స్కూలుకెళ్లనున్న యువరాజు | Prince George is getting ready to go to nursery school in January | Sakshi
Sakshi News home page

స్కూలుకెళ్లనున్న యువరాజు

Published Sat, Dec 19 2015 9:05 AM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM

స్కూలుకెళ్లనున్న యువరాజు - Sakshi

స్కూలుకెళ్లనున్న యువరాజు

లండన్: బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన బుల్లి యువరాజు పాఠశాల చదువుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కనిపిస్తోంది. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ దంపతుల తొలి సంతానమైన ప్రిన్స్ జార్జ్. ప్రస్తుతం జార్జ్ వయసు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు. అయితే, తమ కుమారున్ని స్కూలుకు పంపించాలని రాజదంపతులు నిర్ణయించుకున్నారు. జార్జ్ నర్సరీ విద్యను మొదలెట్టనున్నట్లు కెన్సింగ్టన్ రాజప్రసాదానికి చెందిన ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో యువరాజు విద్యాభ్యాసం ప్రారంభం అవుతుందని చెప్పారు.

లండన్ తూర్పువైపుగా 110 మైళ్ల దూరంలో ఉన్న నార్ఫోల్క్ లోని వెస్టాక్రె మాంటెస్సోరి స్కూళ్లో యువరాజుని చేర్చనున్నట్లు సమాచారం. ఆ పాఠశాల కూడా బుల్లి యువరాజుకు స్వాగతం పలుకుతోంది. తమ పాఠశాలలోని ఇతర విద్యార్థుల మాదిరిగానే యువరాజు కూడా ఇక్కడ సంతోషంగా, హాయిగా ఉంటాడని ఆశిస్తున్నామని యజమాన్యం పేర్కొంది.

యువరాజు జార్జ్ వెళ్లనున్న మాంటిస్సోరి పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement