
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల 56 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో జార్జి మొల్వాంట్వా (బోట్స్‌వానా)పై గెలుపొందాడు. 69 కేజీల విభాగంలో ఆశిష్ కుమార్ 5–0తో పీటర్ సెటినిక్ (క్రొయేషియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల 75 కేజీల విభాగంలో భాగ్యబతి కచారి సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో భాగ్యబతి 5–0తో ఎన్గుయెన్ హోంగ్ (వియత్నాం)పై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment