వోజ్‌వొదినా (సెర్బియా): నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన యూత్ బాలికల విభాగం 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్ 5-0 పాయింట్ల తేడాతో బాలంటీన్ తన్సియా (నెదర్లాండ్స్)ను ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ 3-0తో అబ్దీ మలికా (అల్జీరియా)పై విజయం సాధించింది.
ఫైనల్లో నిఖత్ జరీన్
Published Sun, Jan 12 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement