రభుత్వం కూడా ఏ లోటు లేకుండా నిధులు సమకూరుస్తుంది. మంచి రోడ్డు.. తాగునీరు.. విద్యుత్ ఒక్కటేమిటి ఓ గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అయితే 1930లలో ఈ ఊరు దాదాపు 150 మందితో ఉండేదట. రైల్వేస్టేషన్‌తో పాటు షాప్‌లు, రెస్టారెంట్లు, పోలీస్‌స్టేషన్ ఇలా చాలా భవనాలు ఉండేవట. అయితే వారంతా ఉపాధి కోసం కన్సాస్ నగరానికి ఒక్కొక్కరుగా అందరూ వలస వెళ్లారట. -
యూఎస్ లో టోర్నాడో విధ్వంసం!