Group C
-
FIFA World Cup 2022: అర్జెంటీనా జోరు కనబర్చేనా!
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం! అర్జెంటీనా ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు. ఫిఫా ర్యాంక్: 3 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986). ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు. అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా. కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో. మెక్సికో ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫిఫా ర్యాంక్: 13. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986). ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999). అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో. కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా. పోలాండ్ అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్స్కీ, మాటీ కాష్లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు. ఫిఫా ర్యాంక్: 26. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982). ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016). అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్. కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్స్కీ. సౌదీ అరేబియా గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఫిఫా ర్యాంక్: 51. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994). ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996). అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్. కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్. –సాక్షి క్రీడా విభాగం -
నాకౌట్ దశకు భారత్ అర్హత
బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు అర్హత పొందింది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్‌తోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్‌ను 52 నిమిషాల్లో ఓడించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్ ఆంథోనీ–కెవిన్ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–15, 21–12తో సంకీర్త్‌ను ఓడించి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో గారగ కృష్ణప్రసాద్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–15, 21–11తో డాంగ్ ఆడమ్–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 21–13, 20–22, 21–14తో విక్టర్ లాయ్‌పై గెలవడంతో భారత్ 5–0తో కెనడాను క్లీన్‌స్వీప్ చేసింది. ఉబెర్ కప్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
ఒకే గ్రూప్‌లో తలపడనున్న కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ జట్లు
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్ సంగ్రామం రంజీ ట్రోఫి 2022 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభంకానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా కారణంగా గతేడాది నిర్వహించలేకపోయిన ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు ఆరు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో ఎలైట్ గ్రూపులు(ఏ, బి, సి, డి, ఈ- ఒక్కో గ్రూప్‌లో 6 జట్లు) ఐదు కాగా, ప్లేట్ డివిజన్ గ్రూప్ ఒకటి(8 కొత్త జట్లు) ఉంది. మొత్తంగా కొత్త, పాత జట్లతో 2022 రంజీ ట్రోఫి రసవత్తరంగా మారనుంది. ఇక గ్రూప్‌ల్లోని జట్ల వివరాలకు వస్తే.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ, ముంబై, కర్ణాటక జట్లు ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ జట్లు ఎలైట్ గ్రూప్-సిలో ఉన్నాయి. ఈ గ్రూప్‌ను గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణిస్తున్నారు. ఢిల్లీ జట్టుకు కోహ్లి, ధవన్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ వంటి టీమిండియా స్టార్లు ప్రాతినిధ్యం వహించనుండగా.. ముంబై జట్టుకు పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు ఆడనున్నారు. ఇక కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ వంటి న్యూ జనరేషన్ ఆటగాళ్లతో కర్ణాటక జట్టు పటిష్టంగా ఉంది. ఇక మిగతా గ్రూప్‌ల విషయానికి వస్తే.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సర్వీసెస్, అస్సాం జట్లు ఎలైట్ గ్రూప్-ఏలో.. గతేడాది రన్నరప్ బెంగాల్, విదర్భ, హర్యానా, కేరళ, త్రిపుర, రాజస్థాన్ జట్లు గ్రూప్-బిలో.. డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్ర, తమిళనాడు, రైల్వేస్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, గోవా జట్లు గ్రూప్-డిలో.. ఆంధ్ర, ఉత్తర్‌ప్రదేశ్, బరోడా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, పాండిచ్చేరి జట్లు గ్రూప్-ఈలో తలపడనున్నాయి. ప్లేట్ డివిజన్లో చంఢీఘడ్, మేఘాలయ, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ జట్లు పోటీపడనున్నాయి. ఇక ఈసారి రంజీ గ్రూప్ మ్యాచ్‌లు ఆరు నగరాల్లో నిర్వహించనున్నారు. ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లు(ముంబై), గ్రూప్-బి(బెంగళూరు), గ్రూప్-సి( బెంగళూరు), గ్రూప్-డి(అహ్మదాబాద్), గ్రూప్-ఈ(త్రివేండ్రం), ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నాయి. చదవండి: ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు.. బట్లర్ సహా మరో బౌలర్ ఔట్ -
UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ
అమ్‌స్టర్‌డామ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్న మెంట్లో మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–2తో ఉక్రెయిన్ను ఓడించింది. నెదర్లాండ్స్ తరఫున జార్జినో వినాల్డమ్ (52వ ని.లో), వెగోర్ట్స్ (59వ ని.లో), డమ్ఫ్రీస్ (85 వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఉక్రెయిన్ తరఫున కెప్టెన్ ఆండ్రీ యామలెంకో (75వ ని.లో)... మలినోవ్స్కీ (79వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. గ్రూప్ ‘డి’లో జరిగిన మరో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ 2–0తో స్కాట్లాండ్పై గెలిచింది. చెక్ ప్లేయర్ పాట్రిక్ షీక్ ఈ రెండు గోల్స్ (42వ, 52వ ని.లో) సాధించాడు. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో స్లోవేకియా 2–1 గోల్స్ తేడాతో పోలాండ్‌పై గెలిచింది. పోలాండ్ గోల్ కీపర్ స్జెజెన్సీ (18వ ని.లో) సెల్ఫ్ గోల్‌తో స్లోవేకియాకు తొలి గోల్‌ను అందించగా... రెండో గోల్‌ను స్క్రినియార్ (69వ ని.లో) చేశాడు. పోలాండ్ తరుఫున నమోదైన ఏకైక గోల్‌ను లినెట్టీ (46వ ని.లో) సాధించాడు. -
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు. ఇవీ ప్రయోజనాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. పరీక్ష ఫీజుతో పాటు, అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు సహాయకులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ అవస్థలు కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) ద్వారా తగ్గనున్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యాంశాలు.. ► ఎన్ఆర్ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ (మొదటి–స్థాయి / టైర్ 1) పరీక్షను నిర్వహిస్తుంది, ఇది అనేక ఇతర ఎంపికలకు మెట్టుగా మారుతుంది. ► కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. ► ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సీఈటీ స్కోరు చెల్లుతుంది. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసం పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు. ఉన్న స్కోర్లలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ► గరిçష్ట వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడి ఉంటుంది. ► ప్రిలిమినరీ టెస్ట్‌లో వచ్చే స్కోరు అధారంగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైన సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష నిర్వహిస్తాయి. ► కంప్యూటర్ ఆధారిత సీఈటీని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరు కేటగిరీలుగా ఈ పరీక్ష ఉంటుంది. ► పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ► మల్టిపుల్ చాయిస్ ఆబెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ► అభ్యర్థులు ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని సెంటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు, మార్కులు, మెరిట్ లిస్టు... అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ► విభిన్న భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► సీఈటీ స్కోరు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏజెన్సీలు కూడా ఈ సీఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకుంటాయని కేంద్రం ఆశిస్తోంది. ► సెట్ ఆధారంగా జరిగి ప్రాథమిక వడపోతతో అనేక నియామక ప్రక్రియలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ప్రయోజనకరం: ప్రధాని జాతీయ నియామక సంస్థ ఏర్పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బహుళ పరీక్షలను తొలగించి, విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. దీని మూలంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
హైదరాబాద్ తడబాటు
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) కట్టడి చేశారు. దీంతో గురువారం 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసింది. తన్మయ్ (12), అక్షత్ రెడ్డి (10), కెప్టెన్ బద్రీనాథ్ (5), సందీప్ (2) విఫలమయ్యారు. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె.సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ ఇంకా 109 పరుగులు వెనుకబడి ఉండగా... చేతిలో ఐదు వికెట్లున్నారుు. ఉదయం పొగమంచు కారణంగా తొలి సెషన్ జరగలేదు. రెండో రోజు కేవలం 38 ఓవర్ల ఆటే సాధ్యపడింది. -
హైదరాబాద్ x ఆంధ్ర
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో నాకౌట్ పోరు రసకందాయంలో పడింది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అవుతాయి. ఇప్పుడు ఈ స్థానాలను నిర్ణయించే కీలక మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు హైదరాబాద్, ఆంధ్ర తలపడబోతున్నాయి. లక్నోలో జరిగే ఈ మ్యాచ్ లీగ్ దశలో ఇరు జట్లకూ ఆఖరిది. బద్రీనాథ్ సారథ్యం లోని హైదరాబాద్ ప్రస్తుతం 30 పాయింట్లతో నాకౌట్‌కు బాగా చేరువలో ఉంది. చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడిస్తే హనుమ విహారి నాయకత్వంలో ఆడుతోన్న ఆంధ్ర (ప్రస్తుతం 25 పాయింట్లు) జట్టుకూ ఆ అవకాశం ఉంటుంది. అయితే వీరికి పోటీగా 25 పాయింట్లతో ఉన్న హరియాణా, తమ చివరి మ్యాచ్‌లో త్రిపురలాంటి బలహీన జట్టుతో ఆడుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. హైదరాబాద్‌ను ఆంధ్ర ఓడించి, మరోవైపు హరియాణా గెలవకుండా ఉంటే... హైదరాబాద్, ఆంధ్ర కలిసి ముందుకు దూసుకెళతాయి. పాయింట్లు చెరి సగం... మరోవైపు న్యూఢిల్లీలో కాలుష్యం కారణంగా వారుుదా పడిన రెండు లీగ్ మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ వెనకడుగు వేసింది. ఇలా చేస్తే లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడటం వల్ల వారికి అనుచిత లబ్ది చేకూరుతుందని ముంబై, తమిళనాడు జట్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో ఆ రెండు మ్యాచ్‌లను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. బెంగాల్, గుజరాత్ మధ్య... హైదరాబాద్, త్రిపుర మధ్య జరగాల్సిన నాటి మ్యాచ్‌ల నిర్వహణ తీవ్ర కాలుష్యంతో సాధ్యపడలేదు.