boxing tournment
-
నాలుగు పతకాలు ఖాయం
చెన్నై: మగోమెడ్ సాలమ్ ఉమఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటారు. ఏకంగా నలుగురు సెమీస్ చేరి భారత్‌కు పతకాలను ఖాయం చేశారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (భారత్) 5–0తో అనస్తాసియ సిగెవ (రష్యా)పై విజయం సాధించింది. 75 కేజీల విభాగంలో పూజా రాణి (భారత్) 4–1తో లారా మమెద్కులోవ (రష్యా)పై గెలిచి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదే విధంగా మహిళల క్వార్టర్స్‌లో నీరజ్ (57 కేజీలు) 4–1తో సయాన సగతేవ (రష్యా)పై గెలవగా... జాని (60 కేజీలు) 5–0తో అనస్తాసియ ఒబుషెంకోవ (బెలారస్)ను ఓడించి సెమీస్ చేరింది. అయితే కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత పింకీ జాంగ్రా (51 కేజీలు)కు మాత్రం క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. ఆమె 0–5తో యులియా అపనసోవిచ్ (బెలారస్) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ గేమ్ పసిడి పతక విజేత గౌరవ్ సొలంకీ (56 కేజీలు), గోవింద్ సహాని (49 కేజీలు), సంజిత్ (91 కేజీలు),అభిషేక్ (52 కేజీలు) క్వార్టర్స్ చేరారు. -
క్వార్టర్స్‌లో హుసాముద్దీన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో జార్జి మొల్వాంట్వా (బోట్స్వానా)పై గెలుపొందాడు. 69 కేజీల విభాగంలో ఆశిష్ కుమార్ 5–0తో పీటర్ సెటినిక్ (క్రొయేషియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల 75 కేజీల విభాగంలో భాగ్యబతి కచారి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో భాగ్యబతి 5–0తో ఎన్గుయెన్ హోంగ్ (వియత్నాం)పై నెగ్గింది. -
శ్యామ్ కుమార్‌కు పతకం ఖాయం
ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 3–2తో సహెన్ సమిక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత్‌కే చెందిన శశి చోప్రా (57 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరింది. -
బాక్సింగ్ చాంప్ రాజు
ఎల్బీ స్టేడియం: తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజి బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 49 కేజీల టైటిల్‌ను ఎన్. రాజు (హైదరాబాద్) కైవసం చే సుకున్నాడు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఫైనల్లో రాజు.. మహబూబ్‌నగర్‌కు చెందిన అఖిల్ శ్రీగిరిపై గెలిచాడు. ఈపోటీల ముగింపు వేడుకలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ బాక్సర్ ఆర్. ప్రవీణ్ కుమార్ సింగ్, కోచ్ ఓంకార్ యాదవ్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 52 కేజీలు: 1. పి. మహేందర్ (హైదరాబాద్), 2. సదానంద్ (రంగారెడ్డి జిల్లా). 56 కేజీలు: 1. సి.హెచ్. ధీరజ్ (హైదరాబాద్), 2. వివేక్ సింగ్ (నల్లగొండ). 60 కేజీలు: 1. వెంకటేశ్వర్లు (మహబూబ్‌నగర్), 2. ఎం.డి. ఇంతియాజ్(కరీంనగర్). 64 కేజీలు:1. ఎస్.డేవిడ్ (హైదరాబాద్), 2. వినయ్ కుమార్ (మెదక్). 69 కేజీలు: 1. ఎస్.సాయి (హైదరాబాద్), 2. ఎం.డి. మతీన్ (కరీంనగర్). 75 కేజీలు: 1. ఆర్. అశోక్ నాయక్ (నల్లగొండ), 2. మనోజ్‌రెడ్డి (రంగారెడ్డి జిల్లా). -
ఫైనల్లో నిఖత్ జరీన్
వోజ్వొదినా (సెర్బియా): నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన యూత్ బాలికల విభాగం 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్ 5-0 పాయింట్ల తేడాతో బాలంటీన్ తన్సియా (నెదర్లాండ్స్)ను ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ 3-0తో అబ్దీ మలికా (అల్జీరియా)పై విజయం సాధించింది. -
బాక్సింగ్ చాంప్ శ్రీకాంత్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన బాక్సింగ్ టోర్నమెంట్లో అండర్-17 బాలుర 50 కేజీల విభాగంలో శ్రీకాంత్ (నృపతుంగ స్కూల్) విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో దుర్గా (మమత హైస్కూల్)పై శ్రీకాంత్ గెలిచాడు. అండర్-14 బాలుర 42 కేజీల విభాగం ఫైనల్లో రవికాంత్ (యురేకా మోడల్ హైస్కూల్)ను ఓడించి పవన్ కల్యాణ్ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్, షేక్‌పేట్) టైటిల్ సొంతం చేసుకున్నాడు. మిగతా ఫలితాలు అండర్-17 బాలుర విభాగం: 46 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్), 2. అఖిల్ శ్రీగిరి (బ్రిలియంట్ స్కూల్). 48 కేజీలు: 1. నవీన్ (ప్రభుత్వ హైస్కూల్, షేక్‌పేట్), 2. కామేశ్ సింగ్ (వనస్థలి హైస్కూల్). అండర్-14 విభాగం: 30 కేజీలు: 1. మహ్మద్ రేయీస్ (ప్రియదర్శిని స్కూల్), 2. మిస్కీమ్ (ప్రభుత్వ హైస్కూల్, ఫస్ట్‌లాన్సర్). 34 కేజీలు: 1. జోసెఫ్ (రిలయెన్స్ స్కూల్), 2. మురళీ కృష్ణ (రాక్‌వుడ్ హైస్కూల్).