
అమ్‌స్టర్‌డామ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్న మెంట్‌లో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–2తో ఉక్రెయిన్‌ను ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జార్జినో వినాల్డమ్ (52వ ని.లో), వెగోర్ట్స్ (59వ ని.లో), డమ్‌ఫ్రీస్ (85 వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఉక్రెయిన్ తరఫున కెప్టెన్ ఆండ్రీ యామలెంకో (75వ ని.లో)... మలినోవ్‌స్కీ (79వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
గ్రూప్ ‘డి’లో జరిగిన మరో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ 2–0తో స్కాట్లాండ్‌పై గెలిచింది. చెక్ ప్లేయర్ పాట్రిక్ షీక్ ఈ రెండు గోల్స్ (42వ, 52వ ని.లో) సాధించాడు. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో స్లోవేకియా 2–1 గోల్స్ తేడాతో పోలాండ్‌పై గెలిచింది. పోలాండ్ గోల్ కీపర్ స్జెజెన్సీ (18వ ని.లో) సెల్ఫ్ గోల్‌తో స్లోవేకియాకు తొలి గోల్‌ను అందించగా... రెండో గోల్‌ను స్క్రినియార్ (69వ ని.లో) చేశాడు. పోలాండ్ తరుఫున నమోదైన ఏకైక గోల్‌ను లినెట్టీ (46వ ని.లో) సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment