
కిమ్ జోంగ్ ఉన్, మూన్ జయే ఇన్
సియోల్: కొరియా యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టు 20–26 మధ్య కలుసుకోడానికి అనుమతిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన భేటీలోనే ఉత్తర, దక్షిణ కొరియాల అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్, మూన్ జయే ఇన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపికైనవారు తమ బంధువులతో గడిపేందుకు 3 రోజులు సమయమివ్వనున్నారు. విడిపోయిన తమ బంధువులను కలుసుకోడానికి దక్షిణ కొరియాలో 57 వేల మంది రెడ్ క్రాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. 1950–53 మధ్య జరిగిన యుద్ధం వల్ల కొరియా విభజన జరిగి లక్షల్లో ప్రజలు వేరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment