జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన బాక్సింగ్ టోర్నమెంట్‌లో అండర్-17 బాలుర 50 కేజీల విభాగంలో శ్రీకాంత్ (నృపతుంగ స్కూల్) విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో దుర్గా (మమత హైస్కూల్)పై శ్రీకాంత్ గెలిచాడు. అండర్-14 బాలుర 42 కేజీల విభాగం ఫైనల్లో రవికాంత్ (యురేకా మోడల్ హైస్కూల్)ను ఓడించి పవన్ కల్యాణ్ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్, షేక్‌పేట్) టైటిల్ సొంతం చేసుకున్నాడు.
మిగతా ఫలితాలు
అండర్-17 బాలుర విభాగం: 46 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్), 2. అఖిల్ శ్రీగిరి (బ్రిలియంట్ స్కూల్). 48 కేజీలు: 1. నవీన్ (ప్రభుత్వ హైస్కూల్, షేక్‌పేట్), 2. కామేశ్ సింగ్ (వనస్థలి హైస్కూల్).
అండర్-14 విభాగం: 30 కేజీలు: 1. మహ్మద్ రేయీస్ (ప్రియదర్శిని స్కూల్), 2. మిస్కీమ్ (ప్రభుత్వ హైస్కూల్, ఫస్ట్‌లాన్సర్). 34 కేజీలు: 1. జోసెఫ్ (రిలయెన్స్ స్కూల్), 2. మురళీ కృష్ణ (రాక్‌వుడ్ హైస్కూల్).
బాక్సింగ్ చాంప్ శ్రీకాంత్
Published Sun, Sep 15 2013 12:00 AM | Last Updated on Fri, Sep 7 2018 5:34 PM
Advertisement
Advertisement