హైదరాబాద్ తడబాటు | Hyderabad flurry in ranji trophy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ తడబాటు

Published Thu, Dec 8 2016 11:42 PM | Last Updated on Fri, Sep 7 2018 3:01 PM

Hyderabad flurry in ranji trophy

లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) కట్టడి చేశారు. దీంతో గురువారం 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌‌సలో 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసింది.  తన్మయ్ (12), అక్షత్ రెడ్డి (10), కెప్టెన్ బద్రీనాథ్ (5), సందీప్ (2) విఫలమయ్యారు. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె.సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ ఇంకా 109 పరుగులు వెనుకబడి ఉండగా... చేతిలో ఐదు వికెట్లున్నారుు. ఉదయం పొగమంచు కారణంగా తొలి సెషన్ జరగలేదు. రెండో రోజు కేవలం 38 ఓవర్ల ఆటే సాధ్యపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement