ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్షియస్ తెగ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రకరకాల ఆహార అలవాట్లు ఆచరిస్తున్నారు. ఐతే భిన్న ఆహార అలవాట్లు భిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. పచ్చి మాంసాన్ని రోజు వారీ ఆహారంగా తినడం అటువంటి ప్రత్యేక ఆహార అలవాట్లలో ఒకటి. అవును.. మీరు సరిగ్గానే చదివారు! ఓ వ్యక్తి గత మూడేళ్లగా పచ్చిమాంసం తింటూ ఎటువంటి అనారోగ్యం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుతున్నాడు. అతనెవరో.. అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం..
అమెరికాలోని నెబ్రస్కాకు చెందిన వెస్టన్ రో అనే వ్యక్తి మూడుళ్లుగా వండకుండా లేదా వేడిచేయకుండా మాంసం, చికెన్, గుడ్లు.. వంటి మాంస ఉత్పత్తులను పచ్చిగానే తింటున్నాడట. ఔరా! అని ముక్కు మీద వేలేసుకుంటున్నారా? అంతేకాదు.. తన విచిత్ర ఆహార అలవాట్లపై 'ది నేచురల్ హ్యూమన్ డైట్' పేరుతో యూట్యూబ్ ఛానెల్‌లో డాక్యుమెంట్ కూడా చేశాడట. సాల్మన్ అనే చేప, చికెన్ ఆర్గన్స్, పచ్చి మాంసం.. మొదటైన వాటిని పచ్చిగా తినడం మనం అతని వీడియోల్లో చూడొచ్చు. పచ్చి మాంసం తినే అలవాటు మీకు కొంత విడ్డూరంగా అనిపించినా... వెస్టన్ రో మాత్రం ఈ ఆహారంతో రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటున్నట్లు చెబుతున్నాడండీ!!
రో తన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా స్థిమితంగానే ఉందనీ, ఈ పచ్చి మాంసం ఆహారంగా తినడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యం బారీన పడ్డదాకలాలు లేవని, ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ.. తన ఆరోగ్యంపై పచ్చి మాంసం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ది ఇండిపెండెంట్ అనే ఆన్‌లైన్ న్యూస్ పేపర్‌కు వివరించాడు. కల్టివేట్ (వ్యవసాయం) చేసిన మాంసం, చికెన్, గుడ్లు.. క్రమంతప్పకుండా తింటున్నానని, ఉడికించిన ఆహారంతో పోలిస్తే మరింత శక్తినిస్తుందని డైలీ మెయిల్ అనే బ్రిటీష్ డైలీ మిడిల్ మార్కెట్ న్యూస్‌పేపర్‌కు వెల్లడించాడు.
ముడి చికెన్ తరచుగా తింటే ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్ బారీన పడే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా సోకుతుంది. ఎప్పుడైనా ఈ వ్యాధితో బాధపడ్డావా అని అడిగినప్పుడు, ఇది చాలా వివాదాప్సదమైన అంశం. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని, ఎటువంటి హాని కలగదని న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పడు. ఇతని పచ్చి మాంసం ఆహార అలవాట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే అతని యూట్యూబ్ చానెల్‌లో తెలుసుకోవచ్చు.
చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..
Comments
Please login to add a commentAdd a comment