England Football Team
-
‘సెంచరీ’ మ్యాచ్‌లో హ్యారీ కేన్ ‘డబుల్’
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిశాడు. యూరోపియన్ నేషన్స్ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్లాండ్తో జరిగిన పోరులో హ్యారీ కేన్ (57వ, 76వ నిమిషాల్లో) విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు 2–0తో గెలిచింది. మ్యాచ్‌కు ముందు కేన్‌కు బంగారు ట్రోఫీ బహుకరించగా... ఈ కార్యక్రమంలో హ్యారీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఇంగ్లండ్ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పదో ప్లేయర్‌గా నిలిచిన కేన్... ఫిన్లాండ్తో పోరులో బంగారు బూట్లతో బరిలోకి దిగాడు. ద్వితీయార్ధంలో తన మార్క్ స్టయిల్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ తొలి గోల్ చేసిన కేన్... కాసేపటికే యువ ఆటగాడు నోనీ మాడ్యూకే ఇచ్చిన పాస్‌ను చాకచక్యంగా గోల్ పోస్ట్‌లోకి నెట్టి ఇంగ్లండ్‌కు తిరుగులేని ఆధిపత్యం అందించాడు. దీంతో మైదానం మొత్తం హోరెత్తిపోగా... మైలురాయి మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో మెరిసిన కేన్‌కు అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఇంగ్లండ్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఇంగ్లండ్ కెప్టెన్‌కు అరుదైన బహుమతి
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ అరుదైన జాబితాలో చేరనున్నాడు. నేషన్స్ లీగ్‌లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫిన్లాండ్తో ఇంగ్లండ్ తలపడనుండగా... ఇది హ్యారీ కేన్‌కు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. దీంతో మ్యాచ్ ఆరంభానికి ముందు కేన్‌కు బంగారు టోపీని బహూకరించనున్నారు.ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు తొమ్మిది మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు హ్యారీ కేన్ ఆ ఘనత సాధించిన పదో ప్లేయర్ కానున్నాడు. చివరిసారిగా ఇంగ్లండ్ తరఫున వేన్ రూనీ 2014లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా... పదేళ్ల తర్వాత కేన్ ఆ క్లబ్లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటి వరకు 72 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన 31 ఏళ్ల కేన్.. జాతీయ జట్టు తరపున 66 గోల్స్ కొట్టాడు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా గోల్డెన్ బూట్లు ధరించిన కేన్... ఇంగ్లండ్ తరఫున అత్యధిక మేజర్ ఫైనల్స్ (28) ఆడిన ప్లేయర్‌గానూ నిలిచాడు. -
ఇంగ్లండ్ కోచ్ పదవికి సౌత్‌గేట్ రాజీనామా
గత ఎనిమిదేళ్లుగా ఇంగ్లండ్ పుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉన్న గ్యారెత్ సౌత్‌గేట్ తన పదవికి రాజీనామా చేశారు. బెర్లిన్‌లో జరిగిన యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. 2016 నుంచి సౌత్‌గేట్ శిక్షణలో ఇంగ్లండ్ రాటుదేలింది. 2018 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతోపాటు 2021, 2024 యూరో టోర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచింది. ‘మార్పు కోసం సమయం ఆసన్నమైంది. కొత్త అధ్యాయానికి తెర లేవనుంది’ అని సౌత్‌గేట్ వ్యాఖ్యానించారు. -
Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఫిఫా వరల్డ్‌కప్‌లో ఏడుసార్లు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు లభించిన ఒక్క గోల్ ఆ జట్టు కెప్టెన్.. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ నుంచి వచ్చిందే. అలా తొలి పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి హీరో అయిన కేన్ చివర్లో జీరో అయ్యాడు. రెండో అర్థభాగంలో చివర్లో వచ్చిన రెండు పెనాల్టీ కిక్‌లను ఆటగాళ్లు గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం కావడం ఇంగ్లండ్ కొంపముంచింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇక ఆ తర్వాత అదనపు సమయం చివర్లో వచ్చిన మరో పెనాల్టీని ఈసారి రష్‌ఫోర్డ్ గోల్‌పోస్టు పైకి షాట్ కొట్టాడు. అంతే ఇంగ్లండ్ బాధలో మునిగిపోతే.. ఫ్రాన్స్ మాత్రం విజయ సంబరాల్లో మునిగిపోయింది. వాస్తవానికి మ్యాచ్‌లో ఫ్రాన్స్ కంటే ఇంగ్లండ్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి హాఫ్, రెండో హాఫ్ కలిపి ఇంగ్లండ్ ఆటగాళ్లు 503 సార్లు పాస్‌లు ఇచ్చుకుంటే.. ఫ్రాన్స్ మాత్రం 377 సార్లు మాత్రమే పాస్‌లు ఇచ్చుకుంది. బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంది కూడా ఇంగ్లండ్ జట్టే. మరి ఇన్ని చేసి కూడా 1966 విజేత అయిన ఇంగ్లండ్ మరోసారి తమ పోరును క్వార్టర్స్‌తోనే ముగించడం బాధాకరం. Oh Harry, what have you done? 🫣 How costly was this miss for @England in #ENGFRA?#Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/uI5IlBN5vg — JioCinema (@JioCinema) December 10, 2022 FIFA WC: ఎదురులేని ఫ్రాన్స్.. వరుసగా రెండోసారి సెమీస్‌కు -
సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్.. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్ ఓటమి
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తమ జోరును కొనసాగిస్తుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లో ఫ్రాన్స్ అడుగు పెట్టింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించిన యూరప్ జట్టు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ.. ఓటమి నుంచి మాత్రం గట్టుక్కలేకపోయింది. మ్యాచ్ తొలి ఆర్ధబాగంలో ఫ్రాన్స్ ఆటగాడు అరెలియన్ చౌమెనీ అద్భుతమైన కిక్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయాయి. ఇక సెకెండ్ హాఫ్‌లో బ్రిటన్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1 సమంగా నిలిచాయి. ఈ క్రమంలో ఇరు జట్ల శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇటువంటి సమయంలో 78 నిమిషాల వద్ద ఫ్రాన్స్ ఆటగాడు ఒలివర్ గిరౌడ్ సంచలన గోల్‌తో తమ జట్టును 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో 2-1 తేడాతో ఓటమిపాలైన ఇంగ్లీష్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఫ్రాన్స్ సెమీస్‌లో ఆఫ్రికా జట్టు మొరాకోతో తలపడనుంది. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే -
ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. క్వార్టర్స్‌కు చేరిన కేన్ సేన
ఫిఫా ప్రపంచకప్-2022 క్వార్టర్ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 లో భాగంగా ఆదివారం అర్ధ రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3-0 తేడాతో సెనెగల్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్ తొలి భాగం నుంచే సెనెగల్ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్.. ఏ దశలోనూ సెనెగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ తరపున జోర్డాన్ హెండర్సన్, హ్యారీ కెన్, బుకాయో సాకా గోల్స్ సాధించారు. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ 38వ నిమిషంలో హెండర్సన్ ఇంగ్లండ్‌కు తొలి గోల్‌ను అందించారు. కాగా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ జట్టు మొత్తం 12 గోల్స్‌ను సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్లో డిసెంబర్ 11న డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. సెనెగల్ ఇంటిముఖం పట్టడంతో ఇప్పడు ఈ మెగా ఈవెంట్ పోటీలో నిలిచిన ఒకే ఒక ఆఫ్రికా జట్టు మొరాకో. రౌండ్ 16 లో మొరాకో మంగళవారం స్పెయిన్‌తో తలపడనుంది. చదవండి: Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు... -
ఎదురులేని ఇంగ్లండ్
రోమ్: యూరో కప్ టోర్నీలో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్ (4వ, 50 ని.లో) చేయగా... మగురె (46వ ని.లో), హెండర్సన్ (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం లండన్‌లో జరిగే సెమీఫైనల్లో డెన్మార్క్‌తో ఇంగ్లండ్ ఆడుతుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరో కప్ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ చివరిసారి ఈ టోర్నీలో 1996లో సెమీఫైనల్ చేరింది. 1966 ప్రపంచకప్ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4–2తో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఓ పెద్ద టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం. -
సౌత్‌గేట్ రైల్వే స్టేషన్
లండన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు 1990 తర్వాత మరోసారి సెమీస్ చేరి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దాంతో ఈ టోర్నీలో జట్టు కోచ్ గారెత్ సౌత్గేట్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును అతను నడిపించిన తీరు, సానుకూల దృక్పథం, సౌత్‌గేట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టాయి. ఇప్పుడు లండన్‌లోని ఒక రైల్వే స్టేషన్ కూడా అతనిపై అదే తరహా అభిమానాన్ని ప్రదర్శించింది. ఉత్తర లండన్‌లోని ఎన్ఫీల్డ్లో ఉన్న అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌కు తాత్కాలికంగా (48 గంటల పాటు) గారెత్ సౌత్‌గేట్ స్టేషన్ అని పేరు పెట్టింది. దానికి అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌లు, టికెట్ కౌంటర్లు, స్టేషన్ బయట హోర్డింగ్‌లు అన్నింటిని మార్చేసింది. పారిస్‌లో కూడా...: ఇక వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో ఆటగాళ్లను పారిస్ ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్‌ఏటీపీ) కూడా ఇదే తరహాలో గౌరవించుకుంది. ఆరు రైల్వే స్టేషన్లకు పేర్లు మార్చింది. అయితే ఎన్ని రోజులో ఆర్‌ఏటీపీ స్పష్టం చేయలేదు. కెప్టెన్ హ్యూగో లోరిస్, కోచ్ డెచాంప్స్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
యూరో కప్‌కు ఇంగ్లండ్ అర్హత
పారిస్ : వచ్చే ఏడాది జరిగే యూరో కప్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు తొలి బెర్త్ దక్కించుకుంది. యూరో క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఇ’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-0తో సాన్ మారినోను చిత్తు చేసింది. స్టార్ ఫుట్‌బాలర్ వేన్ రూనీ 13వ నిమిషంలో చేసిన గోల్‌తో తమ దేశం తరఫున అత్యధిక గోల్స్ (49) చేసిన ఆటగాడిగా బాబీ చార్ల్టన్ సరసన నిలిచాడు.