Hyderabad Sports
-
రన్ ఫర్ హెల్త్..
-
ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది
అక్కినేని అఖిల్ వ్యాఖ్య హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ యువ హీరో సాక్షి, హైదరాబాద్: క్రికెట్‌కు ఉన్న అమితాదరణ కారణంగా మన వద్ద ఫుట్‌బాల్‌కు తగిన గుర్తింపు దక్కలేదని, అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోందని టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ అభిప్రాయపడ్డాడు. పెద్ద సంఖ్యలో టోర్నీలు రావడంతో పాటు కార్పొరేట్లు కూడా ముందుకు వస్తుండటంతో ఫుట్‌బాల్‌కు మంచి ప్రాచుర్యం లభిస్తోందని అతను అన్నాడు. నవంబర్ 25 నుంచి నిర్వహించనున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్‌కు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘నాకు వ్యక్తిగతంగా క్రికెట్ ఇష్టమే అయినా ఇతర క్రీడలకు కూడా అండగా నిలిచేందుకు నేను ఎప్పుడైనా సిద్ధం. అదే కారణంగా ఇప్పుడు ఫుట్‌బాల్‌తో జత కట్టాను. క్రికెట్‌తో పోలిస్తే తక్కువ సమయంలో పూర్తి కావడం, సిక్స్–ఎ–సైడ్లాంటి ఫార్మాట్ వల్ల తక్కువ మందితోనే ఆడే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడు ఫుట్‌బాల్ వేగంగా జనాల్లోకి వెళుతోంది. ఇది మంచి పరిణామం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు యూ త్‌కు ఫుట్‌బాల్ క్రీడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని అఖిల్ అభిప్రాయపడ్డాడు. వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ విజయవంతం కావాలని అతను ఆకాంక్షించాడు. నగరంలోని 14 మైదానాల్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్ నవంబర్ 25 నుంచి జనవరి 27 వరకు జరుగుతుంది. 12 జట్లు బరిలోకి దిగుతున్న ఈ సిక్స్–ఎ–సైడ్ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతకు రూ.3 లక్షల ప్రైజ్‌మనీని అందజేస్తా రు. గత రెండు సీజన్లు తమ లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే ఉత్సాహంతో ఈసారి మరింత బాగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని లీగ్ చైర్మన్ మురాద్ జసాని అన్నారు. మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఆదిల్ మిస్త్రీ, నవీద్ కేశ్వాని తదితరులు పాల్గొన్నారు. -
ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ నట్టి శివ కుమార్ (50) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్చరీ సంఘానికి సేవలందించిన ఆయన మృతి పట్ల తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయనతో పాటు హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి పి.అరవింద్ కుమార్ టోలిచౌకి సాలార్జంగ్ కాలనీలోని శివకుమార్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శివకుమార్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అక్షత్ రెడ్డి సెంచరీ
►ఆంధ్రపై హెచ్‌సీఏ ఎలెవన్ విజయం ►రవితేజ శతకం వృథా ►మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఈసీఐఎల్ మైదానంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హెచ్‌సీఏ ఎలెవన్ 80 పరుగుల తేడాతో ఆంధ్ర కోల్ట్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌సీఏ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (109 బంతుల్లో 113; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్ అగర్వాల్ (115 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, వేణు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. డీబీ రవితేజ (165 బంతుల్లో 113 నాటౌట్; 11 ఫోర్లు) శతకం సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సీవీ మిలింద్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తలా 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విదర్భ: 242/4 (కె. సచిన్ 75, అపూర్వ్ వాంఖెడే 63 నాటౌట్, జితేశ్ శర్మ 50); గోవా: 190/7 (స్వప్నిల్ అస్నోడ్కర్ 59, ఆదిత్య 3/42). ఫలితం: వర్షం కారణంగా గోవా విజయ లక్ష్యాన్ని సవరించి 48 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. 44 పరుగులతో విదర్భ విజయం బరోడా: 289/9 (కార్తీక్ కాక్డే 51, ఖయ్యూమ్ 3/54, జి.మధు 3/59); కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్: 207/7 (సుకాంత్ 91, కరణ్ పవార్ 3/32). ఫలితం: 82 పరుగులతో బరోడా విజయం హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్: 231 (జావీద్ అలీ 53, రోహిత్ రెడ్డి 42, చందన్ సహాని 42, రాబిన్ కృష్ణ 3/34); కేరళ: 232/6 (ఫాబిద్ ఫరూఖ్ అహ్మద్ 89 నాటౌట్, రోహన్ కున్నుమ్మెల్ 74, ప్రణీత్ రెడ్డి 2/26, తనయ్ త్యాగరాజన్ 2/35). ఫలితం: 4 వికెట్లతో కేరళ విజయం రైనా బరిలోకి... భారత ఆటగాడు సురేశ్ రైనా నేడు జరిగే మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈసీఐఎల్ మైదానంలో ఎయిరిండియా, కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. -
బ్రెజిల్‌కు హైదరాబాద్ ఫుట్‌బాల్ జట్టు
సాక్షి, హైదరాబాద్: నేమార్ జూనియర్ గ్లోబల్ ‘ఫైవ్–ఎ–సైడ్’ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ ఫుట్‌బాల్ జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీలో జాతీయ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గుర్గావ్లోని సైబర్ హబ్‌లో జరిగిన నేషనల్ ఫైనల్స్ టోర్నీ టైటిల్ పోరులో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీ జట్టు ముంబైకి చెందిన కళింగ రేంజర్స్ జట్టును ఓడించింది. దీంతో భారత్ నుంచి వరల్డ్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించింది. బ్రెజిల్లో జూలై 7, 8 తేదీల్లో వరల్డ్ ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. మొత్తం వరల్డ్ ఫైనల్స్ టైటిల్ కోసం ఆరు ఖండాలకు చెందిన 53 జాతీయ చాంపియన్ జట్లు తలపడతాయి. -
హైదరాబాద్ తడబాటు
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఆంధ్ర పేసర్లు విజయ్ కుమార్ (2/18), శివ కుమార్ (2/30) కట్టడి చేశారు. దీంతో గురువారం 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసింది. తన్మయ్ (12), అక్షత్ రెడ్డి (10), కెప్టెన్ బద్రీనాథ్ (5), సందీప్ (2) విఫలమయ్యారు. ఆట నిలిచే సమయానికి అనిరుధ్ (26 బ్యాటింగ్), కె.సుమంత్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ ఇంకా 109 పరుగులు వెనుకబడి ఉండగా... చేతిలో ఐదు వికెట్లున్నారుు. ఉదయం పొగమంచు కారణంగా తొలి సెషన్ జరగలేదు. రెండో రోజు కేవలం 38 ఓవర్ల ఆటే సాధ్యపడింది. -
హైదరాబాద్ 10k రన్
-
హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆదివారం 'హైదరాబాద్ 10కే రన్' జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని వాహన చోదకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని సహకరించాలని కోరారు. - రాజ్‌భవన్, ఆనంద్‌నగర్, పంజగుట్ట వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను వీవీ స్టాట్యూ(ఖైరతాబాద్ చౌరస్తా) నుంచి నిరంకారి వైపు పంపిస్తారు. - మింట్ కాంపౌండ్, ఐ-మాక్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు పంపిస్తారు. - ఇక్బాల్ మీనార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలను తెలుగు తల్లి చౌరస్తా, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెక్రటేరియేట్ పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ చౌరస్తా, బైబిల్ హౌస్ మీదుగా మళ్ళిస్తారు. - హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించకుండా తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఇక్బాల్ మీనార్ వైపు పంపిస్తారు. - లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని జీహెచ్ఎంసీ ఆఫీస్, ఐటీ లైన్, హిమాయత్‌నగర్‌ల వైపు పంపిస్తారు. - డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చిల్డ్రన్స్ పార్క్, అప్పర్‌ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. వీటిని కట్ట మైసమ్మ దేవాలయం, కవాడీగూడ మీదుగా మళ్ళిస్తారు. - రసూల్‌పుర నుంచి నల్లగుట్ట రైల్ అండర్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. -
ప్రతిభను ప్రోత్సహించాలి: గోపీచంద్
రాయదుర్గం: నగరంలో ప్రతిభావంతులకు కొదవలేదని, వారికి సరైన పద్ధతిలో శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గురువారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని షెరటాన్ హోటల్లో జరిగిన ‘హైదరాబాద్ గాట్ ట్యాలెంట్’ ఈవెంట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని దాన్ని వెలికితీసి తగిన శిక్షణ ప్రోత్సాహం అందిస్తే వారు రాణిస్తారని అన్నారు. మన హైదరాబాద్‌లో విభిన్న రంగాలపై ఆసక్తి కలిగిన వారున్నారని... వీరందరిని ప్రోత్సహించేందుకు ఈ ఈవెంట్ చక్కని వేదికని ఆయన చెప్పారు. న్యూక్ రేడియో ప్రతినిధి పరంజిత్‌సింగ్ మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు నిజాం కాలేజి గ్రౌండ్సలో ‘హైదరాబాద్ గాట్ ట్యాలెంట్’ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. -
వాలీబాల్ విజేత హోలీ మేరీ జట్టు
ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: గోల్కొండ జోన్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ వాలీబాల్ ఈవెంట్లో హోలీమేరీ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ గోల్కొండ జోన్ ఆధ్వర్యంలో విజయ్‌నగర్ కాలనీలోని స్పోర్టింగ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన ఫైనల్లో హోలీ మేరీ జట్టు 21-17, 21-19తో స్ప్రింగ్ ఫీల్డ్ జట్టుపై విజయం సాధించింది. సఫ్దారియా గర్లస్ హైస్కూల్ 21-17, 21-10తో ఎస్వీబీపీ స్కూల్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు కబడ్డీ అండర్-14 బాలబాలికల విభాగంలో జీహెచ్ఎస్ కల్సుంపురా, కృష్ణవేణి హైస్కూల్ జట్లు విజేతలుగా నిలవగా... అండర్-17 బాల బాలికల విభాగంలో జీహెచ్ఎస్ (దేవల్సింగ్), జీహెచ్ఎస్ (లంగర్‌హౌస్) జట్లు టైటిల్‌ను దక్కించుకున్నాయి. కబడ్డీ మ్యాచ్‌ల ఫైనల్స్ ఫలితాలు అండర్-14 బాలికలు: జీహెచ్ఎస్ (కల్సుంపురా) 15-12తో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌పై గెలుపొందింది. బాలురు: కృష్ణవేణి హైస్కూల్ 15-11తో జీహెచ్ఎస్ (కల్సుంపురా)పై నెగ్గింది. అండర్-17 బాలికలు: జీహెచ్ఎస్ (లంగర్‌హౌస్) 15-13తో సెయింట్ ట్ జోసెఫ్ (విజయ్ నగర్ కాలనీ)పై విజయం సాధించింది. -
నేడు, రేపు హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) ప్రొఫెసర్ జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ చింతల్‌బస్తీలోని రామ్‌లీలా గ్రౌండ్సలో జరుగుతుంది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. -
నేడు, రేపు క్రికెట్ సెలె క్షన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్కూల్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే క్రికెట్ జట్ల సెలెక్షన్స్ నేడు, రేపు జరగనున్నాయి. కులీ కుతుబ్‌షా స్టేడియంలో అండర్-16 బాలబాలికల విభాగాల్లో ఈ ఎంపికల పోటీలు జరుగుతాయి. కేవలం హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ సెలె క్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ కోసం 9290452954 నెంబరులో సంప్రదించవచ్చు. -
సాఫ్ట్‌బాల్ సారథులు చరణ్, నమ్రత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తలపడే హైదరాబాద్ జిల్లా జట్లను బుధవారం ప్రకటించారు. పురుషుల జట్టుకు చరణ్ కుమార్, మహిళల జట్టుకు నమ్రత సారథ్యం వహించనున్నారు. పురుషుల జట్టు: చరణ్ (కెప్టెన్), కిరణ్ చారి, అజిత్ కుమార్, శ్రీనాథ్, సిద్దేశ్వర్ రెడ్డి, ఆనంద్, రవి, కార్తీక్, జై రాఘవ్, కథార్, చెన్నయ్య, విష్ణు, నర్సిములు, శ్రీకాంత్; కోచ్: చంద్రప్రకాశ్, మేనేజర్: మృత్యుంజయ్. మహిళల జట్టు: నమ్రత (కెప్టెన్), అక్షర, గ్రీష్మ, పూజ, ప్రియాంక, ప్రీతి, ఇందూజా, చేతన, నిఖిత, సాయి ప్రియా, వశిక, శిఖర, ధనుశ్రీ, నుపుర్; కోచ్: చక్రపాణి, మేనేజర్: పూర్వ. -
ఫైనల్లో నిహారిక
సాక్షి, హైదరాబాద్: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాక్సర్ గోనెళ్ల నిహారిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెర్బియాలోని రుమా పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో నిహారిక 80 కేజీల విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నిహారిక 3-0తో గాబ్రియెలి దికొనెతై (లిథువేనియా)పై విజయం సాధించింది. 48 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ గూడూరు రమ్య కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో రమ్య 3-0తో ప్లియా క్రైసులా (గ్రీస్)ను ఓడించింది. -
'సైకిల్ తొక్కండి...లేకపోతే లావైపోతారు'
రాయదుర్గం (హైదరాబాద్) : 'సైకిల్ తొక్కండి.. చాలా మంచిది..లేకపోతే లావైపోతారని...' సినీ హీరో మహేష్‌బాబు సూచించారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో'చక్ దే ఇండియా రైడ్'ను సినీ నటుడు జగపతిబాబు, దర్శకుడు కొరటాల శివతో కలిసి జెండా ఊపి రాయదుర్గంలోని హెచ్‌బీసీ సైక్లింగ్ స్టేషన్ వద్ద మహేష్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని కోరారు. సైక్లింగ్ ఎంతో ఆరోగ్యకరమని, పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఇండిపెండెన్స్‌డే అంటే తనకెంతో ఇష్టమని, ప్రతిసారీ ఉత్సాహంగా జరుపుకుంటానని, ఈ సారి శ్రీమంతుడు విజయంతో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు వివరించారు. సైకిల్ ఎంతో పాపులర్ అయింది : జగపతిబాబు 'శ్రీమంతుడు' సినిమాలో తాను చార్టర్ ప్లేన్‌లో దిగానని, కానీ హీరో మహేష్‌బాబు సైకిల్‌పై వచ్చాడని... దీంతో విలువైన చార్టర్ ప్లేన్ కన్నా సాధారణ సైకిల్ ఎంతో పాపులర్ అయిందని సినీ నటుడు జగపతిబాబు పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమాలో తండ్రీకొడుకులుగా జగపతిబాబు, మహేష్‌బాబులు నటించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ జామ్... కాగా 'చక్ దే ఇండియా రైడ్'ను జెండా ఊపి ప్రారంభించేందుకు వచ్చిన మహేష్‌బాబు, జగపతిబాబును చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. సినీ నటులు వెళ్లేంత వరకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
బక్వా నాచే షురూ కరో
ఫిట్నెస్ త్రూ ఫన్.. సిటీలో ఇదీ ట్రెండ్. స్టెప్ ఎరోబిక్స్ నుంచి మొదలుపెట్టి సల్సా, బాల్రూమ్ స్టెప్స్, హిప్హాప్.. ఇవన్నీ సిటీలో నృత్యాభిలాషుల కన్నా ఆరోగ్యాభిలాషుల కారణంగానే ఆదరణ పొందుతున్నాయనేది నిర్వివాదం. ఇక జుంబా డ్యాన్స్ స్టైల్ అయితే ప్రతి జిమ్, ఫిట్నెస్ సెంటర్లో తప్పక జత చేయాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో వచ్చేస్తోంది బక్వా. - ఎస్.సత్యబాబు నెలన్నర క్రితం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్ ద్వారా సిటీలో అరంగేట్రం చేసింది బక్వా డ్యాన్స్. సదరు ఈవెంట్‌కి మొత్తంగా వచ్చిన స్పందన కన్నా బక్వా యాక్టివిటీకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కొత్త ఫిట్నెస్ మార్గాలు వెతుక్కునే సిటీజనులు ‘ఏమిటీ బక్వా’ అంటూ ఆరా తీయడం మొదలు పెడితే... అప్పటిదాకా దీనిపై అంతగా అవగాహన పెంచుకోని ట్రైనర్లు.. ఒక్కసారిగా నెట్లోకి వెళ్లి బ్లాగులూ, యూ ట్యూబ్ వీడియోలు సెర్చ్ చేసి దీని గురించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించారు. ప్రస్తుతం సిటీలో జుంబా తదితర డ్యాన్స్ యాక్టివిటీల ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకుల్లో పలువురిని బక్వా బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో సిటీలో బక్వా సందడి మొదలుకానుంది. ఆఫ్రికా మూలాలు.. సిటీలో సందడి చేయనున్న బక్వా డ్యాన్స్ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సౌతాఫ్రికన్ వార్ డ్యాన్స్, క్యాపొయిరా, కిక్ బాక్సింగ్, లైట్ బాక్సింగ్, స్టెప్ల కలయిక బక్వా. ఇదొక ఫన్ వర్కవుట్ ప్రోగ్రామ్. లైట్ బాక్సింగ్‌ని సూచించే బీవో, సౌతాఫ్రికన్ వార్డ్యాన్స్, ట్రెడిషనల్ క్వైటోను సూచించే కేడబ్ల్యూఏ నుంచి బక్వా పేరు పుట్టింది. అంతర్జాతీయ ఫిట్నెస్ ప్రముఖుడు పాల్ మార్వి దీని సృష్టికర్త. ఏడేళ్ల కృషితో దీన్ని లాస్ఏంజెల్స్లో లాంచ్ చేశాడు. జన్మతః సౌతాఫ్రికాకు చెందిన మార్వి లాస్ఏంజెల్స్లో లీడింగ్ గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. ఈ బక్వాను తన సొంత క్లాసుల గురించి ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నాడు. తదనంతర కాలంలో ఇది ప్రపంచమంతా పాకింది. తైవాన్, జపాన్, అమెరికా. గ్రీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి చోట్ల హెల్త్పబ్స్లో బక్వా ఇప్పుడు హాట్ వర్కవుట్. విశేషాలెన్నో... దీనిని నేర్చుకోవడానికి డ్యాన్స్‌లో ప్రాథమిక అంశాలు సైతం తెలియనక్కర్లేదు. ప్రపంచంలో సైన్ లాంగ్వేజ్ వినియోగించే ఏకైక వర్కవుట్ ఇదే. అలాగే లెటర్స్, నంబర్స్, హ్యాండ్ సిగ్నల్స్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లు ఉపయోగించి చేసే వినూత్నమైన పోగ్రామ్ బక్వా. ఈ యాక్టివిటీలో పాప్, లాటిన్, హౌస్ మ్యూజిక్‌లను బ్యాక్ గ్రౌండ్‌గా వినియోగిస్తారు. ఇందులో పార్టిసిపెంట్స్‌కి తర్వాతి మూవ్‌ని చెప్పడానికి సైన్లాంగ్వేజ్ని ఉపయోగిస్తాడు ఇన్స్ట్రక్టర్. ఈ వర్కవుట్‌లో అందరూ ఒక గ్రూప్‌గా పాల్గొంటారు. డ్యాన్స్ చేసే సమయంలో అక్షరాలను, అంకెలను పార్టిసిపెంట్స్ తమ పాదాలతో డ్రా (చిత్రణ) చేస్తారు. బక్వా ఎల్, 3, జే, కే ఇంకా డజన్ల కొద్దీ ఇతర బక్వా స్టెప్స్‌ను పాదాలతో డ్రా చేస్తారు. మిగిలిన డ్యాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ తరహాలో స్టెప్స్ 8 కౌంటింగ్ ఇందులో ఉండదు. అసలు ఇందులో స్టెప్స్ కౌంటింగ్ అవసరమే లేదు. బీట్తో పాటు మ్యూజిక్‌ని ఫీలవుతూ కదలడమే. స్టెప్ తెలిస్తే చాలు ఇన్స్ట్రక్టర్ అందించే కొరియోగ్రఫీ అవసరం లేకుండానే ఫాలో అయిపోవచ్చు. ఉపయోగాలెన్నో... అన్ని వయసుల వారికీ తగ్గట్టుగా, అన్ని రకాల ఫిట్నెస్ లెవల్స్ ఉన్నవారికీ నప్పేలా డిజైన్ చేసిన డ్యాన్సింగ్ వర్కవుట్ బక్వా. ఇంటెన్సిటీ ఉన్నవారికీ, కావాలనుకునే వారికీ, లావుగా ఉన్నవారికీ, సన్నగా ఉన్నవారికీ.. ఇలా అందరికీ ఇది ఉపకరిస్తుంది. టోటల్ బాడీ వర్కవుట్‌గా, అత్యధిక కేలరీలను సహజమైన పద్ధతిలో ఖర్చు చేసేదిగా పేరొందింది. అత్యంత సులభంగా అనిపించే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్క సెషన్లో అత్యధికంగా 1,200 కేలరీలు సైతం ఖర్చు చేసే అవకాశం ఉందంటే ఆశ్చర్యమే. ‘జుంబాతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన, సమర్థవంతమైన వర్కవుట్. అనూహ్యమైన స్ట్రెస్ బస్టర్. గంటలో 1,000 కేలరీలు ఖర్చు చేయిస్తుంది. జుంబా కూడా ట్రెడిషనల్ 8 కౌంట్ స్టెప్స్‌ను ఫాలో అవుతుంది. అలాగే దీనికన్నా కాస్త స్లో కూడా. బక్వాకి ఎటువంటి కొరియోగ్రఫీ అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా... ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్స్‌ని, నంబర్స్‌ని మన ఫీట్‌తో డ్రా చేయాలి. ఉదాహరణకు ఎల్, కే, జేలను డ్రా చేయడం లేదా.. మీ దేహాన్ని నంబర్ 3 లాగా కదపడం వంటివి. ఈ డ్యాన్స్‌ను అన్ని వయసుల వారూ ఫాలో కావచ్చు’ అని ముంబైకి చెందిన ట్రైనర్ అంచల్ గుప్తా అంటున్నారు. ఇది కేవలం ఒక వర్కవుట్ మాత్రమే కాదని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటున్నారు దీని రూపకర్త మార్వి. మన చుట్టూ ఉన్నవారితో ఎనర్జీనీ, ఎగ్జయిట్‌మెంట్‌నీ సమానంగా పంచుకునే అద్భుతమైన అనుభవం అంటున్నాడు. హైలెవల్ కార్డియో వర్కవుట్ చేశామనే ఫీలింగ్‌నే కలగనీయనంత పూర్తి వినోదం దీని స్పెషాలిటీ. -
హైదరాబాద్‌కు ఆధిక్యం
తొలి ఇన్నింగ్స్‌లో 338 ఆలౌట్ ⇒ సర్వీసెస్ రెండో ఇన్నింగ్స్ 96/4 ⇒ రంజీ ట్రోఫీ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: సర్వీసెస్ బౌలర్లు పుంజుకున్నప్పటికీ... హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తమవంతుగా రాణించడంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 210/3తో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ మిగతా ఏడు వికెట్లను 128 పరుగులకు కోల్పోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ‘సెంచరీ హీరో’ విహారి ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జోడించి అవుటయ్యాడు. అయితే వికెట్ కీపర్ ఇబ్రహీమ్ ఖలీల్ (91 బంతుల్లో 4 ఫోర్లతో 34)... చివర్లో స్పిన్నర్లు ఆకాశ్ భండారి (53 బంతుల్లో 6 ఫోర్లతో 36 నాటౌట్), మెహదీ హసన్ (51 బంతుల్లో 4 ఫోర్లతో 26) బాధ్యతాయుతంగా ఆడటంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సర్వీసెస్ బౌలర్లలో సౌరభ్ కుమార్ నాలుగు వికెట్లు, సకూజా మూడు వికెట్లు తీసుకున్నారు. 32 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ మూడో రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం సర్వీసెస్ 64 పరుగులతో ముందంజలో ఉంది. ఆట చివరిరోజు బుధవారం సర్వీసెస్‌ను 200 పరుగులలోపు ఆలౌట్ చేస్తే హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలున్నాయి. స్కోరు వివరాలు సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్: 306; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) యశ్పాల్ సింగ్ (బి) సౌరభ్ కుమార్ 35, అక్షత్ రెడ్డి (సి) దేవేందర్ (బి) రోషన్ రాజ్ 0, విహారి (సి) యశ్పాల్ సింగ్ (బి) సౌరభ్ కుమార్ 119, రవితేజ (సి) ప్రతీక్ (బి) రోషన్ రాజ్ 32, అనిరుధ్ (సి) యశ్పాల్ సింగ్ (బి) రోషన్ రాజ్ 31, అహ్మద్ ఖాద్రీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సకూజా 2, ఇబ్రహీమ్ ఖలీల్ (సి) ప్రతీక్ దేశాయ్ (బి) సౌరభ్ కుమార్ 34, ఆశిష్ రెడ్డి (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌరభ్ కుమార్ 15, ఆకాశ్ భండారి (నాటౌట్) 36, మెహదీ హసన్ (సి) పూనియా (బి) సకూజా 26, రవి కిరణ్ (బి) సకూజా 0, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (132 ఓవర్లలో ఆలౌట్) 338 వికెట్ల పతనం: 1-0, 2-74, 3-157, 4-221, 5-224, 6-241, 7-272, 8-284, 9-337, 10-338. బౌలింగ్: సూరజ్ యాదవ్ 14-2-57-0, రోషన్ రాజ్ 16-4-37-3, సౌరభ్ కుమార్ 42-12-92-4, సకూజా 28-8-61-3, దీపక్ పూనియా 19-1-65-0, యశ్పాల్ సింగ్ 3-1-6-0, రజత్ పలివాల్ 5-0-12-0, ప్రతీక్ దేశాయ్ 5-0-5-0. సర్వీసెస్ రెండో ఇన్నింగ్స్: ప్రతీక్ దేశాయ్ (సి) ఖలీల్ (బి) ఆకాశ్ భండారి 16, సౌమిక్ చటర్జీ (సి) ఖలీల్ (బి) రవి కిరణ్ 9, నకుల్ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ భండారి 21, రజత్ పలివాల్ (సి) రవి కిరణ్ (బి) మెహదీ హసన్ 20, దేవేందర్ (బ్యాటింగ్) 20, యశ్పాల్ సింగ్ (బ్యాటింగ్) 6, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (34 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 96 వికెట్ల పతనం: 1-21, 2-29, 3-56, 4-75; బౌలింగ్: రవి కిరణ్ 8-3-18-1, ఆశిష్ రెడ్డి 2-0-11-0, ఆకాశ్ భండారి 13-1-40-2, మెహదీ హసన్ 9-2-19-1, అహ్మద్ ఖాద్రీ 1-1-0-0, రవితేజ 1-0-4-0. -
నవంబర్ 30న హైదరాబాద్ 10k రన్
-
విజేత సాయి భావన
దేవేందర్ యాదవ్ స్మారక మీట్ ఎల్బీ స్టేడియుం: నిజామ్ కాలేజి విద్యార్థి సంఘం వూజీ అధ్యక్షుడు సి.దేవేందర్ యాదవ్ స్మారక రన్లో వుహిళల 2 కిలోమీటర్ల రేసులో బి.సారుు భావన (రన్నర్స్ క్లబ్) విజేతగా నిలిచింది. ఆమె 8ని:39.5 సెకన్లలో గమ్యానికి చేరుకుంది. పి.వునీషా (సెరుుంట్ వూర్టిన్ కాలేజి) రెండో స్థానాన్ని పొందగా... షబ్నమ్ (విల్లామేరీ డిగ్రీ కాలేజి) మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) సౌజన్యంతో హైదరాబాద్ అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఆదివారం ఉదయుం ఏడు గంటలకు నిజామ్ కాలేజి మైదానంలో జరిగారుు. ఈ పోటీల్లో వుహబూబ్‌నగర్ జిల్లాలోని మేకగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ అథ్లెట్లు హవా చెలాయించారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ పోటీల వుుగింపు వేడుకలకు నగర టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర వూజీ వుంత్రి సి.కృష్ణా యూదవ్ వుుఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఫైనల్స్ ఫలితాలు పురుషుల విభాగం: 3 కి.మీ.: 1. ఎస్. క్రాంతి కిరణ్ (9ని:57.9సె-సెరుుంట్ వూర్టిన్), 2. ఎం.ప్రకాశ్ (రన్నర్స్ క్లబ్), 3. సయ్యుద్ వజీర్ ఘోరీ (రన్నర్స్ క్లబ్). అండర్-16 బాలురు 2 కి.మీ: 1. బి.రంగయ్యు (జెడ్పీహైస్కూల్, మేకగూడ), 2.పి.రాయుుడు (జెడ్పీ హైస్కూల్ ), 3.శివం కువూర్ శుక్లా(ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం). అండర్-13 బాలురు 1 కి.మీ.: 1. సి.దీపక్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్), 2.పి.చంద్రశేఖర్ (డిఫెన్స్ ల్యాబ్ స్కూల్), 3. రంజిత్(జెడ్పీ హైస్కూల్). అండర్-10 బాలురు 1 కి.మీ.: 1.కె.అశోక్ (జెడ్పీ హైస్కూల్), 2.శివుడు (జెడ్పీ హైస్కూల్), 3.కె.నవీన్ (జెడ్పీ హైస్కూల్). అండర్-16 బాలికలు 1 కి.మీ.: 1.జి.అనుషా (జెడ్పీ హైస్కూల్), 2. కావ్య (డీపీఎస్, నాచారం), 3. బి. మాధురి (జీహెచ్ఎస్, మూసారాంబాగ్). అండర్-13 బాలికలు 1 కి.మీ.: 1.వై.స్వాతి (శ్రీఅక్షర స్కూల్), 2. సిరి (సీఎంఆర్ హైస్కూల్), 3.బి.లావణ్య (జెడ్పీ హైస్కూల్). అండర్-10 బాలికలు 1 కి.మీ.: 1.శ్రీజ (జెడ్పీ హైస్కూల్), 2.ఎన్.గాయుత్రి (సీఎంఆర్), 3.పూజిత (జెడ్పీ హైస్కూల్). పురుషుల వూస్టర్ (35+) విభాగం: 1.కె.తాయుప్ప (రంగారెడ్డి జిల్లా), 2.ఎస్.కె.వలాలీ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్), 3.డి.సి,ఆనందం (రంగారెడ్డి జిల్లా). -
రెడీ టూ ట్రయథ్లాన్
నగరంలో హైదరాబాద్ ట్రయథ్లాన్ సందడి మొదలైంది. మొన్న మడ్ రన్ నిర్వహించిన గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ (జీహెచ్ఎసీ) ఇప్పుడు మరో మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న నగరంలోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, దంతంపల్లి ఐసీఎఫ్ఏఐ(ఇక్ఫై) దీనికి వేదికగా వూరనుంది. వరుసగా ఐదో ఏడాది జరుగుతున్న ఈ ఈవెంట్లో ఈసారి స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌తో పాటు కొత్తగా 3/4 ఐరన్, పవర్ డువథ్లాన్ కూడా వచ్చి చేరారుు. ఇందులో సుమారు 2,500 మంది పాల్గొంటారని అంచనా. ‘సాధారణ పౌరుల్లో ట్రయథ్లాన్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈవెంట్ వల్ల పోటీదారుల శారీరక, మానసిక ఫిట్నెస్ మెరుగుపడుతుంది. ఆరోగ్యకర జీవనం కోసం కుటుంబాలు పాల్గొనేందుకు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్‌లాగా దీన్ని నిర్వహిస్తున్నాం’ అని జీహెచ్ఎసీ కో-ఆర్గనైజర్ సురేశ్ చెబుతున్నారు. ఐదేళ్ల పైబడినవారికి... ఐదేళ్లపైబడిన వారు పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు సంతకం చేసిన పేరెంటల్ కాన్సెంట్ ఫారమ్‌ను సమర్పించాలి. సైక్లింగ్‌లో పాల్గొనాలనుకునేవాళ్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సైకిల్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని ఈవెంట్లకు ఉన్న ప్రత్యేక అర్హతలు అవసరం. ఇందుకోసం వెబ్సైట్ చూడవచ్చు. ఔత్సాహికులు hyderabadtriathlon.com వెబ్సైట్లో ఎంట్రీలు నమోదు చేసుకోవచ్చు. పోటీలు ఇలా... 3/4 ఐరన్ ఈవెంట్‌ను స్విమ్మింగ్‌లో 2.9 కిలోమీటర్లు, సైక్లింగ్‌లో 135 కిలోమీటర్లు, రన్నింగ్‌లో 31 కిలోమీటర్లు, 1/2 ఐరన్‌ను 1.9 కిలో మీటర్లుగా, స్విమ్మింగ్, సైక్లింగ్ 90 కిలో మీటర్లు, రన్నింగ్ 21.1 కి.మీలుగా, ఒలింపిక్ ఈవెంట్‌ను స్విమ్మింగ్‌లో 1.5 కిమీలు, సైక్లింగ్‌లో 40 కిమీలు, రన్నింగ్‌లో 10 కిలో మీటర్లు నిర్వహిస్తున్నారు. స్ప్రింట్ ట్రయథ్లాన్‌లో సైక్లింగ్ 20 కిలోమీటర్లు, రన్నింగ్ 5 కిలోమీటర్లు, స్విమ్మింగ్ 750 మీటర్లు, నోవైస్ ట్రయథ్లాన్‌లో సైక్లింగ్ 8 కిలోమీటర్లు, రన్నింగ్ రెండు కిలోమీటర్లు, స్విమ్మింగ్ 300 మీటర్లుగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈత రాని వారికి... ఈత రానివారి కోసం పవర్ డూవథ్లాన్, ఒలింపిక్ డూవథ్లాన్, స్ప్రింట్ డూవథ్లాన్, నోవైస్ డూవథ్లాన్ పోటీలుంటాయి. పవర్ డూవథ్లాన్లో పాల్గొనాలంటే ఒక్క హాఫ్ మారథాన్నైనా విజయవంతంగా పూర్తిచేసి ఉండాలి. మిగతా ఈవెంట్లలో ఎవరైనా పాల్గొనచ్చు. ఫినిషర్లకు మెడల్, సర్టిఫికెట్లను జీహెచ్ఏసీ ప్రదానం చేస్తుంది. - వాంకె శ్రీనివాస్ -
బెంబేలెత్తించిన అన్వర్ అహ్మద్
ఈఎంసీసీ 174 ఆలౌట్ ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: అన్వర్ అహ్మద్ ఖాన్ (5/53) ధాటికి ఈఎంసీసీ 174 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో హైదరాబాద్ బాట్లింగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగుల ఆధిక్యం సాధించింది. బుధవారం 118/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో మరో 56 పరుగులు జోడించి ఆలౌటైంది. బాట్లింగ్ బౌలర్లలో అన్వర్‌తో పాటు అనిరుధ్ (3/63) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్‌ను 213/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అచింత్య రావు (65) అర్ధసెంచరీ సాధించగా, రవీందర్ రెడ్డి 32 పరుగులు చేశాడు. కృష్ణచరిత్ 3, రవితేజ 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు దక్షిణ మధ్య రైల్వే తొలి ఇన్నింగ్స్: 249 (సురేశ్ 79, ఫరీద్ 58; హరీశ్ 4/46), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 59/2 ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 298 (విజయ్ 63, శశాంక్ నాగ్ 46; పరంవీర్ 3/35), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 187/2 (సందీప్ 94 బ్యాటింగ్, పార్థ్జాల 73 బ్యాటింగ్) ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 432 (రేయాన్ అమూరి 152, ఇబ్రహీం 89; రామకృష్ణ 3/88), ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 105/2 (మహంతి 63 బ్యాటింగ్). షిండే అజేయ సెంచరీ అమోల్ షిండే (159 బ్యాటింగ్) అజేయ సెంచరీతో ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదట ఫలక్‌నుమా తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రాబ్యాంక్ ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. రోడ్రిగ్వెజ్ (51) రాణించగా, ఫలక్‌నుమా బౌలర్లలో సాకేత్ 4, అహ్మద్ అస్కరి 3 వికెట్లు తీశారు. చెలరేగిన భండారి ఆకాశ్ భండారి ఆల్‌రౌండ్ మెరుపులతో ఎస్బీహెచ్ ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో కాంటినెంటల్‌పై ఘనవిజయం సాధించింది. ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల వద్ద ఆలౌటైంది. భండారి (131) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో 163 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన కాంటినెంటల్ 130 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లోనూ చెలరేగిన భండారి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాంటినెంటల్ 182 పరుగులే చేసింది. -
హైదరాబాద్ బాక్సర్లదే హవా
తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ టోర్నీ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్ జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ బాక్సర్లు విజృంభించారు. రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. 28-30 కేజీల విభాగం ఫైనల్లో ఎం.డి. నవీద్ (నిజామాబాద్)... ఎం.డి. షాహిద్ (మహబూబ్‌నగర్)పై గెలిచి టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి బాక్సింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత జయరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు: 30-32 కేజీలు: 1.తవజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2.ఎం.డి. రయీస్(రంగారెడ్డి). 32-34 కేజీలు: 1.ఎం.డి. రయీస్ (హైదరాబాద్), 2..ఎ. డేవిడ్(రంగారెడ్డి), 34-36 కేజీలు: 1. డొనాల్డ్ విన్స్టన్ (రంగారెడ్డి), 2.అబ్దుల్ రెహ్మాన్(హైదరాబాద్). 36-38 కేజీలు: త్రిజ్యోత్ సింగ్ (హైదరాబాద్), 2. ఎస్. నిఖిల్ రాజ్(మెదక్). 38-40 కేజీలు: 1. నితిన్ (కరీంనగర్), 2.ఉస్మాన్ (హైదరాబాద్). 40-42 కేజీలు: 1.ఎం.డి.సద్దాం (మహబూబ్‌నగర్), 2.డేవిడ్ (హైదరాబాద్), 42-46 కేజీలు: 1.ఎస్. నితిన్ రాజ్ (హైదరాబాద్), 2.హేమంత్ సింగ్ (ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.ఆర్య (రంగారెడ్డి), 2.రాజ్ (మెదక్). 50-52 కేజీలు: 1.దీప్తాంశ్(నల్లగొండ), 2.సి. సాయికుమార్ (ఆదిలాబాద్). 52-54 కేజీలు: 1.ఎం.డి. ఉస్మాన్(హైదరాబాద్), 2.ఎస్.ఎ. గఫార్ (రంగారెడ్డి). -
చెలరేగిన రవితేజ, విహారి
హైదరాబాద్ 341/4 జమ్మూకాశ్మీర్‌తో రంజీ మ్యాచ్ జమ్మూ: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రవితేజ (217 బంతుల్లో 153 బ్యాటింగ్, 17 ఫోర్లు, 2 సిక్సర్లు), హనుమ విహారి (164 బంతుల్లో 109, 18 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట పూర్తిగా రద్దు కావడంతో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ఒక్క రోజులోనే నిర్ణీత ఓవర్లు (90) కూడా పూర్తిగా ఆడకుండానే 300 పైచిలుకు పరుగులు చేయడం విశేషం. రవితేజ, విహారి వన్డేను తలపించేలా వీరవిహారం చేశారు. ఈ సీజన్లో చక్కని ఫామ్‌లో ఉన్న వీరిద్దరు ఈ మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరు 203 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అంతకుముందు హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ తిరుమలశెట్టి సుమన్ (9) విఫలమయ్యాడు. దీంతో జట్టు 22 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (49) అర్ధసెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయినా... రవితేజతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. జమ్మూకాశ్మీర్ కెప్టెన్ పర్వేజ్ రసూల్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా హైదరాబాద్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. సమీవుల్లా బేగ్, రామ్‌దయాళ్ పూనియా, బందీప్ సింగ్ తలా ఓ వికెట్ తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవితేజతో పాటు అమోల్ షిండే (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: సుమన్ (సి) ఒబేద్ హరూన్ (బి) సమీవుల్లా బేగ్ 9; అక్షత్ రెడ్డి రనౌట్ 49; రవితేజ బ్యాటింగ్ 153; విహారి (స్టంప్డ్) హరూన్ (బి) బందీప్ సింగ్ 109; ఖాద్రీ ఎల్బీడబ్ల్యూ (బి) రామ్‌దయాళ్ 8; షిండే బ్యాటింగ్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 341. వికెట్ల పతనం: 1-22, 2-109, 3-312, 4-337 బౌలింగ్: సమీవుల్లా 16-0-97-1, మహ్మద్ గుజ్రీ 16-3-48-0, రామ్‌దయాళ్ 15-3-51-1, ఉమర్ నజీర్ 11-1-39-0, పర్వేజ్ రసూల్ 14-3-54-0, రిషీ 3-1-10-0, బందీప్ సింగ్ 8-2-24-1, మంజూర్దార్ 1-0-10-0. -
అస్సాంతో రంజీ మ్యాచ్ డ్రా
గువాహటి: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అస్సాంపై ఆధిక్యాన్ని సాధించలేకపోయారు. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అస్సాం ఖాతాలో 3 పాయింట్లు చేరగా, హైదరాబాద్‌కు ఒక పాయింట్ దక్కింది. 218/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 132.2 ఓవర్లలో 370 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లు సమష్టిగా రాణించి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బవనక సందీప్ (221 బంతుల్లో 113, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ అమోల్ షిండే (1), రవితేజ (3) ఘోరంగా విఫలమవడంతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ఆటగాడు లేకపోయాడు. ఈ దశలో సందీప్, ఆశిష్ రెడ్డి (65 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో సెంచరీ పూర్తి చేశాడు. అస్సాం బౌలర్లలో అబూ నెచిమ్, అరూప్ దాస్, సయ్యద్ మహ్మద్, తర్జిందర్ సింగ్ తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం జట్టుకు 131 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ఓపెనర్ పల్లవ్ కుమార్ దాస్ (3) రనౌట్ కాగా, మరో ఓపెనర్ శివ శంకర్ రాయ్ (9 నాటౌట్), కునాల్ సైకియా (7 నాటౌట్) అజేయంగా నిలిచారు. హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. సంక్షిప్త స్కోర్లు: అస్సాం తొలి ఇన్నింగ్స్: 501; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 370 (సుమన్ 126, సందీప్ 113; తర్జిందర్ 2/35, అరూప్ దాస్ 2/68), అస్సాం రెండో ఇన్నింగ్స్: 20/1 -
బాలికల విజేత హైదరాబాద్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్లో బాలికల టీమ్ ను హైదరాబాద్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బాలుర టీమ్‌లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌లో ఇటీవల ఈ పోటీలు జరిగాయి. బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ జట్టు 7-4 స్కోరుతో ఖమ్మంపై విజయం సాధించింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 7-5తో కరీంనగర్‌పై, ఖమ్మం 4-3తో వరంగల్‌పై గెలిచాయి. బాలుర విభాగం ఫైనల్లో ఖమ్మం చేతిలో 11-7 స్కోరుతో హైదరాబాద్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 5-3తో వరంగల్‌పై నెగ్గింది. రాష్ట్ర స్కూల్ నెట్‌బాల్ జట్టులో రాధిక జాతీయ స్కూల్ అండర్-14 నెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్లలో హైదరాబాద్ జిల్లా నుంచి రాధికతో పాటు ఆరుగురికి చోటు దక్కింది. ఈ పోటీలు నవంబరు చివరి వారంలో బిలాస్పూర్లో జరుగనున్నాయి. బాలికల జట్టు: పి. రాధిక, భవాని ఠాకూర్ (గవర్నమెంట్ హైస్కూల్ విజయనగర్ కాలనీ), వినయ్శ్రీ (హోలీ ఫ్యామిలీ హైస్కూల్, తిరుమలగిరి). బాలుర జట్టు: రాహుల్(ఆర్యకన్య హైస్కూల్), సాయికిరణ్ (గవర్నమెంట్ హైస్కూల్ కాచిగూడ), సాయి ప్రణీత్ (భాష్యం మోడల్ స్కూల్ అంబర్పేట్) -
బాక్సింగ్ చాంప్ శ్రీకాంత్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన బాక్సింగ్ టోర్నమెంట్లో అండర్-17 బాలుర 50 కేజీల విభాగంలో శ్రీకాంత్ (నృపతుంగ స్కూల్) విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో దుర్గా (మమత హైస్కూల్)పై శ్రీకాంత్ గెలిచాడు. అండర్-14 బాలుర 42 కేజీల విభాగం ఫైనల్లో రవికాంత్ (యురేకా మోడల్ హైస్కూల్)ను ఓడించి పవన్ కల్యాణ్ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్, షేక్‌పేట్) టైటిల్ సొంతం చేసుకున్నాడు. మిగతా ఫలితాలు అండర్-17 బాలుర విభాగం: 46 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్), 2. అఖిల్ శ్రీగిరి (బ్రిలియంట్ స్కూల్). 48 కేజీలు: 1. నవీన్ (ప్రభుత్వ హైస్కూల్, షేక్‌పేట్), 2. కామేశ్ సింగ్ (వనస్థలి హైస్కూల్). అండర్-14 విభాగం: 30 కేజీలు: 1. మహ్మద్ రేయీస్ (ప్రియదర్శిని స్కూల్), 2. మిస్కీమ్ (ప్రభుత్వ హైస్కూల్, ఫస్ట్‌లాన్సర్). 34 కేజీలు: 1. జోసెఫ్ (రిలయెన్స్ స్కూల్), 2. మురళీ కృష్ణ (రాక్‌వుడ్ హైస్కూల్). -
సెమీస్‌లో హైదరాబాద్ ఎలెవన్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్‌లో హైదరాబాద్ ఎలెవన్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో కేరళను చిత్తు చేసింది. మ్యాచ్ మూడో రోజు కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. జాఫర్ జమాల్ (49), అక్షయ్ కొడాత్ (38), సచిన్ మోహన్ (30) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 52 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ప్రజ్ఞాన్ ఓజా 83 పరుగులకు 3 వికెట్లు తీశాడు. అనంతరం 155 పరుగుల విజయలక్ష్యాన్ని హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. తిరుమలశెట్టి సుమన్ (59 బంతుల్లో 56; 10 ఫోర్లు), డెరిక్ ప్రిన్స్ (77 బంతుల్లో 56 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో పాటు సందీప్ (31 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ 34.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసింది. కర్ణాటక విజయం... టోర్నీలో హెచ్‌సీఏ తరఫున బరిలోకి దిగిన రెండో జట్టు హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పరాజయంపాలైంది. ఈసీఐఎల్‌లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ప్రెసిడెంట్స్ ఎలెవన్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ (87 బంతుల్లో 79; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ కుమార్ (41), సందీప్ రాజన్ (32) రాణించారు. అరవింద్ 3, అక్షయ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కర్ణాటక 38.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (70 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (105 బంతుల్లో 81; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి కర్ణాటకను గెలిపించారు. ఢిల్లీని గెలిపించిన మనన్ శర్మ... మనన్ శర్మ (5/57) చెలరేగడంతో ఎన్ఎఫ్సీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గోవాపై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో గోవా నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్లకు 243 పరుగులు చేసింది. స్నేహాల్ (92 బంతుల్లో 81; 4 ఫోర్లు), అమోఘ్ దేశాయ్ (54 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఢిల్లీ 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి సెమీస్ చేరుకుంది. జాగృత్ ఆనంద్ (77 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. -
కేరళను ఆదుకున్న బ్యాట్స్‌మెన్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ తొలి రోజు సోమవారం కేరళ బ్యాట్స్‌మెన్ రాణించారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఎలెవన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ నిర్ణీత 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అక్షయ్ కొడాత్ (111 బంతుల్లో 65; 10 ఫోర్లు), ఆర్ఎస్ రంజిత్ (185 బంతుల్లో 63; 10 ఫోర్లు), అక్షయ్ చంద్రన్ (73 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, మను కృష్ణన్ (76 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో అన్వర్ ఖాన్, ఆశిష్ రెడ్డి, అమోల్ షిండే తలా 2 వికెట్లు పడగొట్టారు. సందీప్ రాజన్ సెంచరీ ఈసీఐఎల్ మైదానంలో కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ సందీప్ రాజన్ (126 బంతుల్లో 106; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం సాధించాడు. అభినవ్ కుమార్ (126 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెంజమిన్ థామస్ (48), ఆకాశ్ భండారి (35) కూడా రాణించడంతో ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 339 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో ఎస్.అరవింద్ 3, అక్షయ్, అబ్రార్, కరుణ్ నాయర్లు తలా 2 వికెట్లు తీశారు. రవికాంత్‌కు 4 వికెట్లు ఏఓసీ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు తమిళనాడును కట్టడి చేసింది. ఫలితంగా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. సురేశ్ కుమార్ (106 బంతుల్లో 65; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, సుశీల్ (45), కౌశిక్ (34), అపరాజిత్ (30) ఫర్వాలేదనిపించారు. రవికాంత్ 4, దినేశ్, అజహరుద్దీన్ చెరో 2 వికెట్లు తీశారు. మనన్ శర్మ 5/77 ఢిల్లీ బౌలర్ మనన్ శర్మ (5/77) రాణించడంతో ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా మొదటి ఇన్నింగ్స్‌లో 69.1 ఓవర్లలో 244 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ (176 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్), స్నేహల్ (119 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. సుమీత్ నర్వాల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఢిల్లీ ఆట ముగిసే సరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. -
ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు వాలీబాల్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ క్రీడల అండర్-14 బాలుర వాలీబాల్ టైటిల్‌ను షేక్పేట్సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాఠశాల (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్) దక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య(హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీస్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్-14 బాలుర వాలీబాల్ ఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 25-18, 25-19, 15-13 తేడాతో బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)పై నెగ్గింది. అంతకుముందు సెమీఫైనల్లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టు 25-15, 20-25, 15-5 స్కోరుతో రామంతపూర్ హెచ్‌పీఎస్ జట్టుపై విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో బేగంపేట్ హెచ్‌పీఎస్ జట్టు 25-17, 25-19 స్కోరుతో ప్రభుత్వ జామియా ఉస్మానియా హైస్కూల్ జట్టుపై విజయం సాధించింది. కేశవ హైస్కూల్ జట్ల శుభారంభం ఖోఖో టోర్నీలో అండర్-14 బాలబాలికల విభాగంలో నారాయణగూడలోని కేశవ స్మారక హైస్కూల్ జట్లు శుభారంభం చేశాయి. గగన్ మహల్‌లోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల మైదానంలో జరిగిన అండర్-14 బాలుర విభాగంలో కేశవ స్మారక హైస్కూల్ 8-1తో అవలీలగా ప్రభుత్వ హైస్కూల్(ఎన్బీటీ నగర్)పై ఘన విజయం సాధించింది. బాలికల విభాగంలో కేశవ స్మారక హైస్కూల్ 2-0తో ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలిచింది. అండర్-17 బాలుర విభాగంలో ప్రభుత్వ హైస్కూల్ (సికింద్రాబాద్ హిల్స్స్ట్రీట్) 12-10తో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌పై, బోరబండ జీహెచ్ఎస్ 14-1తో ఎం.ఎస్ మిషన్ హైస్కూల్‌పై, ఆనంద్ జ్యోతి హైస్కూల్ 20-1తో బ్రిలియంట్ హైస్కూల్‌పై గెలిచాయి. అండర్-14 బాలుర విభాగం ఫలితాలు ప్రగతి హైస్కూల్4-3తో హెచ్వీఎస్పై, యూసుఫ్‌గూడ జీహెచ్ఎస్ 1-0తో న్యూజన్ హైస్కూల్‌పై, షేక్‌పేట్ ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 2-1తో నల్లకుంట జీహెచ్ఎస్పై గెలిచాయి. అండర్-14 బాలికల విభాగం: యూసుఫ్‌గూడ జీహెచ్ఎస్ 1-0తో హెచ్‌వీఎస్ పబ్లిక్ స్కూల్‌పై, సిటీ మోడల్ హైస్కూల్ 11-1తో సెయింట్ ఆన్స్ గ్రామర్ స్కూల్‌పై, హోలీ ఫ్యామిలీ హైస్కూల్ 5-4తో ప్రగతి హైస్కూల్‌పై నెగ్గాయి.