
ప్యాంగ్‌చాంగ్: బద్ధ శత్రువులైన ఉభయ కొరియా దేశాల మధ్య సామరస్యం, సౌభ్రాభృత్వం వెల్లివిరిశాయి. దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్‌లో శుక్రవారం వింటర్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా క్రీడాకారుల బృందాలు కలసి ఒకే జెండా కింద పరేడ్‌లో పాల్గొన్నాయి.
అథ్లెట్ల పరేడ్ జరుగుతున్నప్పుడు, వీఐపీ గ్యాలరీలోకి అడుగుపెడుతున్నప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ .. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చెల్లి కిమ్ యో జోంగ్‌తో రెండుసార్లు కరచాలనం చేశారు. ఎన్ని విభేదాలున్నా శాంతి, సామరస్యంతో కలసిమెలసి జీవించేలా ఉభయ కొరియాలు స్ఫూర్తినిస్తున్నాయని ఒలంపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment