
రోమ్: యూరో కప్ టోర్నీలో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు 25 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌తో జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్ (4వ, 50 ని.లో) చేయగా... మగురె (46వ ని.లో), హెండర్సన్ (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం లండన్‌లో జరిగే సెమీఫైనల్లో డెన్మార్క్‌తో ఇంగ్లండ్ ఆడుతుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరో కప్ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ చివరిసారి ఈ టోర్నీలో 1996లో సెమీఫైనల్ చేరింది. 1966 ప్రపంచకప్ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4–2తో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఓ పెద్ద టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment