
కాకర శ్యామ్ కుమార్
ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 3–2తో సహెన్ సమిక్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత్‌కే చెందిన శశి చోప్రా (57 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment