ముద్దు వద్దు... మోచేతి తాటింపే బెస్టు
ముద్దు వద్దు... మోచేతి తాటింపే బెస్టు
Published Wed, Jul 30 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM
చేతులు కలపొద్దు. కావిలించుకోవద్దు. చెంప పై ముద్దు పెట్టవద్దు. పెక్ కూడా వద్దు. అంతగా కావాలంటే పిడికిళ్లు పరస్పరం ఆనించుకొండి. కుదిరితే కేవలం మోచేతులను ఒకరికొకరు తాకించుకొండి అంటున్నారు వైద్యులు.
బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మిగతా రకాల అభివాదాల వల్ల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. కేవలం మోచేతులు కలుపుకోవడాన్ని ఫిస్ట్ బంప్ అంటారు. షేక్ హ్యాండ్స్ కంటే ఫిస్ట్ బంప్ చేసుకుంటే పది శాతం తక్కువ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయట. హాయిగా షర్టులు వేసుకుని కేవలం మోచేతులు తాటించుకుంటే మినిమమ్ రిస్క్ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే స్పృశించుకునే ప్రదేశం తక్కువ. స్పృశించుకునే సమయం మరీ తక్కువ.
ఈ అధ్యయనం అబెరిస్ట్విత్ యూనివర్సిటీ చేసింది. ఈ కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తే జీర్ణకోశసంబంధిత ఇన్ ఫెక్షన్ వస్తుందని వారంటున్నారు. వారి అధ్యయనం ప్రకారం మోచేతి తాటింపు బెస్టు. పిడికిలి స్పర్శ పరవాలేదు. హ్యాండ్ షేక్ వద్దు. ఆలింగనం అసలు వద్దు. ముద్దు పెట్టుకుంటే ముప్పు.
ఇంత అధ్యయనం చేసిన వారు భారతీయుల నమస్కారాన్ని లెక్కలోకి తీసుకోలేదు. నమస్కారం మరీ మంచిది ఎందుకంటే ఒకరి చేయి మరొకరికి తాకే ప్రసక్తే లేదు మరి.
Advertisement