
అది అమెరికాలోని నెబ్రస్కాలోని మనోవీ పట్టణం. జనాభా.. ఒక్కరు. అవును 2010 జనాభా లెక్కల ప్రకారం ఒకే ఒక్కరు అక్కడ నివసిస్తారు.అందుకే అమెరికాలోనే అతి చిన్న.. ఒకే ఒక్క వ్యక్తి నివసించే ఊరుగా ఖ్యాతికెక్కింది. 84 ఏళ్ల ఎల్సీ ఈలర్ అనే మహిళ ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ పట్టణానికి మేయర్.. క్లర్క్.. కోశాధికారి.. లైబ్రేరియన్.. ఒక్కటేమిటి అన్నీ ఆమే.. ఏటా ఆ ఊరి ముందు ‘మేయర్ కోసం ఎన్నికలు నిర్వహించబోతున్నాం.. ఎవరైనా పోటీ చేయండి’ అని ఓ బోర్డు తగిలిస్తారు.. ఎన్నికలు నిర్వహిస్తారు.. ఓటుకూడా ఆమే వేస్తారు.. ఆమే గెలుస్తారు.. ఆ ఊరికి ప్రభుత్వం కూడా ఏ లోటు లేకుండా నిధులు సమకూరుస్తుంది.
మంచి రోడ్డు.. తాగునీరు.. విద్యుత్ ఒక్కటేమిటి ఓ గ్రామానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అయితే 1930లలో ఈ ఊరు దాదాపు 150 మందితో ఉండేదట. రైల్వేస్టేషన్‌తో పాటు షాప్‌లు, రెస్టారెంట్లు, పోలీస్‌స్టేషన్ ఇలా చాలా భవనాలు ఉండేవట. అయితే వారంతా ఉపాధి కోసం కన్సాస్ నగరానికి ఒక్కొక్కరుగా అందరూ వలస వెళ్లారట.
Comments
Please login to add a commentAdd a comment