సాక్షి, సిరిసిల్ల : మనం ఆదమరిస్తే అప్రమత్తం చేసేలా ఓ సెన్సర్ స్మార్ట్ వాచ్‌ను రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని. కరోనా వైరస్ కట్టడి కోసం కరచాలనం చేయొద్దని, చేతితో కళ్లను, నోటిని, ముక్కును ముట్టుకోవద్దని వైద్యులు చెపుతున్న విషయం తెలిసిందే. అయితే అలవాటులో పొరపాటులా చెయ్యి ముఖాన్ని తాకుతూనే ఉంటుంది. ఇలాంటి అలవాటును దూరం చేసే లక్ష్యంతో సెన్సర్ స్మార్ట్ వాచ్‌ను తయారు చేసింది బుధవారపు స్నేహ.
స్మార్ట్ సెన్సర్ వాచ్‌ను చూపుతున్న స్నేహ
బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న స్నేహ.. ఓ వాచ్‌ను రూపొందించి, దానికి సెన్సర్ డివైస్‌ను ఏర్పాటు చేసింది. మనం కరచాలనం చేయబోయినా.. ముక్కు, నోరు, కళ్లను తాకబోయినా వెంటనే ఆ సెన్సర్ గుర్తించి శబ్దం చేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా స్మార్ట్ వాచ్ హెచ్చరిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్‌ను తయారు చేసినట్లు స్నేహ తెలిపింది. స్నేహ కృషిని జిల్లా అధికారులు సోమవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment