
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన అత్యంత సీనియర్ అధికారుల బృందం ఉత్తర కొరియాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను సోమవారం కలిసింది. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా అధికారులు ఉత్తర కొరియాకు రావడం ఇదే తొలిసారి.
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తరఫున ప్రతినిధులుగా వచ్చిన ఈ బృంద సభ్యులు, అమెరికాతో చర్చలకు కిమ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి హాజరవడం తెలిసిందే. ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా మూన్‌ను ఆమె కిమ్ తరఫున అప్పట్లో ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment